జాతీయం

బెంగుళూరు క్రైస్ట్‌ కళాశాలలో రక్తదాన శిబిరం

బెంగుళూరు : బెంగుళూరు శివాజి నగర్‌ క్రైస్ట్‌ కళాశాలలో రక్త క్యాన్సర్‌తో సమస్యలు ఎదుర్కొంటున్న బాధితుల్ని ఆదుకునేందుకు ఫిబ్రవరి 4వ తేదీన రక్త దాన శిబిరాన్ని నిర్వహించారుసేకరించిన 85 యూనిట్ల రక్తాన్ని కిద్వాయి క్యాన్సర్‌ ఆస్పత్రిలోని రక్తనిధికి అందించారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ శిబిరానికి కళాశాల ప్రిన్సిపాల్‌ రెవ.షాజు వర్టీన్‌ నేతృత్వం వహించారు. కళాశాల ప్రతినిధులు కవిత, అనిత, ఝాన్సీ, జాబ్‌ పర్యవేక్షణలో విద్యార్ధులు రక్తదానం చేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు