కర్నూల్

నంద్యాల చర్చికి మహిళా బిషప్

 ఇండియాలోనే తొలి మహిళ బిషప్‌గా నంద్యాల అధ్యక్ష ఖండానికి ఎన్నిక కావడం సంతోషకరమని నంద్యాల అధ్యక్ష ఖండం అస్తులను కాపాడాల్సిన బాధ్యత బిషప్‌లదే అని చర్చి అఫ్ సౌత్ ఇండియా సినాడు డయాసిస్ మోడరేటర్ రైట్.రెవ. దైవకటాశం అన్నారు. ఆదివారం నంద్యాల హోలీక్రాస్ కెథడ్రాల్ చర్చి అవరణలో దక్షిణ ఇండియా సంఘం నంద్యాల అధ్యక్ష మండల ఐదవ బిషప్‌గా పట్ట్భాషేకం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే చారిత్రత్మకమైన 2 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన డయాసిస్‌కు తొలి మహిళ బిషప్‌గా రెవ. ఎగ్గొని పుష్పలలిత బాధ్యతలు తీసుకోవడం సంతోషకరం అన్నారు. లక్షలాది మంది ఆరాధించే ఆలయానికి నంద్యాల అధ్యక్ష ఖండానికి ఒక మహిళ బిషప్‌గా ఎన్నికకావడం శుభపరిణామం అన్నారు. నంద్యాల అధ్యక్ష ఖండానికి 5వ బిషప్‌గా బాధ్యతలు స్వీకరించిందన్నారు. చర్చి అఫ్ సౌత్ ఇండియా సినాడ్ డిప్యూటి మోడరేటర్ రై.రెవ.డా.జి.దైవాశిర్వాదం మాట్లాడుతూ 22 మంది బిపప్‌లుగా నంద్యాలకు పనిచేశారన్నారు. ఇగ్లండ్, ఆమెరికా, కొరియా తదితర దేశాల్లో పర్యటించి సేవలు అందించిందన్నారు. స్ర్తిలలో గొప్ప పర్వదినాన్ని చుస్తున్నామన్నారు. భారతదేశంలో జద్గురువులాంటి వారు సినాడు డయాసిస్ మోడరేటర్ అన్నారు. ఐదు పర్యాయములలో పవిత్ర వర్ణానికి సాంకేతాలు చూపిస్తు పుప్పలలితను బిషప్‌గా పట్ట్భాషేకం చేయడం సంతోషకరమన్నారు. దేవునికృప వల్ల పరిచర్యను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు.అందరి సహాకారంతో అధ్యక్షఖండ అభివృద్ధికి పాటుపడుతా గతంలో పనిచేసిన బిషప్ బాటలో తానుకూడ అధ్యక్షఖండ అభివృద్ధికి పాటుపడతానని అందరి సహాకారంతో పురోభివృద్ధి సాధిస్తానని నూతనంగా బాధ్యతలు తీసుకున్న తొలి మహిళా బిషప్ రై.రెవ. ఎగ్గొని పుష్పలలిత అన్నారు. ప్రపంచంలో ఇద్దరు మహిళా బిషప్‌లుగా ఉన్నారని, ఇండియాలో తొలి మహిళ బిషప్‌గా నన్ను ఎన్నుకోవడం అదృష్టమన్నారు. దక్షిణ ఇండియా సంఘం మద్రాస్‌వారిచే దేవునికృప వల్ల, దేవుని ఆశీర్వాదం వల్ల తనకు ఈ పదవి లభించిందన్నారు. దేవుని దయతో నంద్యాల డయాసిస్ పరిధిలో ఉన్న అస్తులన్నింటిని కాపాడుతానని ఆమె అన్నారు. 30 సంవత్సరాలుగా పరిచర్య చేస్తు సాంఘీక, సంక్షేమ కార్యక్రమాల్లో సేవలు అందించినట్లు తెలిపారు. ఇగ్లాండ్, ఆమెరికా తదితర దేశాల్లో పర్యటించి పరిచర్య చేసినట్లు తెలిపారు. సంఘ చరిత్రలోనే తొలిమహిళ బిషప్‌గా రావడం సంతోషకరమని చైర్మన్లు ప్రసన్నకుమార్ బాబులు అన్నారు. ఈకార్యక్రమంలో బిషప్‌లు రై.రెవ.వి ప్రసాద్‌రావు, రాయలసీమ డయాసిస్ బిషప్ డా,బిడి ప్రసాద్‌రావు, చర్చి అఫ్ సౌత్ ఇండియా సినాడ్ జనరల్ సెక్రటరీ ఎం ఎం పిలిఫ్, డైరెక్టర్ క్రిస్ట్ఫర్, విజయమ్మ, జేమ్స్, ఆనందరావు, యేసురత్నం, వరప్రసాద్, డేవిడ్, త్యాగరాజు, రవిలతో పాటు డయాసిస్ పరిధిలోని అన్ని సంఘాలకు చెందిన కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు