జాతీయం

16 ఏళ్ళ అమ్మాయిపై నెల రోజులు మత బోధకుడి హత్యాచారం

కోల్‌కత్తా : పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఓ మత బోధకుడు కిరాతక చర్యకు ఒడిగట్టాడు. హుగ్లీలోని పునరావాస కేంద్రంలో 16 ఏళ్ళ అమ్మాయిపై మత బోధకుడు హత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అమ్మాయిని చిత్ర హింసలు పెట్టినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సంఘటనపై ఓఎన్జీవో స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గురప్‌భస్తరా క్రిస్టియన్‌ హోమ్‌కు చెందిన మత బోధకుడు మైనర్‌ బాలికను నెల రోజులుగా చిత్రహింసలకు గురి చేస్తూ, ఆమెపై హత్యాచారానికి పాల్పడినట్లు ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. ఏడాది కాలంగా బాధితురాలు ఆ హోమ్‌లో ఉంటోంది. మత బోధకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై చిత్రహింసలు, హత్యాచారం కింద అభియోగాలు మోపారు. సంఘటనపై దర్యాప్తు చేయడానికి, పరిశీలించడానికి పోలీసు అధికారులను హోమ్‌కు పంపించినట్లు సదరు సబ్‌డివిజనల్‌ ఆఫీసర్‌ సుదీప్‌ సర్కార్‌ చెప్పారు. మత బోధకుడిని ఫిబ్రవరి 4వ తేదీన కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. బాధితురాలిని అదే జిల్లాలో ప్రభుత్వం నడిపే హోమ్‌కు తరలించారు. పశ్చిమ బెంగాల్‌ సాంఘిక సంక్షేమశాఖ అధికారులు హోమ్‌ను సందర్శించి బాధితురాలిని, అందులోని వారిని విచారించారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు