హైదరాబాద్

క్రైస్తవ మైనారిటి యువతకు ఆర్ధిక సహాయం

హైదరాబాద్‌ : క్రైస్తవ మైనారిటి యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రైస్తవ (మైనారిటీల) ఆర్ధిక సంస్థ సాయం చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ జనవరి 30వ తేదీన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనిట్‌ మొత్తంలో 50శాతం లేదా గరిష్ఠంగా రూ.లక్ష వరకు సంస్థ నుంచి సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్‌ రుణం ద్వారా పొందాల్సి ఉంటుందని వివరించారు. అభ్యర్ధులు దరఖాస్తుతో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఆదాయ, వయస్సు, నివాసం, కమ్యూనిటీ సర్టిఫికెట్లు జతచేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రక్రైస్తవ మైనారిటీల ఆర్ధిక సంస్థకు సమర్పించాలని తెలిపారు. వివరాలకు 1800-425-1068, 040-2339224 ను సంప్రదించాల్సిందిగా కోరారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు