చిత్తూర్

ఘనంగా ఎస్‌ఎఎల్‌సి బిషప్‌ పట్టాభిషేకం

తిరుపతి : సౌత్‌ ఆంధ్రా లూధరన్‌ చర్చి 61వ కన్వెన్షన్‌లో బిషప్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రెవ.కె.యేసు ప్రసాద్‌, రెవ.ఎన్‌.డేవిడ్‌ పట్టాభిషేకం తిరుపతిలోని సెయింట్‌ పాల్‌ పీటర్స్‌ లూధరన్‌ చర్చిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఎల్‌సికి సంబంధించిన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలతో పాటు చెన్నపట్నంలోని పేరిష్‌ల నుంచి పాస్టర్లు, చర్చి పెద్దలు సుమారు 700 మంది హాజరై కొత్తగా ఎన్నికైన బిషప్‌ ప్రెసిడెంట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన వక్తగా రెవ.డా||రావెల జోసఫ్‌ దైవ సందేశాన్ని అందించి పట్టాభిషేక ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బత్తిన విజయ కుమార్‌ పట్టాభిషేక శిలాఫలకాన్ని ఆవిష్కరించి సందేశాన్ని అందించారు. గూడూరు శాసనసభ్యుడు సునీల్‌కుమార్‌ విచ్చేసి బిషప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ సభ్యుల స్తుతి గీతాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరాధన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్‌ ప్రెసిడెంట్‌ మాట్లాడుతూ తమ ఎన్నికకు కృషి చేసి అందరినీ ఏకతాటిపై నడిపిస్తున్న బత్తిన విజయకుమార్‌కి ధన్యవాదాలు తెలిపి ఘనంగా సంఘ సభ్యులు సన్మానించారు. ఎస్‌ఎఎల్‌సి కోశాధికారి అరుణోదయ కుమార్‌ బైబిల్‌ పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బిషప్‌లు రైట్‌ రెవ.జి.డి.సుందరశేఖర్‌, రెవ.చంథ్రేఖర్‌, ఎస్‌ఎఎల్‌సి ఉపాధ్యకక్షుడు శుభాకర్‌, కార్యదర్శి ప్రేమ్‌కుమార్‌, దిన్‌కర్‌బాబు, వివిధ విభాగాల చైర్మన్లు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు