జాతీయం

మత అసహనాన్ని మొగ్గలోనె తుంచేయాలి

- ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రోహిణి, - పికె చిత్రంపై దాఖలైన వ్యాజ్యం కొట్టివేత

న్యూఢిల్లీ :
నానాటికీ పెరిగిపోతున్న మతపరమైన అసహనాన్ని మొగ్గలోనె తుంచేయాలి. లేకుంటే అది కార్చిచ్చులా దేశమంతా వ్యాపిస్తుంది అని ఢిల్లీ హైకోర్టు ఓ తీర్పులో హెచ్చరించింది. పికె చిత్రంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని తిరస్కరిస్తూ చీఫ్‌ జస్టిస్‌ జి.రోహిణి, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ ఎండ్లాల ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. సమాజంలో పెరిగిపోతున్న మతపరమైన అసహనానికి ఈ పిటిషనే ఉదాహరణ. వివాదం విషమించకముందే దాన్ని ముగించేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే అది కార్చిచ్చులా దేశవ్యాప్తంగా దుష్పరిణామాలను వ్యాప్తి చేస్తుంది అని వ్యాఖ్యానించింది. ఇక పికె చిత్రంలో మతపరంగా రెచ్చగొట్టే అంశాలేవీ లేవని, సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించే ధోరణిలో చిత్రీకరించారని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాక ఓ చిత్రం చూడాలా? వద్దా అనే విషయం ప్రేక్షకుడి ఇష్టమని పేర్కొంది. అలాగే ఈ చిత్రంలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలున్నాయని, వాటిని తొలగించాలని పిటిషనర్‌ చేసిన అభ్యర్ధనను కూడా కోర్టు తోసిపుచ్చింది.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు