జాతీయం

చర్చిలో దుండగుల విధ్వంసం

న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో జనవరి 14వ తేది బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై చర్చి అసిస్టెంట్‌ ఫాదర్‌ బాలాజీ మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు తెల్లవారు జామున 4.20 ని||లకు బైక్‌ పై వచ్చారు. అందులో ఒకరు కిటికి బద్దలు కొట్టి చర్చి ప్రాంగణములోకి ప్రవేశించాడు. అక్కడున్న మదర్‌ మేరీ విగ్రహాన్ని విసిరేసినట్లు తెలిపారు. దుండగుల దుశ్చర్యలన్నిన చర్చిలోని సిసి టివిలో రికార్టు అయ్యాయని ఆ పుటేజ్‌ ఆధారంగా దాడి చేసిన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. దుండగులపై గతంలోనూ రెండు చర్చిల్లో దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు