జాతీయం

క్రిస్మస్‌పై లోక్‌సభలో రగడ

సర్కారు పాఠశాలలకు యధాతధ సెలవుకు ఒకెన్యూఢిల్లీ : క్రిస్మస్‌ రోజున సిబిఎస్‌ఇ పాఠశాలలను తెరచి ఉంచాలన్న దానిపై వివాదం సమసిపోయింది. దీనికి సంబంధించి కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ సోమవారం ఢిల్లీలో ఒక ప్రకటన చేశారు. వాజ్‌పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని సత్పరిపాలన దినోత్సవం నిర్వహణకు క్రిస్మస్‌రోజు ప్రభుత్వ పాఠశాలలను తెరచి ఉంచాల్సిందిగా సర్కారు ఒక సర్క్యులర్‌ జారీ చేసినట్లుగా వచ్చిన వార్తలలో వాస్తవం లేదని ఆమె అన్నారు. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ పండుగను యధాతధంగా జరుపుకుంటారనీ, ఆ రోజున పాఠశాలలు మూసివేసి ఉంచుతారనీ స్మృతి సోమవారం పార్లమెంట్‌ వెలుపల చెప్పారు. అయితే పాఠశాలలన్నీ మూసివేసినా ప్రభుత్వ ఆధ్వర్యంలోని జవహర్‌ నవోదయ విద్యాలయాల విద్యార్ధులకు సత్పరిపాలనపై ఆన్‌లైన్లో వ్యాసరచన పోటీ ఉంటుందని ఇరానీ తన ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. కాగా, క్రిస్మస్‌ రోజున పాఠశాలలను తెరవాలంటూ ప్రభుత్వం ఎలాంటి సర్క్యులర్‌ జారీ చేయలేదని మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ఉభయ సభల్లో వేర్వేరుగా స్పష్టం చేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు