అదిలాబాద్

ఫిలదెల్పియా పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మెగా క్రిస్మస్‌

కొత్తపేట : ఫిలదెల్పియా పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మెగా క్రిస్మస్‌ వేడుకలు కొత్తపేట మండలం పినిపివారిపేట జి.ఆనందరావుగారి మందిర ఆవరణములో  డిసెంబర్‌ 2వ తేది మంగళవారం ఉదయం 10 గం||లకు పి.పి.డబ్ల్యు.ఎ.మెగా క్రిస్మస్‌ సంబరాలు అత్యంత వైభవముగాను, దేవునికి మహిమకరముగాను జరిగినవి. ఈ క్రిస్మస్‌ వేడుకలకు సాకా జ్ఞాన ప్రసాద్‌ అధ్యక్షత వహించగా, పి.పి.డబ్ల్యు.ఎ.ప్రెసిడెంట్‌ రెవ.విల్సన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ రెవ.సిహెచ్‌.ఆనందరావు, సెక్రటరీ రెవ.జాన్‌బాబు, జాయింట్‌ సెక్రటరీ రెవ.కె.కరుణ కుమార్‌, ట్రెజరర్‌ రెవ.యోహానులు ప్రముఖపాత్ర వహించారు. ఈ క్రిస్మస్‌ పండుగలో ఆయా సంఘాలనుండి సంఘ పాస్టర్ల సహకారముతో వేలకొలది సంఘ విశ్వాసులు హాజరైనారు. ప్రముఖ రాజకీయ నాయకులు కొత్తపేట ఎమ్మెల్యే సిహెచ్‌.జగ్గిరెడ్డి, కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ ఆకుల రామకృష్ణ, జిల్లా ఎస్‌.సి.సెల్‌.వై.ఎస్‌.ఆర్‌.సి.పి.నాయకులు గొల్లపల్లి డేవిడ్‌రాజు, వై.ఎస్‌.ఆర్‌.సి.పి.మార్గన గంగాధర్‌, పలివెల రావులపాలెం మండల జెడ్‌పిటిసి సాకా ప్రసన్న కుమార్‌, రావులపాలెం సి.ఆర్‌.సి.సెక్రటరీ నాగిరెడ్డి మొదలగు నాయకులు పాల్గొని క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగలకు ముఖ్య ప్రసంగీకులుగా రెవ.ఎన్‌.జోసఫ్‌ ఆనంద్‌పాల్‌ పాల్గొని క్రీస్తుపుట్టుక ప్రజలందరికి రక్షణ తెచ్చిన రోజని ఈయనే నిజమైన దేవుడని అమూల్యమైన సందేశం అందించినారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు