విశాఖ

అద్భుతంగా జరిగిన జెసిఎన్‌ఎమ్‌ ఆశీర్వాద సభలు

విశాఖపట్నం : నవంబర్‌ 25,26,27 తేదీలలో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన జెసిఎన్‌ఎమ్‌ ఆశీర్వాద సభలు అద్భుతంగా జరిగాయి. ఈ సభలలో దైవజనులు కె.శ్యామ్‌ కిషోర్‌ దైవ వర్తమానం అందించి స్వస్థత ప్రార్ధనలు చేసారు. అనేకులు స్వస్థతలు పొంది సాక్ష్యములు ఇచ్చారు. హుద్‌హుద్‌ తుఫాన్‌ విశాఖకు నష్టాన్ని కలిగిస్తే ఆశీర్వాద సభలు విశాఖకు గొప్ప దీవెన తెచ్చాయని పలువురు పేర్కొన్నారు. విశాఖపట్నం చరిత్రలో ఎన్నడూ రానంతమంది విశ్వాసులు ఈ సభలకు వచ్చారని, ఇంత పెద్ద గ్రౌండ్‌ 3వ దినాన్న సరిపోలేదని ఆర్గనైజర్‌ జి.మేత్యూపీటర్‌ తెలిపారు. సభలకు సంబంధించిన ఏర్పాట్లు మహా ఘనంగా, ఏ ఇబ్బంది లేకుండా చేసినప్పటికి 3 రోజులు ట్రాఫిక్‌ జామ్‌ వల్ల వాహనాలకు ఇబ్బంది కలిగిందని కన్వీనర్‌ రెవ.డా||యన్‌.విజయరాజు తెలిపారు. ఈ సభలలో కల్వరి బాప్టిస్ట్‌ చర్చి వారి సహకారాన్ని కొనియాడుతూ, క్రిస్టియన్‌ యూత్‌ విశాఖ క్వయర్‌ చక్కని పాటలతో దేవుని మహిమపరిచారని యస్‌.సూర్యారావు, రాజు, లోకల్‌ పాస్టర్స్‌ సుందర్రావు, సామ్యేల్‌రాజులు అందించిన సహకారం గొప్పదని విజయరాజు తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు