హైదరాబాద్

యేసును అవమానించిన వారిని శిక్షించాలి

హైదరాబాద్‌ : యేసు క్రీస్తుకు పెళ్లయిందంటూ 'ది లాస్ట్‌ గాస్పల్‌' అనే పుస్తకంలో అవాస్తవాలను ప్రచురించిన లండన్‌కు చెందిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆల్‌ ఇండియా దళిత క్రైస్తవ సమాఖ్య జాతీయ కార్యదర్శి జెరూషలేము మత్తయ్య, తెలంగాణ క్రైస్తవ సేన ప్రతినిధులు నాగళ పోచయ్య, యోగేశ్‌రావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. దేవుడు లేడనే కొందరు హేతువాదులు ప్రపంచ స్థాయిలో కుట్రలు చేసి యేసు క్రీస్తుకు పెళ్లయిందని చిత్రీకరించి అపఖ్యాతి పాల్జేస్తున్నారని ఆరోపించారు. కేవలం గుర్తింపు కోసమే ఇలాంటి పుస్తకాలను ముద్రిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే కుట్ర చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ బ్యారీ ఎవిసన్‌, సింషాజాకో బోవిషీలు ఇలాంటి నకిలీ పుస్తకాల్ని ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు. మన దేశ రాజ్యాంగాల్ని ఉల్లంఘించి మత విశ్వాసాలను కించపరిచే ఇలాంటి వార్తలను ప్రచురించడం తగదని అభిప్రాయపడ్డారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు