జాతీయం

లిమ్కా రికార్డ్స్‌లో 112 ఏళ్ల వృద్ధురాలు

కేరళ : లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో తొలిసారి ఓ భారతీయ వృద్ధ మహిళ పేరు చేరింది. 112 ఏండ్ల కుంజనమ్‌ ఆంథోని ఇప్పుడు దేశంలోనే అత్యంత వృద్ధ మహిళ. అవివాహిత అయిన ఆమె ప్రస్తుతం త్రిసూర్‌లోని అమలా మెడికల్‌ కాలేజీ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నది. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ పిపి పీటర్‌ ఆమెను హాస్పటల్లో కలుసుకున్నారు. జీవించి ఉన్న అత్యంత వృద్ధ మహిళగా గుర్తిస్తూ ఆమెకు లిమ్కా సంస్థ సర్టిఫికెట్‌ను అందజేసింది. స్థానిక క్యాథలిక్‌ చర్చి ఇచ్చిన బాప్టిజం సర్టిఫికెట్‌ ఆధారంగా ఆమె వయసును నిర్ధారించారు. ఆమె మే 20, 1903 లో పుట్టినట్లుగా సర్టిఫికెట్‌లో ఉంది.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు