విశాఖ

1న జాషువా డానియల్‌ భూస్థాపితం

 విశాఖపట్నం : చెన్నైలో ఇటీవల కన్నుమూసిన లేమెన్స్‌ ఇవాంజికల్‌ ఫెలోషిప్‌ ఇంటర్నేషనల్‌ అధ్యకక్షుడు జాషువా డానియల్‌ అంత్యక్రియలు నవంబర్‌ 1న జరగనున్నాయి. 1928 ఫిబ్రవరి 6న కాకినాడలో జన్మించిన డానియల్‌ చివరి శ్వాస వరకు దేవుని సేవకు అంకితమయ్యారు. ఈయన అంతర్జాతీయ స్థాయిలో గొప్ప దైవజనులుగా పేరు తెచ్చుకున్నారు. బహుభాష ప్రజ్ఞాశాలి. తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతి, హిందీ, అస్సామి, బెంగాల్‌, పంజాబ్‌, ఒడియా అనేక ఇతర భాషలలో క్రైస్తవ సందేశాలిచ్చారు. ఇండియాలోనే కాకుండా ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగ్‌పూర్‌, థాయిలాండ్‌, ఇండోనేషియా, బర్మా, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో దేవుని సేవచేసి ఘనతను చాటుకున్నారు. ఆయన పలు ఆధ్యాత్మిక గ్రంధాలు రచించారు. అక్టోబర్‌ 18న కన్నుమూసిన డానియల్‌కు చెన్నైలోని కీల్‌పాక్‌ సెమెట్రీలో నవంబర్‌ 1న మధ్యాహ్నం 3.30 గం||లకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రజల సందర్శనార్ధం ఆయన పార్ధివదేహాన్ని రెడ్‌హిల్స్‌ దగ్గరలోని సిరినియం అనే విలేజ్‌ బ్యూలాతోట (చెన్నై) లో ఆ రోజు ఉదయం 5 గం||ల నుంచి మధ్యాహ్నం 12 గం||ల వరకు ఉంచుతారు. జ్ఞాపకార్ధకూటం నవంబర్‌ 2న ఆదివారం మధ్యాహ్నం బ్యూలా తోటలోనే జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు