ఖమ్మం

ఘనంగా బిషప్‌ కటాక్షమ్మ పాల్‌రాజ్‌ వర్ధంతి

భద్రాచలం : ఆసియా ఖండానికి మొదటి మహిళా బిషప్‌ అయిన రైట్‌ రెవ.డాక్టర్‌ బిషప్‌ కటాక్షమ్మ పాల్‌రాజ్‌ 17వ వర్ధంతి సభ సెయింట్‌పాల్స్‌ లూధరన్‌ చర్చిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1996లో ఎ.కటాక్షమ్మ మొట్టమొదటిసారిగా మనదేశంలో మహిళా బిషప్‌గా నియమించబడింది. ఆమె భర్త పాల్‌రాజ్‌ మరణానంతరం ఈ పదవిలో ఆమె నియమించబడింది. చర్చిని అభివృద్ధి చేసేందుకు ఆమె ఎన్నో త్యాగాలు చేసి తుదకు చర్చి పరిచర్యలోనే మరణించారని అన్నారు. ఎటపాక గ్రామంలో గల వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, అనాధ బాల బాలికలకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి అధ్యకక్షులు రెవ.పి.జాన్సన్‌, డా||కె.అబ్రహాం, డా||కె.రాధామంజరి, జకర్య, స్థానిక పాస్టర్‌ ఎం.ఆశీర్వాదం, సంఘ సభ్యులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు