కడప

క్రైస్తవుల హక్కుల పరిరక్షణ ఐక్యవేదిక కమిటీ ఎన్నిక

కడప : పరిశుద్దాత్మ పరిచర్యలు మందిరంలో బుధవారం క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ వేదికలలో అడిషనల్‌ గవర్నర్‌ బిషప్‌ డాక్టర్‌ ఆనంద్‌పాల్‌, ఎపి సౌత్‌జోన్‌ ప్రత్యేక కార్యదర్శి రెవ.ఐ.సంతోష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బిషప్‌ ఎం మనోహర్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బిషప్‌ ఆనంద్‌పాల్‌ మాట్లాడుతూ క్రైస్తవ హక్కుల పరిరక్షణకై ప్రత్యేక చట్టం చేయాలని, తెలంగాణ ప్రభుత్వంలో క్రైస్తవులకు మంచి పదవులిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా మంచి పదవులివ్వాలని కోరారు. రెవ.ఐ.సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రతి పేద పాస్టర్‌కు రెండు వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని, 7 లక్షలు చర్చి నిర్మాణాలకు ఇవ్వాలన్నారు. అలాగే ప్రతి కుటుంబంలో సమాధుల స్థలం కేటాయించాలన్నారు. ఎంపి సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ క్రైస్తవులపై దాడులను అరికట్టాలని, అలాగే ప్రభుత్వం నుండి క్రైస్తవులకు క్రిస్టియన్‌ మైనార్టీ సేవలు, పధకాలు, రుణాలు అందించడానికి ప్రభుత్వ అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిషప్‌ దేవన్న, దానియేలు, శామ్యూల్‌ శ్రీనివాసులు, జయరాజ్‌, రెవ.భాస్కర్‌, రెవ.మోజెస్‌, కృష్ణకుమార్‌, రూబేన్‌ డి.ఎల్‌.కె.అరుణ, ఆరోగ్యమ్మ, బ్రదర్‌ బండి ఏసన్న తదితరులు పాల్గొన్నారు. 


 తాజా వీడియోలు 




తాజా వార్తలు