హైదరాబాద్

ప్రార్ధన ప్రకటనలకై హైకోర్టులో పిల్‌

హైదరాబాద్‌ : దైవ ప్రార్ధనలతో అనారోగ్యాన్ని నయం చేస్తామంటూ ప్రకటనలిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తులు, సంస్థలపై క్రిమినల్‌ చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దీనిని హైదరాబాద్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త టి.ధనగోపాల్‌రావు దాఖలు చేసారు. 'జీసస్‌ కాల్స్‌' సంస్థకు చెందిన డాక్టర్‌ పాల్‌ దినకరన్‌ దైవ ప్రార్ధనలతో రోగాలను నయం చేస్తానంటూ వివిధ మాధ్యమాల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని పిటిషనర్‌ తెలిపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు