హైదరాబాద్

క్రైస్తవ ఆస్తులను పరిరక్షించాలి

హైదరాబాద్‌ : ఎన్నో ఏళ్లుగా అన్యాక్రాంతమవుతున్న క్రైస్తవ మతస్తుల ఆస్తులను పరిరక్షించడంతో పాటు 746/747 జివొను రద్దు చేసి తమకు రక్షణ కల్పించాలని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని కోరారు. రాష్ట్ర క్రిస్టియన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో జనాభా ప్రాతిపదికన 30 శాతం బడ్జెట్‌ను కేటాయించాలని కోరారు. జెరుసలేం యాత్రను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆంగ్లో ఇండియన్‌ కమ్యూనిటీ వారికి ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు తహశీల్దార్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. వీరి విజ్ఞప్తులకు స్పందించిన మంత్రి పల్లె... సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ప్రధానమంత్రి 15 సూత్రాల కమిటీ రాష్ట్ర సభ్యులు నాగేశ్వరరావు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఆనంద్‌, ముత్తయ్యలు ఉన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు