హైదరాబాద్

క్రిస్టియన్‌ మైనార్టీల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రకటనపై హర్షం - హైదరాబాద్‌

రాంనగర్‌ : తెలంగాణ రాష్ట్రంలోని క్రిస్టియన్‌ మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక నిధులను ఏర్పాటు చేస్తానని సిఎం కెసిఆర్‌ ప్రకటించడం పట్ల ముషీరాబాద్‌ నియోజకవర్గంకు చెందిన క్రిస్టియన్‌ మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం రాంనగర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో క్రిస్టియన్‌ మైనార్టీ నాయకులు ఆర్‌.మోజెస్‌, రాజ్‌కుమార్‌ డేవిడ్‌, ఎల్‌.డి.సామ్‌సన్‌, అబ్రహం, మృత్యుంజయ, ప్రసన్నలు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవులు శ్మశానవాటిక కోసం నగర శివారు ప్రాంతంలో స్థలాలను కేటాయిస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టం రూపొందించాలని వారు కెసిఆర్‌ను కోరారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు