ప్రకాశం

బాపట్లలో ఇండియా సెంట్రల్‌ డేరిటర్‌

 బాపట్ల: బాపట్ల రైలు పేటలో గల సాల్వేషన్‌ ఆర్మి చర్చ్‌ నందు ఆంధ్ర, మద్రాస్‌ సాల్వేషన్‌ ఆర్మి సంస్థల ఆధ్వర్యంలో ఇండియా సెట్రల్‌ డేరిటర్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు సాల్వేషన్‌ ఆర్మి కమిషనర్‌ లాల్‌ జామ్‌ లావా, నిమిన్స్‌ కామ్‌ సింగ్‌ లు ఆఫ్రికా నుండి వచ్చి ఈ కార్యక్రమములో పాల్గొని చెల్లయ్య మొని, మల్లికా మొనిలను రాష్ట్ర సాల్వేషన్‌ ఆర్మి కామెండల్‌గా నియమించారు. 10 డివిజనులు, 5 జిల్లాల నుండి వచ్చిన పాస్టర్‌ చెల్లయ్య మొని, మల్లికా మొనిలను ఘనముగా సన్మానించారు. ఈ కార్యక్రమములో మేజర్‌ బి.జి ప్రకాష్‌ రావు, మేజర్‌ జోషియ్య, మేజర్‌ విలియం, మేజర్‌ ఫిలిప్‌ రాజు, మేజర్‌ సుగుణ రాజు, కండల్‌ ఎడ్విన్‌ మర్సి తదితరులు పాల్గొన్నారు. అనంతరము ప్రేమ విందుతో ముగించామని స్థానిక సాల్వేషన్‌ ఆర్మి జూనియర్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ శ్యామ్‌ లివింగ్‌స్టన్‌ తెలియజేశారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు