హైదరాబాద్

దైవారాధనతోనే మానసిక ప్రశాంతత : మెదక్‌ బిషపహైద్రాబాద్‌ :
దైవారాధన మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని దక్షిణ భారతదేశ సంఘ ప్రధాన పీఠాధిపతులు, మెదక్‌ బిషప్‌ డా||గోవాడ దైవాశీర్వాదం అన్నారు. రూ.3.50 కోట్ల ఖర్చుతో సనత్‌నగర్‌లోని జెక్‌ కాలనీలో నూతనంగా పునర్నిర్మించిన సిఎస్‌ఐ సెయింట్‌ పాల్స్‌ చర్చిని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దైవచింతన కలిగినవారు అందరితో ప్రేమ, సానుభూతి కలిగి ఉంటారన్నారు. అనంతరం ఆయన సతీమణి డా||రమణి రమ్యకృపా దైవాశీర్వాదంతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం చర్చి ప్రెసిబిటర్‌ ఇన్‌చార్జి రెవరెండ్‌ ఎం.జయానంద్‌ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని మెదక్‌ అధ్యక్ష మండలంలో మెదక్‌ చర్చి తరువాత రెండో అతిపెద్ద చర్చిగా సనత్‌నగర్‌ సెయింట్‌పాల్స్‌ చర్చి గుర్తింపు పొందుతుందన్నారు. ఒకేసారి 2500 మంది భక్తులు ప్రార్ధనలు చేసే ప్రత్యేకత కలిగిన చర్చి నిర్మాణం దైవకృపగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు కె.శామ్‌సంగ్‌, అమృత్‌సాగర్‌, సామ్యూల్‌ సిమన్‌, సి.హెచ్‌.సుధీర్‌, దీనదయాళ్‌, డి.ప్రసాదరావు, నిత్యానందం, ఇమ్మానియేల్‌ ప్రేమ్‌కుమార్‌, శరత్‌, రిచర్డ్‌ తదితరులు పాల్గొన్నారు


 తాజా వీడియోలు 
తాజా వార్తలు