యవ్వనస్తులుPost Date:2014-04-18//No:9

స్కాట్లాండులో ఒక్క యౌవనుడు కూడా లేడా?

డా||అలెగ్జాండర్‌డఫ్‌ అనే ఆయన చాలా కాలము హిందూ దేశములో మిషనరీగా ఉండి సేవ చేసినారు. తన వృద్ధాస్యములో స్వదేశమైన 'స్కాట్లాండు' దేశమునకు తిరిగి వచ్చారు.

స్కాట్లాండు దేశపు సంఘములో జరిగిన ఒక పెద్ద కూటములో డా||అలెగ్జాండర్‌డఫ్‌ ప్రసంగించినారు. ప్రసంగము ముగిసిన తరువాత ఆ కూటములో నుండిన యౌవనస్థులను చూచి హిందూ దేశములో మిషనరీగా సేవ చేయుటకై తమ జీవిత సమర్పణకై పిలుపునిచ్చాడు. కాని ఆ కూటములో ఉండిన యౌవనస్థులలో ఒక్కరు కూడ ఆ పిలుపునంగీకరించుటకై ముందుకు రాలేదు.

వృద్ధుడైన ఆ మిషనరీ ఆ పిలుపును గొప్ప శబ్దముతో అనేకసార్లు వారికిచ్చినందుకాయన అలసిపోయి సొమ్మసిల్లి పడిపోయినారు. వెంటనే అక్కడనున్న వారిలో కొద్దిమంది ఆయనను వేదికనుండి మోసికొనిపోయినారు. ఒక వైద్యుడు చాల శ్రద్ధతో ఆయనను పరీక్షించుచూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా డా||అలెగ్జాండరు తన శక్తినంతను కూడగట్టుకొని, కండ్లు తెరచి నేనెక్కడనున్నాను అని ఆతురతతో అడిగారు. అప్పుడు ఆ డాక్టరు 'అయ్యా! మీరు దయచేసి నెమ్మదిగా పడుకొనండి, మీ గుండె చాలా బలహీనముగా నున్నది. మిమ్ములను మీరు శ్రమ పెట్టుకొనవద్దని అన్నారు.

కాని ఆ వృద్ధ మిషనరీ నెమ్మదిగా ఉండలేదు. ఆయన తన బలమంతా ఉపయోగించి పైకిలేచి నడవాలని ప్రయత్నించారు. ఒక వైపున డాక్టరు, మరియొక వైపున ఆ కూటపు నాయకుడు పట్టకొనియుండగా తలనెరసిన ఆ వృద్ధ మిషనరీ తిరిగి మెల్లగా వేదికనెక్కాడు. ఆయన ధైర్యము చూచిన ప్రజా సమూహము ఆయనకు మర్యాదగా పైకిలేచి నిలబడ్డారు. తరువాత ఆ మిషనరీ తిరిగి అక్కడున్న యౌవనస్థులకు ఈలాగున పిలుపునిచ్చారు.,br>
మన దేశము యొక్క విక్టోరియా మహారాణి హిందూ దేశపు సేవకై సైనికులు కావాలని పిలుపునిస్తే వందలకొలది యౌవనస్థులు మహారాణి పిలుపునందుకొనుటకు పరుగెత్తుకొని వస్తారు కదా? కాని రాజులరాజైన యేసుక్రీస్తు పిలుస్తున్నప్పుడు ఎవ్వరునూ ముందుకు రావటానికి యిష్టపడుటలేదే'? అని దుఃఖముతో చెప్పి కొద్దిసేపు మౌనముగా నిలబడినారు. మరల హిందూదేశమునకు యిచ్చుటకై ఇకనుండి స్కాట్లాండులో యౌవనస్థులు లేదనేది సత్యమేనా? అని అడిగారు. అయినప్పటికిని ఎవరును జవాబివ్వలేదు. స్థలమంతా ఎంతో నిశ్శబ్దముగానున్నది.

హిందూదేశములోనున్న లక్షలాది ప్రజలకు యింకను సువార్త చెప్పబడలేదే అనే గొప్ప భారము ఆ వృద్ధుడైన మిషనరీని నలచి వేసింది. అప్పుడాయన గొప్ప తీర్మానముతో, 'సరే హిందూ దేశమునకు మిషనరీగా పంపుటకై స్కాట్లాండు దేశములో ఒక్క యౌవనస్ధుడు కూడా లేడు. పరవాలేదు వృద్దాప్యములోను, బలహీనతలోనున్న నేను ఉన్నాను కదా! నేను తిరిగి హిందూదేశము వెళ్ళుతాను యికనుండి బోధించే శక్తి నాకు లేకపోయినా పరవాలేదు ఆ గంగానది తీరములో నేను పడుకొని అక్కడనే మరణిస్తాను దానిద్వారా హిందూదేశములోనున్న ప్రజలు తమ యొక్క ఆత్మలను గురించి చింతించగలిగిన ఒక వ్యక్తియైనా స్కాట్లాండు దేశమునుండి వచ్చాడే అని తెలుసుకోవాలి' అని చెప్పి తడుములాడుకుంటూ ఆ వృద్ధుడైన అలెగ్జాండర్‌డఫ్‌ వేదికనుండి నెమ్మదిగా దిగుటకై తిరిగాడు. ఆఖరుగా అక్కడ కదలిక ఆరంభమైనది. ఆ కూటములో నుండిన యౌవనస్థులందరు తాము కూర్చున్న స్థలములనుండి ఒక్క ఉదుటున పైకిలేచి గొప్ప శబ్దముతో 'నేను వెళ్ళుతాను, నేను హిందూదేశమునకు వెళ్ళుతాను' అని అరిచారు.

ఆ వృద్ధుడైన మిషనరీ చనిపోయిన తరువాత ఆ యౌవనస్థులలో అనేకమంది హిందూదేశమునకు వెళ్ళి అక్కడ సువార్త వ్యాపించని ప్రాంతములకు మిషనరీలుగా వెళ్ళి సువార్త భారమును మోసికొని తిరిగిన దానిని బట్టి తమ జీవితములను త్యాగముచేసి, అనేక ఆత్మలను యేసుప్రభువుయొద్దకు తీసికొని వచ్చినారు. - నిజమైన సంఘటనలు 
స్కాట్లాండులో