యవ్వనస్తులుPost Date:2014-04-11//No:8

యవ్వన జ్వాల క్రీస్తుకు కావలసినవాడు.. యువకుడంటే!!!

కౌమార థ దాటినవాడు యువకుడు

కన్నవారికి సహకరించేవాడు యువకుడు

కాలాన్ని సద్వినియోగం చేసుకునేవాడు యువకుడు

కష్టపడటానికి ఇష్టపడేవాడు యువకుడు

కలలను నిజంచేసుకునేవాడు యువకుడు

కార్యసాధనలో ముందుండేవాడు యువకుడు

కటికచీకటిలో కాంతిని నింపేవాడు యువకుడు

కలిగియున్నవాటిని పంచేవాడు యువకుడు

 కొందరిలోనైన స్పూర్తిని నింపేవాడు యువకుడు

కోకిలలా బ్రతకాలనుకునేవాడు యువకుడు

కోరికలను జయించేవాడు యువకుడు

కోపమును అణుచుకునేవాడు యువకుడు

కోటికొక్కడు అనిపించుకునేవాడు యువకుడు

కొండలను పిండిచేయగలవాడు యువకుడు

కీడును జయించువాడు యువకుడు

క్రీస్తుకు కావలసినవాడు యువకుడు

క్రీస్తు కొరకు జీవించేవాడు యువకుడు

కలకాలం గుర్తుండిపోయే వారంతా యువకులే.

కల్వరి సిలువకు సాకక్షులైనవారంతా యువకులే

క్రీస్తును కలిగినవారంతా యువకులే. మరి నీవు? -నవీన్‌
యవ్వన