యవ్వనస్తులుPost Date:2014-04-04//No:7

యవ్వనజ్వాల ప్రేమను గురించి శాస్త్రీయ సత్యాలు

1. శాస్త్రవేత్తల నోట ప్రేమంటే....


కిక్‌ ఎక్కించే ప్రేమ కొంతకాలమే ఉంటుందనేది శాస్త్రవేత్తల మాట. ప్రేమికులకు కలిగే స్పందనలన్నీ హార్మోన్ల ప్రభావమేనని పరిశోధనల్లో తేటతెల్లమైంది. ప్రేమ వెనక ఉన్న ఈ హార్మోన్ల హంగామా ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.

2. ప్రేమకి మూలకం ఉందా?

ప్రియుడు లేదా ప్రియురాలు ఎదురైనప్పుడు కలిగే శారీరక స్పందనలకు మూలం హార్మోన్లే. ప్రియురాలితో చూపు కలవగానే, చేయి తగలగానే మెదడు నుంచి ఫినైల్‌థలామిన్‌ అనే రసాయనం విడుదలవుతుంది. అరచేతుల్లో చెమటలు పట్టడం, మోకాళ్లు వణకడం ఈ హార్మోన్‌ ప్రభావమే. దీని ప్రభావం పెరిగే కొద్దీ ఆకలి ఉండదూ, దప్పికుండదూ అని పాడుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రేమ మూలకం (ఉళిఖీలి ఖళిజిలిబీతిజిలి) కొద్ది మోతాదులో చాకెలెట్‌లో ఉంటుంది. అందుకనే వాలెంటైన్‌ డే రోజు చాకెలెట్ల అమ్మకాలు పుంజుకుంటాయి.

3.ప్రేమలో ఉండే మూడు హార్మోన్లు:

ఇష్టమైన వారిని చూడగానే మీ కళ్లు ఎందుకు మెరుస్తాయి? గుండె ఎందుకు పరుగులు తీస్తుంది? ప్రపంచం చుట్టివచ్చిన ఫీలింగ్‌ ఎందుకు కలుగుతుంది? ఎప్పుడైన ఆలోచించారా? దీని వెనుక మూడు హార్మోన్ల ప్రభావం ఉంది. ఒక మనిషి పై వ్యామోహం కలగడానికి అడ్రినలిన్‌, డోపమైన్‌, నారెఫి నెఫ్రిన్‌లే కారణం. మీకు నచ్చిన వారిని చూడగానే బాడీలో ఈ రసాయనాలు విడుదలై గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తప్రసరణ పెరుగుతుంది. వీటి మోతాదు ఎక్కువయ్యే కొద్దీ ఆ వ్యక్తి వ్యామోహం ఎక్కువవుతుంది. వీటి ప్రభావంతోనే ప్రేమికులు ప్రారంభంలో గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుకుంటారు. నూతనోత్సాహంతో తుళ్లిపడుతూ ఉంటారు. ఈ థలో ప్రియుడు లేదా ప్రియురాలు ఓరకంట చూడగానే ఆక్సిటోసిన్‌ విడుదల అవుతుంది.

4. ప్రేమలో ఉండే మత్తు:

మన సబ్‌ కాన్షియస్‌ మైండ్‌ కోరుకుంటున్న లక్షణాలు ఉన్న వ్యక్తి కనిపించగానే లవ్‌ కెమికల్స్‌ విడుదలై ప్రేమ మత్తులో పడిపోతాం. ఈ మత్తు కాలం ఆర్నెల్ల నుంచి మూడేళ్ల వరకే ఆ తరువాత లవ్‌ కెమికల్స్‌ ప్రభావం క్రమేపీ తగ్గుతుంది. ప్రేమలో కిక్‌ ఉండదు. అందుకే కొంతమంది ఈ కిక్‌ కోసం తరచుగా ప్రేమికులను మారుస్తూ ఉంటారు. ఒక బంధంలో కిక్‌ తగ్గిన వెంటనే మరో బంధాన్ని వెతుక్కుంటారు. ఇదంతా కెమికల్‌ గడబిడ. ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతో మనం చూస్తున్నదంతా ఇదే. ఈ లవ్‌ కిక్‌ బాగా ఎక్కినవారు ఎదుటివారి భావాలను అర్థం చేసుకోకుండా ప్రేమించాలంటూ దాడులకు పాల్పడుతుంటారు.
యవ్వనజ్వాల