యవ్వనస్తులుPost Date:2014-03-28//No:6

చరిత్ర చెప్పే సాక్ష్యంమత్తుమందు కనిపెట్టిన 'సర్‌జేమ్స్‌సింప్సన్‌ (1811-1870)' ను మనం ఎంతగానో అభినందించాల్సిందే... 'అరే! ఇదేంటీ ప్రపంచంలో కోట్లాదిమంది మత్తుమందులకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకొంటుంటే మత్తుమందును కనిపెట్టిన వ్యక్తిని అభినందించడమేంటీ? అనుకొంటున్నారా? ఈ మత్తుమందు ఆ మత్తుమందు కాదండీ..., ఇది రోగులకు ఆపరేషన్‌ చేసేమందు నొప్పిలేకుండా ఇచ్చే మత్తుమందు... ఇప్పుడైనా 'సర్‌ జేమ్స్‌ సింప్సన్‌' అభినందిస్తారా లేక 'ఆ అదేం గొప్ప విషయంకాదులే'.. అని తేలికగా తీసి పారేస్తారా!!? అలా తేలికగా తీసిపారేసే ఆలోచన మీలోగాని ఉంటే ఎప్పుడైనా మత్తుమందు తీసుకోకుండా కనీసం మీ పుప్పిపన్నునైనా తీయించుకోవడానికి ప్రయత్నించి చూడండి!! అప్పుడు తెలుస్తుంది మీకు 'సర్‌ జేమ్స్‌ సింప్సన్‌' విలువ.

పళ్ళ డాక్టర్‌ దగ్గరకు భయంకరమైన పుప్పిపన్ను బాధతో వెళ్ళాడో రోగి. ఈ పన్ను పీకించుకోవడానికి ఎంతవుతుంది సార్‌! అడిగాడు ఆ రోగి... ఆ ఎంతోకాదు యాభై రూపాయలవుతుందంతే..' చెప్పాడు పళ్ళ డాక్టర్‌! 'ఏంటీ' ఒక్క నిమిషంలో పీకే పన్నుకి యాభైరూపాయలే..' 'ఆందోళనగా అడిగాడు రోగి' సరే! రోజంతా పీకుతూ ఉంటాలే ఇలా వచ్చి ఇక్కడ కూర్చో...' చెప్పాడు డాక్టర్‌.

ప్రజలు ఇలాంటి బాధలు పడటం ఇష్టంలేని సర్‌జేమ్స్‌ సింప్సన్‌ ఎంతో కష్టపడి మత్తుమందును కనిపెట్టాడు. నేడు ఎంతో మంది రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ వైద్యరంగాన్ని పూర్తిగా మార్చివేసిన ఈ మత్తుమందును కనుగొనే గొప్ప విజ్ఞానం సర్‌జేమ్స్‌ సింప్సన్‌ ఎలా సంపాదించాడు? క్లోరోఫాంను కనిపెట్టి వైద్యరంగం రూపురేఖలను పూర్తిగా మార్చివేసిన ఈ గొప్ప శాస్త్రవేత్త ప్రభువును వెంబడించిన మంచి విశ్వాసి... తన ప్రతీ విజయం వెనుకా ఆ దేవుని శక్తి దాగియుందని చాటిచెప్పే గొప్ప సాక్షి!! శాస్త్రవేత్తగా తను సాధించిన గొప్ప విజయం కన్నా పాపాన్ని జయించడం ద్వారా తను పొందుకొన్న విజయమే గొప్పదని లోకమిచ్చిన జ్ఞానంకన్నా దేవుడిచ్చిన జ్ఞానమే అమూల్యమైనదని బహిరంగంగా ప్రకటించేవాడు సర్‌జేమ్స్‌ సింప్సన్‌, నా కుమారుడా... జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము (సామె 3:21). - మీరు జయజీవితం పొందగలరు
చరిత్ర