యవ్వనస్తులుPost Date:2015-02-13//No:44
అన్న, తమ్ముడు
ఒక రైతు కుటుంబంలో అనేకమంది పిల్లలుండేవారు. వారంతా గ్రామ పొలిమేరలో పెరిగారు. వారి తండ్రి భక్తిగల క్రెస్తవుడు. వాళ్ళంతా చిన్నప్పుడే ప్రార్థించడం, నీతిగా జీవించడం నేర్చుకొన్నారు. అన్నను మనం సందేశ్ అని, చిన్నవాణ్ణి రాజ్ అని పిలుద్దాం.
సందేశ్ ఏదో ఒకటి సాధించాలనే మనస్తత్వంగల వ్యక్తి. కాబట్టి అతడు పెద్దవాడయ్యాక గ్రామం వదిలి పట్టణానికొచ్చాడు. అతడు కంప్యూటర్ కోర్సులు చదివాడు. అందులో అతను నిపుణుడని అందరూ భావించారు. అనతి కాలంలోనే అతనికి ఒక పెద్ద కార్యాలయంలో ఉద్యోగం వచ్చింది. అతడు ఇతరులతో పాటు ఆ ఉద్యోగంలో చేరాడు. కార్యాలయంలోని వ్యక్తులు బాగానే పనిచేస్తున్నారు. వారిలో అనేకులు ఇరవై ఏండ్ల వయస్సులో ఉన్నారు. అందరూ దూరప్రాంతాలకు చెందిన వారే. వారు ఉన్నతంగా జీవిస్తున్నట్లు చూపించుకొంటున్నారు. తనను పాతకాలం మనిషిగా ఎవరూ భావించకూడదని సందేశ్ అనుకున్నాడు. అందుకే అందరితోపాటు కుళ్ళు జోకులకు నవ్వేవాడు. అతడు టెలివిజనులోని చూసే సెక్స్ కార్యక్రమాల గురించి మాట్లాడేవాడు. కొందరు ఇంట్లో బూతు చిత్రాలు, కంప్యూటర్లో అశ్లీల చిత్రాలను చూసేవారు. దాని గురించి వారు మాట్లాడుకోవడం సందేశ్ విన్నాడు. అతడు వాటినెన్నడు చూడలేదు గనుక వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాని ఒకరోజు సాయంత్రం అతడు తన స్నేహితుని ఇంటికి వెళ్ళి మధ్య రాత్రి వరకు అశ్లీల చిత్రాలు చూశాడు. అవి అతనికి నచ్చలేదు. కాని అదే ఉన్నతమైన జీవితమని అతడు భావించాడు.
కొన్నిసార్లు అతడు తన తల్లిదండ్రుల బోధ గురించి ఆలోచించేవాడు ప్రార్ధించి సరిగా జీవించాలని అది గుర్తు చేసేది. కాని అతడు ఇలా అనుకున్నాడు. 'దీని గురించి మా నాన్నగారికేమి తెలియదు. అయినా ఇది ఎవరిని గాయపరచదు'. స్నేహితుల కారణంగా అతని భాష కూడా మారుతోందని అతడు గమనించాడు. ఇంతకు మునుపు 'దేవుడు' అని పలికేటప్పుడు చాలా జాగ్రత్తపడేవాడు. ఇంట్లో అందరూ అలాగే ఉండేవారు. కాని అతని స్నేహితులేమో 5 నిమిషాల సంభాషణలోనే ఎన్నోసార్లు 'ఓరి దేవుడా' అని వ్యర్ధంగా ఉచ్ఛరించేవారు. కొంతకాలం పాటు అతడు దాన్ని నివారించాడు. దేవుని నామాన్ని గౌరవించాలని అతడు చిన్నప్పుడే నేర్చుకున్నాడు. కాని స్నేహితులు మాత్రం 'ఓరి దేవుడా' అని అతని చుట్టూ అంటూనే ఉన్నారు. ఆ అలవాటు మానుకోవాలని ప్రయత్నించాడు. కాని అతడు కూడా వారిలాగే అనడం మొదలుపెట్టాడు.
చుట్టూ జరిగేది అతన్ని ప్రభావితం చేస్తోంది. ఇప్పుడతను ఏ మాత్రం ప్రార్ధించడం లేదు. కార్యాలయంలో దేవుడు ఏ మార్పు తెస్తున్నట్లుగా అతనికి అనిపించలేదు.
కాని అతని తమ్ముడైన రాజ్ మాత్రం గ్రామంలోని తన ఇంట్లోనే ఉన్నాడు. అతడు గొర్రెలు కాచుకొంటూ తండ్రికి సహాయపడ్డాడు. అతడు తన జీవితాన్ని మెరుగుపరచుకోవాలని ఆశించాడు. అందుకు అతడు బి.ఎ. కోర్సును కరస్పాండెన్స్లో చదివాడు. ఆ తరువాత అతడు లా (న్యాయశాస్త్రం) చదవాలనుకొన్నాడు. రాజ్ పట్టణానికి వెళ్ళి లా డిగ్రీని ముగించి కొంత అనుభవం గడించాలని తండ్రి చెప్పాడు. అదే సమయంలో సందేశ్ కంపెనీలో ఒక జూనియర్ క్లర్క్ కావాలి. సందేశ్ చేస్తున్న కంపెనీలోనే రాజ్ కూడా ఉద్యోగంలో చేరాడు. సందేశ్ పై అంతస్థులో ఉన్నత స్థానంలో ఉన్నాడు గనుక వారిద్దరు కలిసే అవకాశం లేదు. అయినా రాజ్ మాత్రం సందేశ్ కంటే విభిన్న మనస్తత్వం గల వ్యక్తి. అతడు పట్టణానికి వెళ్ళగానే ఒక మంచి సంఘాన్ని కనుగొన్నాడు. అతడు క్రైస్తవ స్నేహితులను సంపాదించుకొన్నాడు. అతడు క్రైస్తవునిగా ఆనందించాడు. తాను యేసును నమ్మానని ఎవరికి తెలిసినా అతడు పెద్దగా పట్టించుకొనేవాడు కాదు.
పనిచేసే పరికరాలన్నిటిమీద భగవంతుడి ఆశీస్సులు కోరుకొనే దసరా పూజ అక్టోబరు నెలలో వచ్చింది. సందేశ్ పనిచేసే కార్యాలయంలో ఇలా జరిగింది. బాస్‌కు ఐశ్వర్యం కావాలని ఆశించాడు గనుక ప్రతి ఒక్కరూ పూజలో పాల్గొనాలని చెప్పాడు. అతడు ఒక పూజారిని, వాయిద్యకారుని పిలిచాడు. పూజారి చుట్టూ తిరిగి నీళ్ళు చల్లుతూ కంప్యూటర్లపై విభూది బొట్లు పెట్టాడు.
ఆ సందర్భంలో సోదరులు చేయాల్సిన పనేమిటి? సందేశ్ తానేమీ చేయలేనని భావించాడు. అతడు క్రైస్తవుణ్ణి అని తన పనిచేసే చోట ఇతరులకు చెప్పలేదు. అతడు కేవలం పేరుకే క్రైస్తవుడని వారంతా భావించారు. అతని కంప్యూటరు మీద పూజారి విభూది పెట్టినప్పుడు అతడేమీ అనలేదు. తన తమ్ముడేం చేస్తాడోనని అతడు విస్తుపోయాడు. క్రింది అంతస్థులో పూజ జరుగుతున్నప్పుడు ఏమి జరుగుతుందేమోనన్న ఆసక్తితో అతడు క్రిందికి వెళ్ళాడు. వారు రాజ్ బల్ల వద్దకొచ్చి అతని కంప్యూటర్‌పై విభూది బొట్లు పెట్టాలని ప్రయత్నించారు. కాని 'దయచేసి అలా చేయకండి, నేను క్రీస్తు అనుచరుణ్ణి. నా పనిని దీవించమని క్రీస్తుకు ప్రార్ధన చేస్తాను. నా కంప్యూటర్‌పై విభూది గుర్తులు నాకొద్దు' అని అతడు స్పష్టంగా, సూటిగా వారికి చెప్పాడు. అప్పుడు వెంటనే తోటి ఉద్యోగుల నుండి కాదు గాని అతని అన్నయైన సందేశ్ నుండి గుర్రుమనే శబ్ధం వినబడింది. 'ఏమనుకొంటున్నావురా నువ్వు? ఇలా చెప్పినందుకు బాస్ నిన్ను ఉద్యోగం నుండి తీసేయొచ్చని నీకు తెలుసా? నీ ఉద్యోగం ఊడి పోవడం ఖాయం. ఊరికెళ్ళి ఆ గొర్రెలనే కాచుకోరాదూ?' అన్నాడు.
విచిత్రం ఏమిటంటే, ఆ గదిలో ఉన్న వాళ్ళంతా రాజ్‌ను గౌరవించారు. అతని సొంత విశ్వాసానికి ఎవరూ నొచ్చుకోలేదు. కాని సందేశ్‌కు ఎందుకు అంత కోపమొచ్చిందో వారికి అర్ధం కాలేదు. సందేశ్ బలహీనతను, అనగా పరిస్థితులచేత మార్చబడిన వ్యక్తిని రాజ్ బట్టబయలు చేశాడనేదే సందేశ్ అసలు సమస్య.