యవ్వనస్తులుPost Date:2015-02-06//No:43

ప్రేమతోనే విజయం సాధించాలి ''...కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే....' (1కొరింథి13:13).

కొన్ని నెలల క్రితం ఓ లైఫ్‌ స్టయిల్‌ పత్రికలో ఒక సంఘటన ప్రచురితమైంది. అనిత అనే అమ్మాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఉద్యోగం కోసం భారత్‌ నుంచి అమెరికా వెళ్ళి నాలుగైదేళ్ళవుతుంది. తల్లిదండ్రులు ఇండియాలోనే ఉన్నారు. అనిత బాగోగుల్ని యుఎస్‌లో ఉంటున్న ఆమె అంకుల్‌ చూస్తుంటారు.

  ఉద్యోగంలో చేరి కొన్నాళ్ళయ్యాక అనిత తన సహోద్యోగి ప్రేమలో పడింది. అతన్ని తన అంకుల్‌ ఇంటికి వీకెండ్స్‌లో డిన్నర్‌లకు కూడా ఆహ్వానించేది. ఎం.ఎస్‌. చేస్తున్న అంకుల్‌ కుమార్తె శ్వేత కూడా అనిత బాయ్‌ ఫ్రెండ్‌ కమ్‌ లవర్‌తో చనువుగా ఉండేది. వారిద్దరి మధ్య చనువు అనుకోకుండా శారీరక సంబంధానికి దారి తీసింది.

  ఇది తెలిసిన అనిత తట్టుకోలేకపోయింది. తన కజిన్‌ తనను దారుణంగా మోసం చేసిందని ఆమెలో ఆగ్రహం పెల్లుబికింది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఉద్యోగాన్ని పట్టించుకోవడం మానేసి అదే ధ్యాసలోకి వెళ్ళిపోయింది. కారు డ్రైవర్‌ చెప్పిన టైంకి రాకపోయినా, బాస్‌ తనను వెంటనే లోనికి రమ్మనకుండా బయట వెయిట్‌ చేయించినా ఆమె తీవ్ర అసహనానికి లోనయ్యేది. క్రమంగా ఆరోగ్యం దెబ్బతింది. ఎసిడిటీ, నరాల బలహీనతతో అనారోగ్యం పాలైంది. ఈ లోగా ఇండియా నుంచి వచ్చిన ఆమె సిస్టర్‌ పరిస్థితి చూసి అనితను ఓ మంచి సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్ళింది.

  మొత్తం కేసు విన్నాక భారత్‌కే చెందిన సైకియాట్రిస్ట్‌ మందులేవీ లేకుండా ఒకే ఒక్క సలహా ఇచ్చాడు. శత్రువులను క్షమించు, నీ ఆరోగ్యం బాగుపడుతుంది.

 నా వల్ల కాదు, నా కజిన్‌ చేసిన ద్రోహానికి మనసు రగిలిపోతోంది' అని అనిత మళ్ళీ ఆవేశపడింది. 'ఈ ద్వేషమే నీలో రోగంలా మారి నిన్ను తినేస్తోంది.  క్షమాగుణం ఉన్న చోటే మనశ్శాంతి, ఆరోగ్యం ఉంటాయి' అని డాక్టర్‌ నచ్చచెప్పాడు.

  'బట్‌ ఎలా?'

'అందరిని ప్రేమించటం నేర్చుకో'

'ప్రేమిస్తే క్షమించగలవు. ప్రేమ ఉన్న చోట అన్ని సమస్యలూ పరిష్కారమౌతాయి'.

అనిత డాక్టర్‌ సలహానే మందుగా భావించింది. ఇప్పుడామె ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ దక్షిణాసియా వ్యవహారాల సి.ఇ.వొ.

ఈ ప్రపంచంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవగలిగిన వ్యక్తి ఒక్క ప్రేమించే హృదయం ఉన్నవాడు మాత్రమే. ప్రేమించలేని వ్యక్తి ఎన్నిసార్లు గెలిచినా చివరికి ఓడిపోవాల్సిందే. ప్రేమకు అంతపవరుంది. సంకుచితత్వం లేని ప్రేమను పెంపొందించుకోగలిగితే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా రాణించవచ్చు. ఎందుకంటే సృష్టిలోని ఏ శక్తయినా దీని ముందు మోకరిల్లుతుంది.

మానవ సంబంధాలలో మ్యాజికల్‌ మార్పుల్ని తీసుకురాగల ప్రేమను మీలో పెంచుకోండి. అందరికీ పంచండి. పంచిన కొద్దీ పెరిగే ఈ ప్రేమను వ్యాప్తి చేసే పనిని ఇవాళంతా మీరు బిజీగా గడపబోతున్నారు.
ప్రేమతోనే