యవ్వనస్తులుPost Date:2014-09-19//No:33

యవ్వనజ్వాల యువత కావలెను!- తమ తల్లిదండ్రులకు విధేయులై మరణము వరకు వారి బాధ్యతను స్వీకరించే యువత కావలెను - యేసు వలె (లూకా 2:51; యోహా 19:25-27)

- లైంగిక అవినీతికి కాదని చెప్పి, శోధనను కలిగించు స్ధలమునుండి, ఆ వ్యక్తి నుండి పారిపోయే యువత కావలెను - యోసేపు వలె (ఆది 39:10-12)

- ప్రతి విధమైన కీడును చెడును పూర్తిగా వదిలివేసే యువత కావలెను - తిమోతి వలె (1 తిమోతి 5:23) (చికిత్స నిమిత్తము కొద్దిగా ద్రాక్షారసము తీసుకొనమని పౌలు అతని బలవంతము చేయవలసి వచ్చెను.)

- బైబిల్‌ గ్రంధమునకు అంకితము చేయబడి, దాని బోధ ద్వారా వారి జీవితాలను మలుచుకొని సరిచేసుకొను యువత కావలెను - యోసేపు, తిమోతిల వలె (కీర్తన 105:19; 2 తిమోతి 3:15)

- శారీరక, మానసిక, ఆత్మీయ మరియు సాంఘిక విషయములలో సమతూలిక ఎదుగుదలకు కృషిచేసే యువత కావలెను. - యేసు వలె (లూకా 2:52)

- దైవభక్తిగల తల్లిదండ్రులతో సహకరిస్తూ తమ జీవితము పట్ల దేవుని ప్రణాళికను, ఉద్ధేశమును నెరవేర్చకలిగిన యువత కావలెను - ఇస్సాకు వలె (ఆది 22:6,9-14)

- ప్రతివిధమైన బెదిరింపును, హేళనలను సహిస్తూ  ధైర్యముగా క్రీస్తు కొరకు సాక్ష్యమివ్వగల యువత కావలెను - పౌలుగా మారిన సౌలు వలె (అపొ 9:29)

- సహ ఉద్యోగుల ఆమోదాన్ని, అధికారుల అభిమానాన్ని కోల్నోదుమన్న భయంతో, వారు నమ్మిన దానికొరకు, తమ విశ్వాసమునకు విరుద్ధమైన దానితో సహకరింపని యువత కావలెను - దానియేలు అతని స్నేహితుల వలె (దాని 3:16-18; 6:10,11,16)

- దేవుడు తగిన సమయమున హెచ్చించునట్లు పెద్దలకు నాయకులకు లోబడి వారిని నమ్మకంగా అనుసరించే యువత కావలెను - యెహోషువా వలె (నిర్గమ 24:13; సంఖ్యా 27:18-20)

- అవసరతలో ఉన్నవారికి ఉపయోగపడి ఆశీర్వదించునట్లు త్యాగబుద్ధితో దేనినైనా ప్రభువునకు ఇచ్చే నమ్మకస్థులైన యువత కావలెను - పేరు తెలియని బాలుని వలె (యోహాను 6:9-11)

- దేవుని మందిరం నుండి ప్రతివిధమైన వేషధారణను అనవసరమైన వాటన్నింటిని తొలగించే యువత కావలెను - అపొస్తలుల కార్యములు 5 నందలి యువకుల వలె (వ 6,9,10)

  - నేటి విజ్ఞాన ప్రపంచపు పద్ధతులకు ప్రతికూలంగా, వెనుకబడిన సంఘము కలిగించు నిరుత్సాహములన్నింటి మధ్యలో దేవుని కొరకు ధైర్యముగా గొప్ప కార్యములను చేయుటకు పూనుకొను యువత కావలెను - దావీదు వలె (1 సమూ 17:28,33,43,44)

- తమ ప్రస్తుత ఉద్యోగమును, తమకున్న బంధములన్నింటిని వదిలి, సంపూర్ణ సమయ పరిచర్య కొరకు పిలిచిన వెంటనే విధేయత చూపు యువత కావలెను - యాకోబు, యోహానుల వలె (మత్తయి 4:21,22)

- పై నుండి దర్శనము పొంది, పరిశుద్ధాత్మ శక్తితో ప్రపంచమంతటికి సౌవార్తీకరణ చేయునట్లు బయటకు వెళ్ళు యువత కావలెను - యోవేలు ప్రవచనము యొక్క యువతీ యువకుల వలె (అపొ 2:16-18,21).
యవ్వనజ్వాల