యవ్వనస్తులుPost Date:2014-09-05//No:31

యవ్వనజ్వాలక్రైస్తవులు ముందుకు రావాలి ఒక సామాన్య విశ్వాసిగా దేవుని చిత్తమును తన జీవితంలో గ్రహించిన వ్యక్తి (అ.పో.కా.4:36) కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపను బర్నబా, ఆదరణ పుత్రుడు జురతి అను మారు పేర్లు కలిగి యేసు కాలంలో 70 మంది 120 మంది శిష్యులలో ఒకడు (అ.పో. 11:22-26). ఈయన విశ్వాసముతో కూడిన సత్పురుషుడు అంతియోకులో మొదటి క్రైస్తవ సంఘము మొట్టమొదటి క్రైస్తవుడు బర్నబా (Mr.Christian) దేవుని రాజ్యము వచ్చుగాక అని ప్రకటించి అప్పటి క్రైస్తవ సంఘములో అవసరతలోనున్న వారి కొరకు తన పొలమును అమ్మి ఆ వనరులు అపోస్తులులకు ఇచ్చినవాడు. నేడు సంఘ ఆస్థులను అమ్ముకుంటున్నాము గాని తన ఆస్తిని అమ్మి ఆ వనరులను సంఘానికి ఇచ్చి సామాజిక పరిచర్యలో సంఘము ముందుకురావాలి. ఇతరుల కష్టములలో సహాయంచేసి అదరించేవాడు గనుక ఆయనను ఆదరణ పుత్రుడని బర్నబాయని (ప్రోత్సహించేవాడని) పిలిచేవారు. సంఘములో నాయకత్వంలో తనకంటే యోగ్యులైన వారిని గుర్తించి ప్రోత్సహించేవాడు బర్నబా. నేడు మన సంఘములలో మనమే నాయకులముగా ఉండాలని ముందు వుంటాం. మరొకరు నాయకులవుతారేమోనని, భయం, యోగ్యులైన వారిని నాయకుల్ని ఇతరులను గూర్చి మంచిమాటలు చెప్పడం క్రైస్తవ లక్షణమై వుండాలి మన సంఘములలో ఉన్నత స్థానాలకు వెళ్ళిన వారిని యువకులలో వున్న తలాంతులను గుర్తించి ప్రోత్సహించాలి ఇది బర్నబా చేసి చూపిన మంచిపని తన నాయకత్వం వదలి పౌలును గుర్తించి నాయకుడ్ని చేసాడు. తప్పులు చేసినవారిని క్షమించి రెండవ అవకాశం ఇచ్చాడు బర్నబా, సుంకరులతోను పాపులతో సంచరించాడు అటువంటివారిని క్షమించి మరొక అవకాశం ఇచ్చాడు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదేనని ప్రభువు వారు చెప్పిన దానిని అమలుపర్చాడు బర్నబా. మన సంఘములలో తప్పులు చేసినవారి పక్షంగా వారు పరివర్తన చెందులాగున నిలబడాలి సాంప్రదాయకంగా గుడ్డిగా నమ్మినట్టి విషయాలను వ్యతిరేకించి దేవుని చిత్తమును అంగీకరించి రక్షణ సార్వత్రికమైనదని చాటించిన విశాల దృక్పధం కలిగినవాడు బర్నబా, దేవుని చిత్తమును ఎరిగి నీ రాజ్యము వచ్చును గాక నేను ఆ చిత్తాన్ని జరిగిస్తానని బయలుదేరిన యువనాయకుడు బర్నబా. సంఘస్తుల కొరకు సంఘములో స్థానం కొరకు పోరాడకుండా దేవుని రాజ్యం కొరకు పోరాడిన వ్యక్తి బర్నబా. - రెవ.డా||ఎమ్‌.విక్టర్‌ పాల్‌
యవ్వనజ్వాలక్రైస్తవులు