యవ్వనస్తులుPost Date:2014-08-22//No:29

యవ్వనజ్వాలయౌవనస్తులారా! సిద్ధపడండి! యవ్వనస్తులారా! మీరు ఈ లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకండి. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఈ మూడు లోక సంబంధమైనవే ఇవి దేవుని వలన కలిగినవి కావు. అందుచేత బైబిలు చెబుతున్నది. లోకము దాని ఆశ గతించిపోవును అని.

యవ్వనస్తులారా! ఈ లోకం ఏలుతున్న సాతానుడు మిమ్ములను తన వలలోనికి లాగుతున్నాడు. అదేమిటి అంటే త్రాగుడు, వ్యభిచారం, మత్తు పదార్ధాలు ఈ మూడు కారణముల వలన మీ జీవితాలను సర్వనాశనము చేసుకుంటున్నారు. మరియు ఎంతోమంది యవ్వనస్తులను ఆత్మహత్యకు ప్రేరేపింపచేసి వారి బ్రతుకులను పతనం చేస్తున్నాడు. త్రాగుడు వలన నీ శరీరానికి భయంకరమైన నరముల బలహీనత, వ్యభిచారం వలన భయంకరమైన ఎయిడ్స్‌ అనే వ్యాధి, మత్తు పదార్ధముల వలన నీ శరీరానికి భయంకరమైన కేన్సర్‌ అనే వ్యాధులు వస్తాయి. ఇటువంటి వాటి ఉరి నుండి నీవు తప్పించబడాలని నిన్ను రూపించిన దేవుడు నీ కొరకు సిలువపై మూడు మేకుల మీద వ్రేలాడి ఆయన పరిశుద్ధమైన రక్తమును నీ కొరకు చిందించెను. నీలో ఉన్న సమస్త దుర్నీతిని ఆయన తీసివేసి నిన్ను శుద్ధి చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. మీకు ముందుగా చెప్పినట్లు ఈ లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ జీవపుడంబము అను ఈ మూడింటిని యేసుక్రీస్తు సిలువలో మూడు మేకుల ద్వారా చిందించిన రక్తముచేత, ఈ మూడు హేయమైన కార్యములను యేసయ్య కొట్టివేసారు.

కాబట్టి యవ్వనస్తుడా నీ జీవితం ఎలా గడుపుతున్నావు. ఈ లోకం కావాలని ఆశించి మరణానికి పోతున్నావా? లేక యేసుక్రీస్తు కావాలని ఆశించి జీవమును కోరుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో.

వ్యభిచారులు, త్రాగుబోతులు, స్వలింగ సంపర్కులు, మూర్ఖులు, వీరంతా స్వర్గమునకు వెళ్ళరు. వీటిని విడిచిపెట్టి యేసుక్రీస్తుని కలిగియుండుట స్వర్గమునకు మార్గము.

నీ పట్ల దేవుని సంకల్పం

1. యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము. నీ యౌవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సు నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దాని తొలగించుకొనుము. (ప్రసంగి 9,10)

2. నీవు యవ్వనేచ్చల నుండి పారిపొమ్ము (తిమోతి 2-22)

3. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము (ప్రసంగి 12-1)

4. పిల్లలారా (యవ్వనులారా) అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి (కొలస్సీ 3:20)

అందుచేత యవ్వనస్తుడా ! ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను యవ్వన ప్రాయములోనే రక్షించాలని కోరుతున్నాడు. నీ జీవితములోని ఈ లోక సంతోషమును, ఆనందమును, నిన్ను నాశనము చేయు పాపేచ్ఛల నుండి రక్షింపబడవలెనని దేవుడు కోరుచున్నాడు. క్యాన్సర్‌ వ్యాధి ఎలాగు ఆరోగ్యవంతమైన శరీర భాగమును తినివేయునో ! అటులనే పాపము కూడా దానిని ఆశ్రయించిన వానిని తినివేయును. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడే మీరు ఎందుకు రక్షింపబడకూడదు.

నీవు చేయవలసిన పని :

1. నీవు పాపివని తెలుసుకో : ఏ బేధములేదు. అందరూ పాపం చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. (రోమా 3:23)

2. పశ్చాత్తాపము : మనము పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును (1 యోహాను 1:9). కాబట్టి నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. (హెబ్రీ 9:14)

కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. (రోమా 5:9)

- పాస్టర్‌ తీడ రఘు
యవ్వనజ్వాలయౌవనస్తులారా!