యవ్వనస్తులుPost Date:2014-08-15//No:28

యవ్వనజ్వాలప్రేమంటే?! యవ్వనస్తులు తమ జీవితాలకు మంచి పునాది వేసుకొనే సమయంలో తమ జీవితాలను ప్రేమ అనే పేరుతో నాశనం చేసుకొనుచుండగా మీరు ఎలా ఉంటున్నారు? ప్రేమ అనే పేరుతో జీవితాన్ని ఆగమ్యగోచరంగా చేసుకుంటున్నారా? లేక అటువంటి వ్యక్తులకు సహాయ పడుచున్నారా?

ప్రేమంటే ఏమిటో నిర్వచింపగలరా? చాలామంది ప్రేమంటే ఇలా చెబుతారు "Love at first sight" అంటే తొలిచూపులో కలిగేది ప్రేమ అని. కాని "Lust at first sight" అంటే తొలిచూపులో కలిగేది ప్రేమ కాదు మోహం.

ఎదుటి వారిలో ఒక మంచి సత్‌ ప్రవర్తన తీసుకువచ్చే మన ప్రవర్తనయే ప్రేమ. అనగా మీ ప్రవర్తనను బట్టి అంటే మీ ప్రేమను బట్టి ఎదుటి వ్యక్తిలో ఒక మంచి మార్పు రావాలి. అటువంటి మంచిమార్పు ఎదుటి వ్యక్తిలో తీసుకొచ్చే విధంగా ఉన్న మీ ప్రవర్తనే నిజమైన ప్రేమ.

'ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును - బైబిల్‌.

శారీరకంగా మీరు పవిత్రంగా ఉన్నారనుకొంటూ ఒకవేళ మీ చూపులను బట్టి మీరు పాపం చేస్తున్నారా? మీ చూపులు ఎలా ఉన్నాయి? పవిత్రంగా ఉన్నాయా? ఒకవేళ మీ హృదయం చెడు చూపుల ద్వారా మలినమౌతుంటే ఎదుటివారిలో సత్‌ ప్రవర్తన ఎలా ఆశించగలరు. అటువంటి సమయంలో మీలో నిజమైన ప్రేమ అనగా దేవుని ప్రేమ లేదు కదా?!

'పొరుగువానిని ప్రేమించువారే దేవుని చిత్తము నెరవేర్చువాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశించవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి యుండుట దేవుని చిత్తమును నెరవేర్చుటయే'.

ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తితో పాపము చేయవు. ఆ వ్యక్తితో పాపము చేస్తున్నావంటే, నీవు ఆ వ్యక్తి ఇద్దరూ పాప ఫలితమైన నిత్య నరకము అనుభవించడానికి సిద్ధపడుతున్నారు. ఒక వ్యక్తిని నిత్యనరక శిక్షకు తీసుకొని వెళ్ళే నీ ప్రవర్తన ప్రేమంటారా? ఒకసారి ఆలోచించండి.

ఒకసారి కష్టపడి పనిచేస్తున్న మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. మీ మీద ఆశలు పెంచుకున్న మీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి....

నిత్య నరక శిక్షకు తీసుకుపోయే మీ వ్యర్ధమైన ప్రవర్తనకు ప్రేమ అని పేరు పెట్టుకొని ఇప్పటివరకు ఎంత సమయం వృధా చేశారు? ఎంత భవిష్యత్తును కోల్పోయారో మీకు తెలుసు. మీ ప్రవర్తనను బట్టి మీ తల్లిదండ్రులను గాయపరుస్తున్నారో లేదో తెలియదు కానీ, మిమ్మల్ని ఈ భూలోకంలో సృష్టించిన సృష్టికర్తను మాత్రం ఎంతో గాయపరుస్తున్నారు.

మీ కొరకై, మీరు చూచిన చెడుచూపుల కొరకై, మీ హృదయంలో జరిగిన పాపము కొరకై ఆ దేవాది దేవుడు నరావతారిగా ఈ భూలోకమునకు వచ్చి మీరు చేసిన పాపములను బట్టి ఆయన చేయని నేరానికి ఘోరమైన శ్రమ పొంది, హింసింపబడి, గాయపరచబడి, భయంకరమైన సిలువ మరణం పొందినది ఎందుకో తెలుసా? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు! ఆయన మీ కొరకే మరణించాడు!! కానీ ఆయన ప్రేమను గుర్తు చేసుకోకుండా, నీ యవ్వన థలో పాప ఊబిలో కూరుకుపోయిన మిమ్మల్ని యేసు రెండు చేతులూ చాపి పిలుస్తున్నాడు. మీకు మంచి భవిష్యత్తు నివ్వడానికి, మీరు అనేకమందికి ఆశీర్వాదకరముగా జీవించడానికి....

వస్తారా యేసునొద్దకు.... ఇస్తారా మీ హృదయం యేసుకు.- శొంఠి జాన్‌ వరప్రసాద్‌
యవ్వనజ్వాలప్రేమంటే?!