యవ్వనస్తులుPost Date:2014-07-11//No:22

యవ్వనజ్వాల క్రైస్తవ యవ్వనులు - దేశసేవ

నేడు దేశములోని 50 శాతము యవ్వనులు వ్యసనములకు బానిసలై దేశానికి భారముగా మారుతున్నారు. ఈనాడు మన దేశములోని యువకులు ఎక్కువగా కనిపించే స్థలాలను చెప్పుకోవాలంటే బార్‌లు, డిస్కోధెక్‌లు, అశ్లీల సాహిత్యమును అందించె ఇంటర్నెట్‌ కేప్‌లలోను, ఇహలోక సంబంధమైన ఇచ్చలను నెరవేర్చుకొనుటకు పార్కులలోను, మరికొందరైతే తీవ్రవాదులుగా, నక్సలైట్స్‌గా దర్శనమిస్తున్నారు. మైడియర్‌ యంగ్‌ష్టర్స్‌ విద్యార్ధిగా, కుమారునిగా, స్నేహితునిగా, దేశపౌరునిగా బాధ్యతలు కలిగియున్న నీవు నీస్వార్ధము కొరకే జీవించుచున్నావా? పార్టి జండాలు పట్టుకుని తిరిగే యువకుల కన్నా, రకరకాల కారణాలతో అల్లర్లను సృష్టించె యువకుల కన్నా, అభిమాన నటుల పేర ఆర్భాటము చేసే యువసేనల కన్నా భారత దేశములో క్రైస్తవ యవ్వనులు ఎంతో దేశ సేవను చేస్తున్నారు.

దేశ సేవ అంటే కేవలము తుపాకి పట్టి సరిహద్దులలో పోరాడటమే కాదు. దేశములోపలి చెడును తొలగించడము కూడా, ఇది దేశములో సమసమాజమును నిర్మించే సేవ. ఇట్టి సేవలో క్రైస్తవులు ముందున్నారని చెప్పగలము. (నిజమైన) క్రైస్తవ యువకులు ఈ క్రింది విధముగా దేశమునకు సేవ చేయుచున్నారు. 1. త్రాగుడు, వ్యభిచారము, డ్రగ్స్‌ మొదలగు వ్యసనముల నుండి తమ స్నేహితులను విడిపించడానికి హృదయ పూర్వకంగా ప్రయత్నిస్తున్నారు. 2. నిరాశలో ఉన్న వారికి, అనారోగ్యములో ఉన్నవారికి, అపజయాలతో కృంగిన వారికి యేసు మాటల ద్వారా స్వాంతన కలుగజేయుచున్నారు. 3. తన చుట్టు ఉన్నవారి బాగు కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు ఒక సాధనముగా జీవిస్తు పని చేస్తున్నారు. 4. వివిధ మంచి కార్యక్రమాలలో పాల్గొనడానికి ఎల్లప్పుడు ముందుంటున్నారు. 5. దేశము కొరకు నాయకుల కొరకు ప్రజల క్షేమము కొరకు ప్రతి రోజు ప్రార్ధిస్తున్నారు.6. కన్నవారికి, తమ చుట్టు ఉన్నవారికి సంతోషమును పంచుచున్నారు.7. క్రైస్తవ యువకుల వలన ఇంత వరకు ఎట్టి అల్లర్లు, మారణ కాండలు, దేశము సిగ్గు పడే పనులు జరుగలేదు.

నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు, ఇతరులు నీకేమి చేయవలెనని కోరుచున్నావో అలాగే నీవును వారికి చేయుమని చెప్పిన క్రీస్తు మాటలే నేడు యవ్వనులు తమ నడతను శుద్ధి చేసుకొనుటకు కారకములని, యవ్వనుడా భారతీయుడిగా దేవుని పేరిట దేశమునకు నీ చేతనైన పరిచర్య చేయుము. ఎందుకంటే దేశమంటే మట్టికాదోయ్‌ - దేశమంటె మనుష్యులోయ్‌, మనుష్యులంటే దేవుని స్వరూపాలోయ్‌. ఈ పత్రిక చదువుచున్న యవ్వనస్తుడా నీవు క్రైస్తవుడగుటకు వెనకాడుచున్నావా? నేడే యేసుని చేర్చుకో నీ దేశమందు ప్రజలకు క్రీస్తు ప్రేమను పంచి పెట్టుము.... - బ్రదర్‌ నవీన్‌రాజు
యవ్వనజ్వాల