యవ్వనస్తులుPost Date:2014-07-04//No:21

యవ్వనజ్వాలదీవెన మరియు శాపము 'ఒరేయ్‌ దరిద్రుడా! నీలాంటి వారిని ఎవరు పోషిస్తారురా? చిన్నప్పుడే చచ్చినా బాగుండేది' అని మరియమ్మ కొడుకును కోప్పడుతోంది.

'మీరు ఇటురాకుండా ఉంటే అంతకన్నా ఉత్తమం మరొకటి లేదు' భార్య మంగ భర్తపై అరుస్తోంది.

'ఒసేయ్‌ గాడిదా! నిన్ను అని లాభం ఏముందే? వచ్చీ వచ్చీ నా ఇంటికే దాపురించావు గదే' అది నా దురదృష్టం కాక ఏమనాలి?' భర్త సుగుణారావు భార్య సుశీలతో అంటున్నాడు. 'ఎందుకురా మీరు చదవడానికి వచ్చేది? మీరు పాసవ్వరు' అని పంతులు గారు విద్యార్ధుల మీద అరుస్తున్నారు.

'నీలాంటి వారిని అసలు మనుష్య జాబితాలో లెక్కకట్టవచ్చా? నీలాంటోడి మొహం చూసి బయల్దేరితే సమాధి పెట్టికి ఆర్డరు చేసుకోవచ్చు' ఫిలిప్పు పక్కింటి యోసేపును చూసి అంటున్నాడు.

'మీలాంటి వారెవ్వరూ పరలోకపు ద్వారాలు కూడా చూడరు. ఎందుకు ఇలాంటి బ్రతుకు బ్రతికేది? ఎందుకు చర్చికి వచ్చేది?' పాదిరిగారు సంఘంలోని వారితో కోపంగా అంటున్నారు.

'ఒసేయ్‌ దరిద్రపు మొహమా పని చేయవే వచ్చి కూర్చున్నావు. ఊరకే కూర్చుని తిందామనే'... పని అమ్మాయిపై ఇంటావిడ అరుస్తోంది.

'మాకు జన్మ నివ్వమని మీతో ఎవరు చెప్పారు?' అమ్మా నాన్నతో పిల్లల ప్రశ్న.

'ఈ కొండముచ్చు ఈ ఇంటికి అడుగుపెట్టింది సర్వనాశనానికే. నా కొడుకు భవిష్యత్తు నాశనం చేసింది. గర్భిణి అని చెప్పి మధ్యాహ్నం వరకు మంచం దిగకుండా ఉంది చూశారా! మిగతావాళ్ళెవరూ ఇలాంటివి చూడలేదా?' మరియమ్మ కోడల్ని దూషిస్తోంది.

అత్తగారిని శారమ్మ ఈ విధంగా శాసిస్తోంది. 'కావలసినది తింటూ ఒక మూలపడి ఉండు. అంతా నా భర్తే సంపాదిస్తున్నాడు. ఎదురు ఇంకో పల్లెత్తు మాటకూడ అనకూడదు.'

ఈ మాటలను పుట్టించే మనోభావములు ఆలోచనలు ఎన్ని రకాలో? ఒకరికొకరి మధ్య ప్రేమగౌరవములు లేనే లేవు. వీరు ఒక దెబ్బకు రెండుగాట్లు అనే కఠిన స్వభావము కలవారు.

ఇలా కఠినంగా మాట్లాడేవారు విద్యావంతులైనా పామరులైనా, ధనవంతులైనా, దరిద్రులైనా ఎవరైననూ సరే వారు ఎదుటి వారిని కించపరచేవారే. ఇంగితజ్ఞానము, దైవభయము, మంచి స్వభావము కలవారెప్పుడూ ఈ విధంగా మాట్లాడరు.

దయలేని మాటలు ఎదుటివాని హృదయములో చొచ్చుకుపోయి వారి జీవితమును నాశనము చేస్తాయి. బంధాలను తెంచివేస్తాయి. పిల్లల భవిష్యత్తును నాశనము చేస్తాయి. కానీ కౄరంగా కఠినంగా మాట్లాడేవారు కూడా ఆఖరుకు దయనీయమైన స్థితిని చేరుకుంటారు.

ఒక మళయాళ దినపత్రికలో చాలాకాలం క్రితం ఒక వార్త చదివాను. ఒక తండ్రి పెళ్ళీడుకు వచ్చిన తన ముగ్గురు కూతుళ్ళతో ఎప్పుడూ ఈ విధంగా అంటూ ఉండేవాడు. 'ఈ తిండిపోతులు ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండేది. వీళ్ళను ఎవరు పెండ్లి చేసుకుంటారు. వీరందరినీ భరించడం నా వల్ల కాదు' ఎప్పుడూ ఈ విధంగా

 దుఃఖమూ ద్వేషముతో నిండిన మాటలే అనేవాడు.

యౌవనస్థులైన ఆ ఆడపిల్లల చదువు కూడా ఆగిపోయింది. నిరాశ వారిని ఆవరించింది. ఆఖరికి వారు ముగ్గురూ విషముత్రాగి వారి జీవితాన్ని ముగించారు. ఆ తండ్రి తన శేష జీవితాన్ని మధ్యపానముతోను, దుఃఖముతోను, వేదనతోను గడిపాడు. ఒక కుటుంబము సర్వనాశనమయింది.

అయితే ఒక డాక్టరు గారి కధ చెబుతాను. ఈయన ఒక మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. చిన్నతనములోనే ఆర్ధికమైన ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొనవలసి వచ్చింది.

ఆయన తల్లిదండ్రులు మంచి దైవభక్తులు మంచి విశ్వాసులు ఆయన చదువుతున్నప్పుడు తన తండ్రిగారు మంచం పట్టారు. ఆ పరిస్థితిలో కూడా తండ్రి తన కొడుకుకు ధైర్య వాక్కులు చెబుతూ ఉండేవారు. ప్రార్ధన, ఐక్యత, సంతోషము ఆ కుటుంబములో ఎప్పుడూ ఉండేవి.

మరణం ఆసన్నమైనప్పుడు తండ్రి కొడుకుతో 'బాబూ! నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. నీకోసం రోజూ ప్రార్ధన చేస్తున్నాను. ఈ రోజు కూడా ప్రార్ధించాను. నాకిక సమయం ఎక్కువలేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు మంచి భవిష్యత్తు కలుగుతుంది. మీ అమ్మను బాగా చూసుకో' ఇలా చెప్పి కన్ను మూశాడు.

తండ్రి మరణం కొడుకుకు భరింపశక్యం గాకుండా ఉంది. రోజులు గడిచే కొద్దీ తండ్రి చెప్పిన మాటలు మరలా మరలా గుర్తుకు వచ్చేవి. అవే అతనిని బలపరచాయి, ఉత్సాహపరచాయి.

మనం ఒక విషయం చెప్పే రీతి కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఒక ఇంటిలో తండ్రి యొక్క మాటలు కొడుకును ఉన్నత స్థితిలోనికి తీసుకువస్తే మరొక ఇంటిలో శాపనార్ధాలతోను, వేదనతోను, నిరాశతో కూడిన, అపజయమును సూచించే మాటలు విన్న బిడ్డలు నిరాశపడి భవిష్యత్తును నాశనం చేసుకొన్నారు.

మీరు మాట్లాడే మాటలను బట్టియే మీకు ప్రతిఫలం వస్తుందని మీరు అర్ధం చేసుకొని ప్రవర్తించినట్లయితే ఈ రోజు మీరు ఎదుర్కొనే సమస్యలను మీరు సులభంగా పరిష్కరించుకోవచ్చు. తప్పు దోవలు పట్టి, ప్రేమ లేకుండా తిరుగుచున్న మీ పిల్లలు మీ వైపుకు తిరుగుతారు. దాని యొక్క తాళం మీ దగ్గరే ఉంది. ఆ తాళము నీ నోటి నుండి వెలువడే మాటలే.

మన మాటలు ఇతరులు బంధాల్నీ బలపరచి విరోధాల్ని లేకుండా అయినా చేస్తాయి, లేకపోతే అవి వారి జీవితములో ఆటంకముగాను మొండితనాన్ని, వైరాగ్యాన్ని కోపాన్ని పెంచేవిగా అయినా ఉంటాయి.ఒక వ్యక్తి పలికే మాటలను బట్టియే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము వెల్లడవుతుంది.

ఈ రోజుల్లో కుర్రవాళ్ళు కొందరు కొందరి గురించి 'ఓహో ఆయనా ఆ చవకబారోడా' అంటారు. కారణం ఏమిటి పరువు మర్యాద లేకుండా ప్రవర్తించడం మూలాన ఆయనకు ఆ పేరు వచ్చింది. కోట్లకొద్ది సంపాదన ఉన్నప్పటికీ స్వభావం 'చవక' అవవచ్చు చవక అనగా (నీచ, సంకుచిత అని భావం) అది అతని మాటల ద్వారా తెలుసుకోవచ్చు. వాని కీడే వానిని సమాజంలో ఒంటరి వాడ్ని చేస్తున్నాయి.

మీ నోటి మాటలు ఇతరులను గాయపరచేవిగాను, బాధను నిరాశను నింపేవిగాను ఉన్నట్లయితే అవి వెంటనే ఆపివేయండి. మీలో పాపమును అవినీతిని పెంచేవిగా ఉన్నట్లయితే మీరు మాట్లాడే పద్ధతిని వెంటనే మార్చండి. దైవ ప్రేమను, సూచించే మంచి దీవెనకరమైన మాటలు మాత్రమే మాట్లాడండి. ఇ
యవ్వనజ్వాలదీవెన