యవ్వనస్తులుPost Date:2014-06-27//No:20

ప్రతిరోజూ అవసరమా..?ఓ బైబిల్‌ పండితుడు బైబిల్‌ కాలేజీలో దేవుడు ఇశ్రాయేలీ యులను ఏ రీతిగా అరణ్యములో ప్రతిదినము పోషించాడో వివరిస్తూ వున్నాడు. అది వింటున్న ఓ విద్యార్ధి ఆ పండితున్ని ఇలా ప్రశ్నించెను. ఎందుకని దేవుడు ఏ రోజుకు ఆ రోజు మన్నాను కూర్చుకొనే పని పెట్టాడు? ఒక సంవత్సరమునకు కావలసిన మన్నాను వారికి కురిపించవచ్చు గదా అని. అందుకు ఆ బైబిల్‌ పండితుడు ఆ విద్యార్ధికి అర్ధమ య్యేరీతిగా ఇలా బదులిచ్చెను.

ఒక తండ్రి తన కుమారున్ని ఎంతో ప్రేమించెను. ఏ లోటు లేకుండా, రాకుండా అల్లారు ముద్దుగా చూచుకొనెను. అదే ప్రేమతో ఆ కుమారునికి కావలసిన పాకెట్‌ మనీ సంవత్సరమునకు కావలసినదంతా ఒక్కసారే ఇచ్చెను. ఏ రోజైతే సంవత్సరమునకు కావలసిన పాకెట్‌ మనీ ఆ తండ్రి ఒక్కసారే ఇచ్చెనో ఆ రోజు నుండి ఆ కుమారుడు ఆ తండ్రి దగ్గరకు రావడం మానివేసెను. పాకెట్‌ మనీ కోసం సంవత్సరమునకు ఒక్కసారి ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా తండ్రి దగ్గరకు వచ్చి పాకెట్‌ మనీ తీసుకొని వెళ్ళుచూ వుండెను.

ప్రతి దినము తన కుమారునితో గడపాలని, సహవాసం కలిగి వుండాలని, తన ప్రేమను పంచాలని ఆశపడిన ఆ తండ్రికి ఆ కుమారుడు అందుబాటులో లేకుండా పోయెను. ఇది గమనించిన తండ్రి సంవత్సర మునకు సరిపడే పాకెట్‌ మనీ ఒకేసారి ఇవ్వక ఏ రోజు పాకెట్‌ మనీ ఆ రోజు ఇవ్వడం మొదలుపెట్టెను. ఆ రోజు నుండి ఆ కుమారుడు ప్రతిదినము తండ్రిని కలుసుకొని కొంతసేపు తండ్రితో గడిపి తండ్రి ఉపదేశ మును విని బహు దీవెనలు పొందెను. ఈ ఉపమానము ద్వారా ఆ విద్యార్ధికి అర్ధమయ్యేలా ఆ పండితుడు వివరించెను.అవును, నా ప్రియ సహోదరీ, సహోదరుడా! దేవునికి మనమంటే ఎంతో ప్రేమ గనుక మనము ఆయనతో కొంత సమయము గడపవలెనని ఆశిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. తద్వారా ఆయన కాపుదల, భద్రత, కృప అనే ఆశీర్వాదములను పంచిపెట్టాలని ఆశపడు తున్నాడు. ఆ కుమారుడు ఏ రీతిగా కొంత సమయం తండ్రితో గడిపి తద్వారా తండ్రి ఆశీర్వా దమును ఆ దినమునకు కావలసిన సహాయమును, సలహాను ఎలా పొందుకున్నాడో అదే రీతిగా కొంత సమ యము మనము కూడా దేవునితో గడిపిన ట్లయితే ఆయన కాపుదల, భద్రత, నడిపింపు కలిగి వుంటాము.

ఎందుకని నీ బద్ధకమును విడిచిపెట్టి, అనవస రమైన మాటలను, వ్యర్ధముగా టి.వి.చూసే సమయాన్ని ప్రక్కనబెట్టి, దేవునితో సమయం గడుపుటకు అలవాటు చేసుకొని ఆయన అనుగ్రహించు తన కృపను, మేళ్ళను, సహాయమును, దాచి యుంచిన దీవెనలను ప్రతిదినమూ పొందు కోకూడదూ?ఈ రోజు ఈ వర్తమానము చదువు తున్న నీవు సంవత్సరానికి ఒకసారో, నెలకో సారో, వారానికోసారో లేక కష్టమొచ్చిన ప్పుడో, ఆపద సంభవించినప్పుడో దేవున్ని ఆశ్రయించే వాడివిగా ఉన్నావా? లేక ప్రతిది నము నిన్ను ప్రేమించిన, నీకోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్యను కలుసుకొనుటకు ఒక ప్రత్యేక సమయాన్ని కలిగియుండి ప్రతిదినము ఆయన సన్నిధి కాంతిలో నిన్ను నీవు సరిచేసుకొంటూ ఆత్మీయంగా ఆయన అనుగ్రహించు కృపను పొందుకొని క్రీస్తు స్వరూపములోనికి మారుచున్న క్రైస్తవుడిగా వుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు! 'ఉదయము నీ కృపతో మమ్మును తృప్తి పరచుము, అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము'. (కీర్తనలు 90:14) - డా||పి.సతీష్‌ కుమార్‌
ప్రతిరోజూ