యవ్వనస్తులుPost Date:2014-06-13//No:18

నా చెడు చూపులను మార్చుకొనేదెలా...?ప్రశ్న : అన్నా, నేను యవ్వన కాలంలో ప్రవేశించింది మొదలు నా చూపులు మారిపోయాయి. ఎంత చూడకూడదనుకుంటున్నా చెడుగా అమ్మాయిలను చూసేస్తున్నాను. రోడ్డు మీద వెళుతున్నపుడు నా చూపు అంతా అమ్మాయిలపైనే ఇలా చూడటం వలన ఒక్కోసారి నా మీద నాకే అసహ్యం పుడుతుంది. నేనేంటి? ఇలా మారిపోయాను అని. కానీ చూడకుండా ఉండలేకపోతున్నాను. ఈ సమస్యను నేనెలా జయించగలను?

జవాబు : తమ్ముడు, ఈ సమస్య నీ ఒక్కడిది కాదు. యవ్వనస్థులు యవ్వనంలో ప్రవేశించిన తరువాత వారి చూపు మారిపోతుంది. దానినే మోహపు చూపు అంటారు. ఈ రోజు అనేకమంది యవ్వనస్థులు (అబ్బాయిలు, అమ్మాయిలు కూడా) మోహపు చూపులను అదుపు చేసుకోలేక బాధపడుతున్నారు. చూపుల ద్వారా ప్రారంభమైన పాపం తలంపులలోనికి, తరువాత మాటలలోనికి చివరికి క్రియలలోనికి వెళ్ళి యవ్వనస్థుని జీవితాన్ని పాడుచేస్తుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ మోహపు చూపులలో పడిపోయి వున్నారో వారందరూ బైబిల్‌ ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసిన వాళ్ళవుతారు. దీనిని బట్టి చూస్తే ప్రతిరోజు యవ్వనస్థులు ఎన్ని వ్యభిచారాలు చేస్తున్నారో లెక్కపెట్టలేము. ఈ మోహపు చూపును జయించడానికి ప్రభువు నాకు నేర్పిన అనుభవాలను నీ ముందుంచుతున్నాను. జాగ్రత్తగా చదువు.

- నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను అని బైబిలు గ్రంధం చెబుతుంది. కాబట్టి నేను చెడుగా చూడకూడదని నిర్ణయం తీసుకున్నాను.

- రోడ్డు మీద వెళుతున్నపుడు దేవుని పాటలు పాడుకుంటూ దేవుని గూర్చిన ఆలోచనతో వెళ్ళేవాణ్ణి, ఆ పాటలు పాడుతున్నపుడు, ఆయనను గూర్చి ఆలోచిస్తున్నపుడు నా మనసు అంతా ఆయన ప్రభావంతో నిండి ఉండేది. ఇక నాకు రోడ్డుమీద ఎవరు కనబడినా ఆకర్షింపబడేవాణ్ణి కాదు.

- ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్ధించేవాణ్ణి. ఈ ప్రార్ధనలో నా శరీర నేత్రాలు మూయబడి, ఆత్మీయ నేత్రాలు తెరవబడేవి. దేవుని శక్తి ఈ ప్రార్ధన ద్వారా నాకు లభించింది.

- ప్రభువు యొక్క శక్తి లభించిన తరువాత అమ్మాయిలను చూసినపుడు వారు నాకు సొంత చెల్లెళ్ళుగా, అక్కలుగా కనబడ్డారు. అయ్యా వారు ఈ లోకంలో పడి పాడైపోతున్నారు. అని బాధ కలిగేది.
నా