యవ్వనస్తులుPost Date:2014-05-24//No:14
యవ్వనజ్వాలకా''లేజి''కి వెళుతున్నావా..!
కా'లేజి'..... పేరులోనే ఉందిగా లేజి (సోమరి). ఈ పేరు ఎవరు పెట్టారోగాని వారిని పిలచి సన్మానం చెయ్యాలనిపిస్తుంది. కాలేజికి వెళ్లేవారిలో నాకు తెలిసి 75% లేజీలే. ఇంటర్ మీడియట్లో ఎంతో మంది ఈడియట్లుగా తయారు అవుతారు. 10వ తరగతిలో ర్యాంకులు వచ్చిన వారికి +2లో కనీసము పాస్ మార్కులు కూడా రాని కధనాలు కాలేజి క్యాంపస్‌లో ఎన్నో.. కళాశాల అంటే అది ఒక ప్రేతలసాల. అన్నిటిని జయించేవారే అవుతారు ఉన్నతులు అక్కడ. ప్రతి చిన్నదానికి తందాన తానే అనేవారికి చివరికి మిగిలేది 'బుర్రకధే'.
కాలేజిలో అడుగు పెట్టగానే నిన్ను ఆవరిస్తాయి జాగ్రత్త అక్కడున్న దెయ్యాలు...
ప్రేమ మలివయసు దోమ : మలేరియా దోమకాటుకు నాలుగురోజులు మందులేసుకుంటే సరిపోతుంది కాని ప్రేమదోమ కాటు వేసిందనుకో ప్రాణాలు పోతాయి. ప్రస్తుతము ఆ దోమకాటు ఎంత బలమైనదో పేపరు చదివితే తెలుస్తుంది. ఆత్మహత్యలు, యాసిడ్ దాడులు, అపహరణలు, గొంతు కోయటాలు ఇవన్ని ప్రేమకాటు ఫలితాలు. బైబిల్ 'ప్రేమించి పెళ్లి చేసుకోవటము' తప్పు అని చెబుతుంది. కాలేజి ప్రేమకు బైబిల్ పెట్టిన పేరు జారత్వము లేక వ్యామోహము. ప్రేమించటము తప్పా! ఎలా? ఎక్కడుంది?....... ప్రేమించటము అనేది పాపము కాకపోతే లవ్వర్స్ ఎందుకు సంధులు, గొందులు వెతుకుతారు, ఊరవతల తిరుగుతారు, కాల్ వస్తే ఎందుకంత రహస్యముగా మాట్లాడతారు... ప్రేమించటమనేది తప్పు కాకపోతే ప్రతిపని భయముతో, రహస్యముగా ఎందుకు చేస్తున్నావు. కాలేజికి వెళుతున్నది చదువుకోవటానికి కాని నీ సొంత పెత్తనాలు చేసుకొని బంగారు భవిష్యత్తు నాశనము చేసుకోవటానికి కాదు. ప్రేమ అనే పని దేవునికి విరోధమైనది ఎందుకంటే నీవు నీ సొత్తుకాదు నీవు సిలురక్తముతో కొనబడినవాడవు గనక నీ మీద దేవునికి మొదట పూర్తి హక్కు ఉన్నది. తరువాత నీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నావు అంతకంటే ముందుగా నిన్ను నీవు అమ్ముకుంటున్నావు లేక మోసము చేసుకొంటున్నావు.
చేతిలో సెల్.. చదువులో డల్.. పెరుగుతున్న బిల్ : ప్రస్తుతము కాలేజి పిల్లల చేతుల్లో నోట్‌బుక్ ఉండకపోయినా పరవాలేదు గాని సెల్ లేకపోతే వారి మూడ్ నిల్. కమ్యూనికేషన్ ఎంత పెరిగిందో పాపము, సమస్యలు అలాగే పెరుగుతువచ్చాయి. ఒక వ్యాపారి కంటే, ఒక పొలిటికల్ లీడర్ కంటే, ఒక ఉద్యోగి కంటే సెల్ వాడి బిల్ పేల్చటములో కాలేజి కుర్రకారుదే పైచేయి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు (సామెతలు 10:19), మితముగా మాటలాడు వాడు తెలివిగలవాడు (సామె17:27), పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు (ప్రసంగి 5:3). తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును (సామె13:4)....
చాలామంది సెల్‌ను కాల్స్, ఎస్ఎమ్ఎస్లుకే కాదు, గంటలు గంటలు సినిమా పాటలు వినడానికి అస్లీల విషయాలను దాచుకొని, దాచుకొని చూచి మరి తృప్తి చెందటానికి. పేతురు తన 2వ పత్రికలో దుర్ణీతిపరుల 17 లక్షణాలు చెప్తు 14వ లక్షణము ఇలా చెప్పాడు 'వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానని కన్నులు గలవారు' (2 పేతురు 2:14).క్రొత్త స్నేహం.. సాతాను పాసం : ఆరు నెలల సహవాసము చేస్తే వారు వీరు అవుతారంటారు కాని ఆరు క్షణాలుచాలు చెడు నేర్చుకోవటానికి నేడు. నిజముగా నన్ను అడిగితే స్నేహం యొక్క ప్రతి మధుర క్షణాలను స్కూల్లోనే అనుభవించగలము. చిన్న నాటి స్నేహసౌధాలు చెరగనివి, తరగనివి. కాని కళాశాలలోని స్నేహం అనేది కొన్ని రోజులకే పరిమితము అంటారు చాలామంది. బడికెళ్లినవాళ్ళు పెద్దల అభిరుచులే పిల్లలకు పరమ కర్తవ్యాలు కాని కాలేజిలో అడుగిడిన తరువాత వారు ఎప్పుడు ఎవరో ఒకరిచేత ప్రభావితము అవుతుంటారు.
చాలా వరకు ఇతరులలో నచ్చిన విషయాన్ని అనుకరించాలి దాన్నే పొందాలనే తాపత్రయము కుర్రకారుని వెంటాడి పీడిస్తుంది. నేను దేవునిలో ప్రకాశించాలనే వారు ఆత్మీయులను ఏరి కోరి ఎన్నుకోకపోతే సాతాను యొక్క కంచుకోటగా మారిపోయే ప్రమాదము ఉంది. దుష్ట సాంగత్యము మంచివారిని చెడ్డవారిగా రూపుదిద్దుతుంది.