యవ్వనస్తులుPost Date:2014-05-16//No:13

విజ్ఞానం గల యువత -విజ్ఞానం చాలా అభివృద్ధి చెందిన రోజుల్లో మనం ఉన్నాం. ఒక 100 లేదా 150 సంవత్సరాల క్రితం ప్రయాణాలు రోజులు నెలలతరబడి సాగేవి. కానీ ఇప్పుడు గంటలలోనే సుదూర దేశాలను చేరుకోగలుగుతున్నాం. సమాచారం కూడా ఒకరినుండి మరొకరికి చేరాలంటే రోజులు, వారాలు నెలలు పట్టేవి కానీ ఇప్పుడు ఒక క్లిక్‌తో ప్రపంచంలో ఎక్కడికైనా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఎన్నో రీతులుగా అభివృద్ధి చెందిన మనిషి ఇప్పటి సౌకర్యాలను బట్టి ఎంతో సంతోషంగా ఉండాలి కాని ఇప్పుడు విచారం, బాధలు మరింత ఎక్కువయ్యాయి. కారణం ఏమంటే నిజమైన విజ్ఞానం జ్ఞానం అంటే ఏమిటో మనిషికి తెలియకపోవడమే. ఈనాడు యువత సైన్స్‌ గూర్చి చక్కని అవగాహన కలిగి ఉండాలి. సైన్స్‌ అంటే పరిశీలింపబడి రుజువు చేయబడినదని అర్ధం. రుజువుతో కూడిన పరిశోధన సైన్స్‌ అని చెప్పవచ్చు. కాని నేటి సైన్స్‌లో రెండు రకాల విషయాలున్నాయని గమనించాలి. అవి (1) చారిత్రక సైన్స్‌ (Historical science) 2. పరిశీలనాత్మక సైన్స్‌ (Operational science)

1. చారిత్రక సైన్స్‌ (Historical science) : చారిత్రక సైన్స్‌ అంటే భూమి పుట్టుక, విశ్వం ఎలా ఏర్పడింది. మనిషి ఎలా ఉద్భవించాడు, వంటి ప్రస్తుతం ఆధారాలు కన్పించని విషయాలపై జరిగే పరిశోధన. ఈ విషయాలను ఇప్పుడు క్రొత్తగా పరిశీలించే అవకాశం లేదు. ఎందుకంటే అవి ఎప్పుడో గతంలో జరిగాయి. ప్రస్తుతం వాటిని ఎంత పరిశీలించినా అవి ఎలా ఏర్పడ్డాయో చెప్పలేం. మొదటిగా ఏం జరిగిందో మనకు తెలియదు గనుక అలాంటివి ఇప్పుడు సంభవించటం లేదు గనుక దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధించలేరు కేవలం ఊహిస్తున్నారు. చారిత్రక సైన్స్‌లో అత్యంత ముఖ్యమైనది.

జీవ పరిణామ సిద్ధాంతం : (Evolutionary Theory) దీనిని నిజంగా సిద్ధాంతం అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది నిరూపించబడలేదు. దీనిని కేవలం ప్రతిపాదన (Hypothesis) అని మాత్రమే అనాలి. (Its not a theory. its a Hypothesis) ఇప్పుడు పరిశీలించబడలేని ఆధారాలతో ప్రతిపాదించబడే మనిషి ఊహలే చారిత్రక సైన్స్‌ ఉదాహరణకు మనిషి కోతిలో నుండి వచ్చాడు అని పరిణామవాదులు నమ్ముతారు. మరి అలా అయితే ఇప్పుడు కోతులెందుకు ఉన్నాయి ? దీనికి వారు జవాబు చెప్పరు. జిరాఫీ మెడలు భూమిపై ఆహారం దొరకక పోవడంలో సాగితే మరి గేదెలు, ఆవులు, జింకల మెడలు ఎందుకు సాగలేదు? అని నేటి యువత ఎందుకు ప్రశ్నించటం లేదు? పరిణామ క్రమంలో మనిషి ఉత్తమమైన స్థాయికి వస్తాడు అని చెప్తారు కానీ సృష్టిని పర్యావరణాన్ని న్యూస్‌ పేపర్‌ని పరిశీలిస్తే ఎంత ఉన్నత స్థాయికి మనిషి పరిణామం చెందాడో స్పష్టంగా అర్ధమౌతుంది.

పరిణామ వాదులు - భూమి జీవరాశులు తమంతట అవే ఏర్పడ్డాయి అంటారు. జీవం ఎక్కడ నుండి వచ్చిందో మాత్రం చెప్పరు. వారిది కేవలం ఊహ గనుక అది పరిశోధనకు నిలిచేది కాదు. వారి ఊహకు ఆధారం ఏమిటంటే దేవుడు లేడు అనే తిరుగుబాటు ధోరణి. దేవుడు ఉన్నాడంటే ఆయనను అంగీకరించాలి ఆయన చెప్పినట్లు నడవాలి. ఆయన లేడని లేదా ఆయనను ప్రజలు నమ్మకుండా చేయాలని ఆలోచిస్తే చారిత్రక సైన్స్‌లో నుండి జీవపరిణామంలాంటి వాదనలు పుడతాయి.

ఇలాంటి చారిత్రక సైన్స్‌ దేవునిని దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తూ మానవుని అభిప్రాయాలు, నీతి లేక పోవడం, హోమో సెక్సువల్‌ ప్రవర్తనలు, అశ్లీల దృశ్యాలు, గర్భస్రావం ఇవేమి తప్పు కాదంటుంది. ఇలాంటి వాటిని సమర్ధిస్తూ వారికోసం పోరాటాలు చేస్తుంది చారిత్రక సైన్స్‌.

2. పరిశీలనాత్మక సైన్స్‌ (Operational science) : పరిశీలిం చగలవాటిని గమనిస్తూ మానవుల ప్రయోజనం కోసం వాటిని ఉపయోగించుకొనే విధానమే పరిశీలనాత్మక సైన్స్‌ ఇది మానవునికెంతో మేలు చేస్తుంది. ఈ సైన్స్‌ సృష్టికర్తను తప్పక అనుసరిస్తుంది. ఉదాహరణకు దేవుడు భూమికి గురుత్వాకర్షణ శక్తిని గురుత్వాకర్షణ పరిధిని నియమించాడు. ఇలాంటి ఒక విధానం ఉంది సర్‌ఐజక్‌ న్యూటన్‌ ఏపిల్‌ పండు తన పై పడటం ద్వారా గుర్తించి పరిశోధించి, దాని వలన ఎన్నో ప్రయోజనాలు మానవ జాతికి లభించేలా చేసాడు. గ్రెగరీ మెండల్‌ జన్యువులపై పరిశోధించి దేవుడు నియమించిన పద్ధతిని బట్టి వివిధ ప్రయోగాలు చేసి మేలు జాతి వంగడాలు అభివృద్ధి చేసాడు. మనిషిలో దేవుడు ఏర్పాటు చేసిన రక్తప్రసరణ వ్యవస్థ ఉందని విలియం హార్వే గమనించి ప్రకటించాడు. పరిశీలనాత్మక సైన్స్‌లో మనిషి దేవుడు చేసిన వాటిని గమనించి, క్రొత్త విషయాలు కనిపెడతాడు. Man can Only invent; he cannot create God is the creator మానవుడు కేవలం కనిపెట్టగల అంటే, అతడు సృష్టించలేడు. దేవుడు సృష్టికర్త. ఇక ఆరోగ్య సంబంధ వైద్య విధానాలలోనికి వస్తే దేవుడు నియమించిన శరీర పరిస్థితులను అధ్యయనం చేసి తద్వారా దానికి చికిత్సలు, శస్త్ర వైద్యం నిర్వహించగలుగుతున్నారు. ఈనాడు ఏది కనిపెట్టబడినా అది పరిశీలనా సైన్స్‌ వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. దేవుని సృష్టి క్రమానికి వ్యతిరేకంగా వెళ్తే ఈ పద్ధతి పూర్తిగా విఫలం అవుతుంది. కాబట్టి పరిశీలన సైన్స్‌ వలన మానవునికి ప్రయోజనమే తప్ప ప్రమాదం ఉండదు. కానీ చారిత్రక సైన్స్‌ వలన మనిషి దేవునికి వ్యతిరేకి అవుతాడు నిత్యనరకానికి పరుగులు పెడతాడు.

ప్రియమైన యువతా! పరిణామ వాదంతో కూడిన చారిత్రక సైన్స్‌ను వెంబడిస్తే నిత్య నాశనానికి దారితీస్తుంది. కేవలం కొందరు శాస్త్రజ్ఞులు ఊహలు వీటికి ఆధారంగా ఉన్నాయి. ఒక్క పరిణామ వాదం కూడా నిజమైన పరిశోధనలో ఎంతమాత్రం నిలబడదు. అదంతా కేవలం వ్యక్తుల ఊహలు మాత్రమే. అందుకే నేటి యువత సృష్టికర్తను మరచిపోరాదు. సృష్టికర్త మన జీవితాలకు ఆశీర్వాదం రక్షణ తప్పక కలిగిస్తాడు. ఎవరైతే సృష్టికర్తను విశ్వసిస్తారో వారు రక్షణ పొందుతారు. అబద్దాన్ని నమ్మేవారంతా దేవుని ఉగ్రతకు గురియౌతారు. సృష్టికర్తను నమ్మేవారు దేవుని వాక్యానికి, ఆజ్ఞలకు, వివాహానికి, ఉన్నత ప్రమాణాలకు, జీవిత పరమార్ధానికి ప్రాధాన్యత నిచ్చి వాటికోసం పోరాడతారు. వాటి వలన దీవింపబడతారు. ప్రియ స్నేహితులారా! నిజమైన విజ్ఞానం పొందండి యెహోవా యందలి భయభక్తులే జ
విజ్ఞానం