యవ్వనస్తులుPost Date:2015-08-01//No:45

ఎదురీత'రోమ్‌లో ఉన్నప్పుడు రోమీయునివలె ప్రవర్తించుము!' అను లోకోక్తికి అర్ధము ఏమనగా మనము చెడుతో రాజీపడవలెనని కాదుగాని మనము జీవించు చోట విభేదం సృష్టించకూడదని చెబుతున్నది. నేి యువతీయువకులు అనేక రకాల ఒత్తిడులకు, ఆకర్షణలకు ఇదివరకెన్నడూ లేనంతగా గురియగుచున్నారు. మంచి చెడులను విచక్షణా సహితంగా గుర్తించలేని పరిస్థితిలో అధిక సంఖ్యాకులు ఉన్నారు. దేవుని అల్ప సంఖ్యాకులతో చేరాలో, అపవాది యొక్క అధిక సంఖ్యాకులలోనికి దూకాలో తెలియక అయోమయంలో వున్న స్త్రీ పురుషుల కొరకు ఈ సందేశం వ్రాయబడినది.

నీవు యౌవనుడవుగా ఉన్నప్పుడు ఎక్కడ నిలుచుందువో అదియే నీవు పెద్దవాడవయ్యాక నీవు కూర్చునే స్థలాన్ని నిర్ణయిస్తుంది. 'శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము' అను బలమైన కోటగోడ లోపల అపవాది యుగాల తరబడి ప్రజలను, విశేషముగా యౌవనులను బంధించి యుంచాడు (1 యోహాను 2:16). అపవాదిని సిలువ మీద ఓడించిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచువారు వెంటనే సంపూర్తిగా విడుదల చేయబడుదురు. అయితే అపవాది వారిని మరలా చేజిక్కించుకొనవలెనని వారి వెంటబడి తరుమును. వారు రాజీ పడునట్లు వాడు వారిని మభ్యపెట్టును. వారు అధిక సంఖ్యాకుల అభిప్రాయమును ఆదరంతో అవలంభించునట్లు వారిని మరలా మరలా లాలించును. వారు మరలా వానికి బానిసలగునట్లు వారిని వారి తలంపులలోను, మాటలలోను మరియు వారి క్రియలలోను దారి మళ్ళించుటకు వాని చేతనైనదంతా చేయును. ప్రవాహమునకు వ్యతిరేకముగా ఎదురీదుటకు మీరు సాహిసించాల్సింది ఇక్కడే. ప్రవాహమునకు వ్యతిరేకముగా ఎదురీదుటకు జంకువారు అపవాది వలలో చిక్కుకొనుట నిశ్చయము. కెరాలకు వ్యతిరేకముగా ఎదురీదుట వాస్తవముగా కష్టమే కాని శక్తికి వ్యతిరేకముగా శక్తిని ఉపయోగించినప్పుడు చేకూరు సత్తువ ఎక్కువవుతుంది.కెరాలకు వ్యతిరేకముగా ఎదురీదిన వారి కథలు బైబిలులో కోకొల్లలుగా ఉన్నాయి-

దేవుని హెచ్చరికను పరిహసించినవారికి వ్యతిరేకముగా నోవహు ఎదురీదాడు. ధనము మరియు ఆరోగ్యము ఉంటే అన్నీ ఉన్నట్టే అను తత్వశాస్త్రమునకు అబ్రహాము ఎదురీదాడు. రహస్యముగా పాపము చేయుటయే తెలివిగలతనము అను ధోరణికి వ్యతిరేకముగా యోసేపు ఎదురీదాడు. దేవుని నడిపింపు కంటె సమృద్ధియైన సంపద మరియు పలుకుబడి ప్రాముఖ్యమైనవను ఆలోచనకు వ్యతిరేకముగా మోషే ఎదురీదాడు. విశ్వాసము కాదుగాని ఇంద్రియ గ్రాహ్యముతో కూడిన తెలివే విజయము అను భావమునకు వ్యతిరేకముగా కాలేబు ఎదురీదాడు. పాపిష్టియైన సుఖానుభూతులకు వ్యతిరేకముగా రూతు ఎదురీదినది. లంచగొండితనము మరియు అవినీతికి వ్యతిరేకముగా నెహెమ్యా ఎదురీదాడు. దేవుని ఆరాధించుట కేవలము ఆయన ఆశీర్వాదములను ఆధారము చేసికొనుటకే అను ఆశకు వ్యతిరేకముగా యోబు ఎదురీదాడు. దావీదు పగతీర్చుకొను మనస్సుకు వ్యతిరేకముగా ఎదురీదాడు. యౌవనులైన - హనన్యా, అజర్యా మరియు మిషాయేలు- విగ్రహమును ఆరాధించు మనస్తత్వమునకు వ్యతిరేకముగా ఎదురీదారు. నీ కార్యనిర్వాహక అధికార స్థానమును కాపాడు కొనగలిగినట్లయితే, దేవునినైనా నీవు త్యజింపవచ్చు అను భావనకు వ్యతిరేకముగా దానియేలు ఎదురీదాడు. యేసు స్వార్థమునకును, ఆత్మస్తుతికిని వ్యతిరేకముగా ఎదురీదాడు. పౌలు వారి కడుపే వారికి దేవుడైన బోధకులకు వ్యతిరేకముగా ఎదురీదాడు. తన యొద్ద శిక్షణ పొందుచుండిన తిమోతి విం శిష్యులకు ఆయన, 'ఇతరులు చేయగలరు కాని నీవు మాత్రం...!'అని అనేకసార్లు వ్రాసాడు. నీవు కూడా భిన్నముగా ఉండుటకు భయపడకు.

నేను కళాశాలలో మొదిసారి అడుగుప్టిెన 1962వ సం||లో నేను ప్రవాహమునకు వ్యతిరేకముగా ఎదురీదుటకు ఆరంభించితిని. పాపిష్టిదైన ఈ లోకంలో పరిశుద్ధముగా జీవించండి. చక్కగా చదువుకొనండి. కష్టపడి పని చేయండి. పాఠ్యపుస్తక తెలివితో పాటు మంచి మర్యాదలు కూడా నేర్చుకొనండి. దేవునితో మ్లాడండి. ఆయన చెప్పేది వినండి. మంచి నాయకులను మాదిరిగా చేసుకోండి. సమాజములో క్రీస్తు యొక్క చిత్తశుద్ధి గల సేవకులైయుండండి. మీ జీవిత భాగస్వామిని ఎన్నుకున్నప్పుడు జాగ్రత్త వహించండి. ఆచార యోగ్యమైన మార్గదర్శక నియమాలను పాించండి.

క్రైస్తవ జీవితమంటే, ఆరంభము నుండి అంతము వరకు కూడ ప్రవాహమునకు వ్యతిరేకముగా ఎదురీదుటయే. ఆవలి గట్టుచేరు వరకు వెళ్లుట అంత సులభం కాదు, అది అసాధ్యమూ కాదు. మధ్యదారిలో నీవు మునిగిపోతున్నట్లు అగుపించవచ్చును. కాని యేసు తన హస్తములను నీకందించి నిన్ను పైకెత్తును! చాపబడియున్న హస్తములతోను, ప్రశంసించు హర్షధ్వనులతోను నిన్ను ఆహ్వానించుటకు ఆయన ఆవలి తీరమున నిలిచియుాండు!జీవితంలో రెండే రెండు నిబంధనలు పాించాలి. నెంబర్‌ వన్‌: ఎన్నికీ తప్పుకొనవద్దు! నెంబర్‌ టు: నంబర్‌ వన్‌ నిబంధనను ఎన్నికీ మరచిపోవద్దు!యౌవనమనునది బాల్యథకు స్వస్తిచెప్పి వయోజన వయస్సు వైపు పరుగులెత్తే థ. అది తనకు తానే ఒక ప్రపంచం. దాని శాస్త్రాలు, శాసనాలు మరియు సాంకేతికాలు పూర్తి భిన్నంగా ఉంాయి. అందుకే పెద్దతరం వారికి, వీరికి మధ్య తరుచుగా పోరాటం జరుగుతూవుంటుంది. ఒక భారతీయుడు అమెరికాలో ఇమడలేనట్లే యౌవనంలో అడుగు పెడుతున్న వారి పోకడలన్నీ విపరీతమైనవిగా కనబడును. యువతరం పిల్లల్లో పొంగి పొర్లే ఎదిరించు స్వభావం భారతదేశంలో ఇంకనూ మనమీద విరుచుకు పడలేదు. అయినా అది అతిత్వరలో సమీపిస్తున్నట్లున్నది. ఈ తరపు యువతను ఈ దురవస్థ బహుగా అలము కొనుచున్నది. అందువలన యిప్పి యువతకూ వారి తల్లిదండ్రులకు ఈ తరమును గూర్చి సరైన అవగాహన కలిగియుండుట ఎంతైనా అవసరం. -  డా||ఆర్‌.స్టాన్లీ
ఎదురీత
ఎదురీత

అన్న, తమ్ముడు

ప్రేమతోనే విజయం సాధించాలి ''

సినిమాలు చూడటం తప్పా?

పౌరుషంతో ప్రసంగం

పరిపాలించు అభిషేకం యౌవనస్థులు ఎదుర్కొనే సవాలు

యౌవన విశ్వాసీ... జవాబు నీకే తెలుసు

యౌవన విశ్వాసీ... జవాబు నీకే తెలుసు

గడచిన తరుణం

యవ్వనజ్వాలగడచిన తరుణం

యవ్వనజ్వాల యువత కావలెను!

యౌవ్వన జ్వాలయౌవన విశ్వాసీ... జవాబు నీకే తెలుసు

యవ్వనజ్వాలక్రైస్తవులు ముందుకు రావాలి

యవ్వనజ్వాలమంచి సైనికునివలె

యవ్వనజ్వాలయౌవనస్తులారా! సిద్ధపడండి!

యవ్వనజ్వాలప్రేమంటే?!

యవ్వనజ్వాలప్రేమంటే?!

యవ్వనజ్వాలప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఓ సండేస్కూల్‌ టీచర్‌

యవ్వన జ్వాల ఎల్లో రిబ్బన్‌

యవ్వనజ్వాలయౌవనుడా! కాడిమోయి!

స్నేహితుల వత్తిడి

యవ్వనజ్వాల క్రైస్తవ యవ్వనులు - దేశసేవ

యవ్వనజ్వాలదీవెన మరియు శాపము

ప్రతిరోజూ అవసరమా..?

యవ్వన జ్వాలఅమ్మ మాట

నా చెడు చూపులను మార్చుకొనేదెలా...?

యవ్వనజ్వాలనీవైతే ఏం చేస్తావు?

సినిమాలు చూడటం తప్పా ?

సినిమాలు చూడటం తప్పా ?

యవ్వనజ్వాలకా''లేజి''కి వెళుతున్నావా..!

విజ్ఞానం గల యువత -

యవ్వనజ్వాల మూడు ముళ్ల ప్రార్ధన

యవ్వనజ్వాల రాజసేవకై యువతరం

యవ్వనజ్వాల అతి తెలివి

స్కాట్లాండులో ఒక్క యౌవనుడు కూడా లేడా?

యవ్వన జ్వాల క్రీస్తుకు కావలసినవాడు.. యువకుడంటే!!!

యవ్వనజ్వాల ప్రేమను గురించి శాస్త్రీయ సత్యాలు

చరిత్ర చెప్పే సాక్ష్యం

జీవిత భాగస్వామి ఎంపిక -1 - మతతర తెగాంతర వివాహము

కోపము ,అసూయ ,గర్వం ,సోమరితనము

దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికీ రెండు చిట్కాలు