స్త్రీలుPost Date:2013-10-02//No:15

శారా ఈ స్త్రీ ఎవరనగా, హవ్వ దగ్గర నుండి, ఇంచుమించు 20 తరములు తరువాత, 2000సం॥ కాలము తరువాత దేవుడు ఏర్పాటు చేసుకున్న జనములకు తండ్రి అయిన అబ్రహాము భార్య. ఈమె అబ్రాహాము సహోదరుడు కుమార్తె, తెరహు కోడలు, కల్దియ ప్రాంతము ఊరు అన పట్టణము. ఈమె గొడ్రాలు    {ఆది: 11:29-31}

             ఈ స్త్రీ గుణవతి, రూపవతి భర్తను యజమానుడా అని పిలిచేది, భర్తతో పాటు ఎక్కడికైన సిద్దపాటు, అందువలనే అబ్రహాము ఈమె మాట వింటాడు.

             కల్దీయ ప్రాంతమునుండి, కనాను దేశము భర్తతో వచ్చినది. అక్కడ కరువు వచ్చినందున ఐగుప్తుకు వెళ్ళిరి. అబ్రాహాము భార్యతో మనము ఎక్కడకు వెళ్ళిన నా చెల్లెలు వని చెప్పుము అని చెప్పెను. నిన్ను బట్టి నన్ను చంపుదురేమో అని భయముతో చెప్పెను. ఆ విధంగా ఐగుప్తులో ఫరో మనుష్యులు చూచి శారా గూర్చి చెప్పిరి, శారా ఫరోవద్దకు తేబడెను. దేవుడు ఫరో ఇంటివారిని మహావేదనలచేత బాధించెను. ఫరో భయపడి వెంటనే శారాను పంపివేసెను.     {ఆది : 12:10-20}.  

              కనాను మరల వచ్చిరి, శారాకు సంతానములేరు, కనాను వచ్చి 10 సం॥ అయింది దేవుడు చెప్పినది ఇంకా జరగలేదు, శారా తన దాసి అయిన హాగరును అబ్రహాముకు ఇచ్చి సంతానము పొందాలని ఆశపడెను ఆవిధముగా చేయగా హాగరు గర్భవతి అయి యజమానురాలైనా శారాను నీచముగా చూసెను. శారా ఇంటిలో నుండి దాసిని వెల్లగొట్టగా, అరణ్యములో దూత కలిసి తిరిగి శారా దగ్గరికి వెళ్ళ మనగా వచ్చి లోబడి ఉండెను. {ఆది: 16:1-9}

               ఆ తరువాత దేవుడైన యెహోవా, అబ్రాహాము, శారా పేర్లు మార్చెను. అబ్రామును అబ్రాహాముగా, శారాయి - శారాగా. శారా వయస్సు 90 సం॥ యెహోవా మరల వాగ్దానము శారాతో ఒక కుమారునికని ఇస్సాకు అని పేరు పెట్టెదవు అనెను. అతని సంతానమును నేను ఆశీర్వదించెదను అనెను. {ఆది : 17:15-19}.  

                   ఒకసారి అబ్రాహం ఇంటికి ముగ్గురు దేవదూతలు రాగా, అబ్రాహాము చెప్పిన వెంటనే శారా భోజనము సిద్దం చేసెను. వారు భోజనము చేయునపుడు శారా గుడారము ద్వారము వద్ద ఉండి వారి మాటలు విని చుండెను. వచ్చే కాలము శారా కుమారుని కనును అనివారు చెప్పగా శారా నవ్వెను (మనసులో) యెహోవా శారా నవ్వనేల యెహోవాకు అసాధ్యమైనది ఏమైన ఉందా అనగా నేను నవ్వలేదు అని శారా అనెను {ఆది 18:1-15}.

                ఒకసారి అబ్రాహాము శారా గెరారులో ఉన్నప్పుడు అబీమెలెకు అనురాజు శారాను పిలిపించెను. ఇక్కడ కూడా అన్నచెల్లెలు అని చెప్పిరి. శారాను బట్టి రాజు కుటుంబములో అందరి గర్భములు మూసి వేసెను. యెహోవా ఆ రాజుతో అబ్రాహాము ప్రవక్త అతడు ప్రార్ధన చేస్తే నీ ఇంటివారు బాగు పడుదురు అనెను. {ఆది : 20:1-18}

                ''శారా''కు ఇస్సాకు పుట్టెను. అబ్రహాముకు 100సం॥ గొప్పవిందు జరిపించెను. వీరిలోనే ఉన్న హాగరు కుమారుడు ఇష్మాయేలును శారాను పరిహాసించెను, వ్వ్ సారి హాగరును, ఇష్మాయేలును ఇంటిలో నుండి శారా వెల్లగొట్టెను. శారా మాటవినమని దేవుడు అబ్రహాముతో చెప్పెను. {ఆది 21:1-12}.

                ''శారా'' జీవించిన కాలము 127సం॥ కనాను దేశములో మృతినొందెను. అబ్రాహాము శ్మశాన భూమికొని మక్పెలా గుహలో పాతిపెట్టెను {ఆది :23:1-20}

శారా