స్త్రీలుPost Date:2013-09-12//No:12

హవ్వ​హవ్వ​
హవ్వ​
దేవుడు భూలోకమును సృష్టించినపుడు, మొదటి మానవులను నిర్మించిన విధానము మట్టితో నిర్మించి మగ వానిగను అతని ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి ' స్త్రీ ' గా నిర్మించి పురుషునికి భార్యగా ఇచ్చెను. ఈ విధముగా వీరు ఇద్దరు భార్య, భర్తలు ఒక్కటి అవుతారు. వీరు ఏక శరీరులు గనుక దేవుడు వీరికి ఒక ఆజ్ఞ ఇచ్చెను, సర్పములో సాతాను ప్రవేశించి స్త్రీని మోసము చేసినది. దేవుడు తినవద్దు అని చెప్పిన పండ్లను స్త్రీ తిని, తన భర్తకు ఇచ్చినందున, దేవుడు, స్త్రీని, పురుషుని, సర్పమును శపించెను. స్త్రీకి ఇచ్చిన శాపములు స్త్రీ సంతానమునకు సర్ప సంతానమునకు వైరము కల్గును. నీ ప్రయాస గర్భవేదన హెచ్చించెదెను, వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంఛ కల్గును, అతడు నిన్ను ఏలును. అందువలనే స్త్రీ జాతికి ఈ రోజు వరకు ఇవి జరుగుతున్నాయి. మానవులందరికి మొదటి తల్లి హవ్వ, మొదటి తండ్రి ఆదాము, హవ్వ అను పేరు తన భర్త అయిన ఆదాము పెట్టెను. వీరిద్దరు కాపురము మొదలు పెట్టిరి. వీరి ద్వారా కుమారులు, కుమార్తెలు పుట్టి, భూమి మీద జనము ఈ రోజు కొన్ని కోట్లమంది ప్రజలు అయినారు. (ఆది : 2,3,4,5 అధ్యాయంలు)