వాక్యసందేశముPost Date:2014-11-21//No:94

బైబిలులోని ఆఖరు సిద్ధాంతం ప్రకటన 22:7,12,20యోనా గ్రంధము 1:17 నుండి 2:10 వరకు వ్రాయబడిన వచనములు ఒక అసాధారణ విషయమును వివరించినవి. ఈ విషయము కల్పనాకధ కాదు. చారిత్రక సత్యము. యోనా గ్రంధములో 1:17 'గొప్ప మత్స్యము ఒకటి యోనాను మ్రింగవలెనని యెహోవా నియమించి యుండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము కడుపులో ఉండెను. ఒక మనుష్యుని మత్స్యము మ్రింగుట, మత్స్య గర్భములో మూడు దినములుండుట, తిరిగి సజీవునిగా బయటపడుట అనునవి అసంభవమయిన విషయములని పలువురి ఆధునిక విమర్శకుల అభిప్రాయము. కాని ఇది సంభవమే అని చెప్పుటకు తరువాతి దినములలో అనేక సంఘటనలు ఇటువంటివే సంభవించుట వలన క్రైస్తవ విశ్వాసులు యోనా గ్రంధమును గూర్చి ఇంకను ఆధారములు కావలెనని విచారించవలసిన పనిలేదు.

ఇది బైబిలులోని చివరి సిద్ధాంతము క్రొత్త నిబంధన గ్రంధములో 25 వచనములకు ఒకసారి లెక్కన యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడను గూర్చిన మాటలున్నాయి. యేసు తానే ప్రత్యక్షంగా, విజయవంతంగా, హఠాత్తుగా వస్తానని చెప్పారు. ఆయన త్వరగా హఠాత్తుగా, ఆకస్మికముగా వస్తాడని ఈ చివరి అధ్యాయంలో ముమ్మారు చెప్పబడింది. బైబిలులో యేసుప్రభువు త్వరగా (రమ్ము) వచ్చెయీ! ఈ చివరి ప్రార్ధన మొదటి నుండి ఇంతవరకు యేసుక్రీస్తు సంఘము తన కోరికను వెల్లడిచేసినది. మన ఆశాభావము కూడా ఆయన రాకడ గురించే. మనం చూడగోరేది ఆయన మహిమతోనే. యేసుక్రీస్తు ప్రభూ త్వరగా రమ్ము. అవును. ఆమేన్‌.

1. బైబిలు యొక్క ఆఖరు '7' ధన్యకర వర్తమానములు :

1. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను - ఈ గ్రంధములోని ప్రవచన వాక్యములన్ని గైకొనువాడు ధన్యుడు. ప్రకటన 22:7.

2. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను - వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపర్చిన జీతము నావద్ద ఉన్నది. ప్రకటన 22:12.

3. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు. అవును. ఆమేన్‌. ప్రకటన 22:20.

4. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు - ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచినవారు ఆయనను చూచెదరు. భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును. ఆమేన్‌. ప్రకటన 1:7.

5. ఇదిగో నేను దొంగవలె వచ్చెదను - ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు - మారు మనస్సు పొంది జాగరూకుడవైయుండుము. ప్రకటన 3:3.

6. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను - ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన 3:11


బైబిలులోని
7. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను - తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున, జనులు తన దిశ మొలను చూతురేమో అని మెళకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. అవును. ఆమేన్‌ ప్రకటన 16:15.

2. బైబిలులోని ఆఖరు ఆజ్ఞ : ప్రకటన 22:10

ఈ గ్రంధమందున్న ప్రవచన వాక్యములకు ముద్రవేయవలదు - కాలము సమీపమైయున్నది. సమయం దగ్గరపడింది. దానియేలు 12:4లో దానియేలూ ఈ మాటలు అంతిమకాలం వరకు ఈ గ్రంధమును ముద్రించి వెయ్యి అన్నాడు. అయితే యోహానుకు ప్రవచనాలకు ముద్ర వెయ్యరాదు అంటే వాటిని అర్ధం చేసుకునేందుకే, సమస్తము సంఘము తెలుసుకొనునట్లు దేవుని సేవకులకు ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. ముద్ర విప్పిన గ్రంధం. మర్మము తెలిపిన గ్రంధం. నీ నా చేతికి ఇవ్వడం జరిగింది యోహానుగారి ద్వారా. దానిని మూసి, నీ హృదయం మూసుకొని, మత్తు నిద్రలో ఉండవద్దు. జాగ్రత్తగ చదివి, బోధించి ధన్యుడవుకమ్ము. అవును. ఆమేన్‌.

3. బైబిలులోని ఆఖరు వర్తమానము :

ప్రకటన 22:11-15 అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయును. అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండును. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండును. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండును. అవును. చెడుగు చేసే ప్రతి ఒక్కడు బాధకు, యాతనకు గురి అవుతాడు. మంచి చేసే ప్రతి ఒక్కడు గౌరవం, మహిమ, శాంతి కలుగుతాయి. దేవునికి పక్షపాతం లేదు.

4. బైబిలులోని ఆఖరు ఆహ్వానము : ప్రకటన 22:16,17

నేను యేసును సంఘములకోసం ఈ సంగతులు గూర్చి మీకు సాక్ష్యం చెప్పడానికి నా దూతను పంపాను. నేను క్రీస్తును అనే పదం బైబిలు అంతటిలోను ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. వీటిని సంఘాలకు చెప్పాలి అంటే ఈ గ్రంధంలోని దర్శనాలన్నీ అని అర్ధం. 'ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు వినువాడును రమ్మని చెప్పవలెను. దప్పికగొనువాడు రావలెను. యిచ్చిఇంచువాడు జీవ జలము, ఉచితముగా పుచ్చుకొనవచ్చును. దేవుని ఆత్మ నిజమైన సంఘమైన క్రీస్తు వధువు మనుష్యులను ఎడతెగక రమ్మని పిలుస్తున్న ఆహ్వానంగా భావించాలి. ఈ చివరి ఆహ్వానం చాలా గొప్పది. నీతి చిగురు ప్రకాశమానమైన వేకువ చుక్క అయిన ఆయనే ఆహ్వానించుచున్నాడు. ఈ ధన్యకరమైన చివరి ఆహ్వానాన్ని విన్న వారు ధన్యులు.

5. బైబిలులోని ఆఖరు హెచ్చరిక : ప్రకటన 22:18,19

ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపినయెడల ఈ గ్రంధమందు వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంధమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంధములో వ్రాయబడిన జీవవృక్షములోను, పరిశుద్ధ పట్టణములోను వానికి పాలులేకుండ చేయును. ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యమునుగైకొనుట శ్రేయస్కరము. ద్వితీ 4:2, 12:32 ఇక ఈ మాటలను కలుపుటకు, తీసివేయుటకు నిషేధ హెచ్చరిక ఇక్కడ ఉంది.

6. బైబిలులోని ఆఖరు ప్రార్ధన : ప్రకటన 22:20

ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు, ఆమేన్‌. ప్రభువైన యేసు రమ్ము. అలాగే యేసుప్రభూ వచ్చెయ్యి యదార్ధవంతమైన హృదయంగల ప్రతివ్యక్తి హృదయంలో ఈ ప్రార్ధన మారుమ్రోగుతుంది. బైబిలులోని ఈ చివరి ప్రార్ధన మొదటి నుండి ఇంతవరకూ క్రీస్తు సంఘము కోరికను వెల్లడిచేసేది ఇది. మన ఆశాభావమంతా ఆయన రాకడను గురించే మనం చూడగోరేవి ఆయన మహిమే ! అవును. ఆమేన్‌.

7. బైబిలులోని ఆఖరు దీవెన : ప్రకటన 22:21

ప్రభువైన యేసుకృప పరిశుద్ధులకు తోడైయుండునుగాక! ఆమేన్‌. ఈ చివరి ఆశీర్వాద వాక్యం బైబిలు ఉపదేశించేదానంతటికీ తగిన ముగింపు, పాపాన్ని మరణాన్ని జయించి మనల్ని దేవుని ప్రజలుగా చేసి దేవుడు వాగ్దానం చేసిన దానినంతటికి వారసులుగా చేయగలిగేది యేసుక్రీస్తు ప్రభువు కృప మాత్రమే. అది పవిత్రులకు తోడైయుంటుంది. బైబిలు చివరి మాట ఆమేన్‌.

 - ఇవాంజిలిస్టు సొలొమోను పులిపాక