వాక్యసందేశముPost Date:2014-10-10//No:76

ఆకలి కలుగజేసి అద్భుతముగ ఆశీర్వదించే దేవుడు దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు పరలోకము నుండి మన్నాను కురిపించిన అనుభవాన్ని ధ్యానిద్దాము. నిర్గమ 13లో ఇశ్రాయేలీయుల యొక్క కనాను యాత్ర ప్రారంభమైనది. 14వ అధ్యాయము ఇశ్రాయేలీయుల జీవితములో మరచిపోలేని మధురమైన అనుభవాలు కలిగిన అధ్యాయము. అందుకే 14వ అధ్యాయములోని గొప్ప సంగతులను జ్ఞాపకము చేసుకొని, 15వ అధ్యాయములో దేవుని స్తుతించారు.

ఇశ్రాయేలు కనాను యాత్రలో పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభమందు దేవుడు వారితో నడిచాడు. వారు కన్నులెత్తి చూడగా దేవుని మేఘము కనిపించును. అంత ప్రత్యక్షముగా దేవుని సన్నిధి, దేవుని మహిమ చూచిన వారు ఎక్కడా ఉండరు. అరణ్యములో దేవుని మహిమను ప్రతిరోజు మేఘముద్వారా, అగ్ని స్తంభము ద్వారా చూచేవారు. అయితే అకస్మాత్తుగా వారికి ఒక సమస్య వచ్చినది. ఏదనగా చచ్చేంత ఆకలి వచ్చినది. విశ్వాసయాత్రలో దేవుని నమ్మిన తరువాత ఇంత ఆకలా? ఇంత పెద్ద సమస్యనా? నిర్గమకాండము 16:3లో 'యెహోవా చేతివలన ఏల చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా'. ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయులలో చచ్చేంత ఆకలి ఇచ్చినాడు.

దేవుడు భయంకరమైన ఆకలి వారి మీదికి తీసుకొని వచ్చినట్లుగా గమనించగలము. ఐగుప్తు నుండి వారు తెచ్చుకున్న ఆహారము, రొట్టెలు అయిపోయినవి. మొదటిరోజు, రెండవరోజు ఎండిన రొట్టెలు వారు తినుచుండవచ్చు. చిట్టచివర ఆహారము అయిపోయినది. ఆకలి ప్రారంభమైనది ఆకలి ప్రారంభమై ఏ స్థాయికి వెళ్ళినదనగా వారి ఆకలి వారిని చావుకి తీసుకు వెళ్ళే స్థితికి వచ్చినట్లుగా చూస్తాము. విశ్వాసయాత్రలో దేవుని నమ్మిన తరువాత ఇంత ఆకలా? ఇంత పెద్ద సమస్యనా? ప్రియమైనవారలారా! ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి ఆకలి లేదు. ఐగుప్తులో కూరగాయలు ఉండినవి, వేవేల సంఖ్యలో పొట్టేళ్ళు ఉండినాయి. అయితే ఇక్కడ చూస్తే ఆకలిగా ఉంది.

ప్రియమైనవారలారా! విశ్వాస జీవితానికి విశ్వాసానికి వెలుపల ఉండే జీవితానికి భేదము ఉన్నది. ఐగుప్తులో వారికి ఆకలి లేదు. అయితే దేవుని దగ్గరకు వచ్చిన తరువాత, అరణ్యయాత్రకు వచ్చిన తరువాత చచ్చేంత ఆకలిని దేవుడు వారికి ఇచ్చినాడు. లూకా సువార్త 1:53లో ఆకలిగొనిన వారిని మంచి పదార్ధములతో సంతృప్తి పరుస్తాడు. దేవుని యొక్క పద్ధతి ఏదనగా మొదట ఆకలిగొనిన వారి వద్దకు దేవుడు వచ్చి మంచి పదార్ధములను వారికి ఇస్తాడు. కనుక దేవుడు వారికి మంచి పదార్ధములను ఇవ్వాలంటే వారికి ఆకలి కలగాలి. అయితే ఈ ఆకలి ఎవరు కలుగచేస్తారు? దేవుడు కలుగచేస్తాడు.

ద్వితీయోపదేశకాండము 8:3లో 'ఆయన నీకు ఆకలిని కలుగచేసి.' అది దేవుని యొక్క పద్ధతి. ఐగుప్తులో ఆకలిలేదు. అయితే వాళ్ళకు ఉన్నది కూరగాయలే. అయితే కనాను యాత్రలో అరణ్యయాత్రలో ఆకలి కలిగినది అది దేవుడు కలుగచేసిన ఆకలి. అది చచ్చేంత ఆకలి. ద్వితీయోపదేశకాండము 8:3లో 'నీవే గాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను' అని వ్రాయబడినది. అనగా చచ్చేంత ఆకలి వచ్చిన తరువాత దేవుడు ఆకస్మాత్తుగా వారి సమస్యలో ప్రవేశించడము ప్రారంభిస్తాడు. పితరులైన ఆదాముకు, హవ్వకు, అబ్రాహాముకు తెలియని మన్నాతో, అరుదైన ఆహారముతో దేవుడు నిన్ను పోషించెను అనే మాటను చూస్తాము. ప్రియమైన వారలారా! మన జీవితములో కలిగే ఆకలికి, మన జీవితములో చనిపోయేంత సమస్యలకు మనము ఎప్పుడు భయపడకూడదు.

కీర్తనలు 78:23లో 'అయినను ఆయన పైనున్న ఆకాశమును ఆజ్ఞాపించెను అంతరిక్ష ద్వారములను తెరచెను. మన్నాను కురిపించెను ఆకాశ ద్వారములను తెరిపించెను.' చనిపోయేంత ఆకలి దేవుడు కలుగచేసిన తరువాత వాక్యములో వ్రాయబడినది కదా! దేవుడు వారిని దర్శించినాడు. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను.

ఎందుకు దేవుడు ఆకాశ ధాన్యమును కురిపించినాడు అనగా భూలోకములో ధాన్యము లేకనా? నిర్గమకాండము 16:4లో 'ఆకాశము నుండి నేను మీ కొరకు ఆహారమును కురిపించుదును'. అనగా అర్ధము వీరు ఎదురుచూచే ఆహారము భూమి మీద లేదు. ఇప్పుడు ఆహారము లేక బాధపడుచున్నారు. వారికి అన్నము పెట్టుటకు ఎవరులేరు. అయితే అనేక లక్షల మంది ఇశ్రాయేలీయుల దగ్గర ఆహారము లేదు. మరి ప్రక్కన ఏదైనా దేశమున్నదా? అంటే లేదు. వారు ఎక్కడ ఉన్నారనగా ఎడారిలో. ఇశ్రాయేలీయుల ప్రశ్న ఏదనగా, ఎక్కడ నుండి మాకు ఆహారము వస్తుంది? అప్పుడు దేవుడు ఏమన్నాడనగా ఇక్కడ ఆహారము లేదా ఆకాశము నుండి కురిపిస్తాను అన్నాడు.

దేవుడు ఇశ్రాయేలీయులతో ఏ రోజుకు సరిపోయే మన్నా ఆ రోజుకు తీసుకొనండి. రేపటికి ఎత్తి పెట్టుకోవద్దు చెడిపోతుంది అన్నాడు. అయితే అది చాలా రుచిగా ఉందని కొంతమంది ఎత్తిపెట్టుకున్నారు. మరుసటి రోజుకు అది కుళ్ళిపోయినది. దేవుడు శుక్రవారము వారితో మాట్లాడినాడు. ఇదిగో నేను మన్నాను కురిపిస్తున్నాను కాని, శనివారము కురవదు రెండు రోజులకు తీసుకొనండి అన్నాడు. వాళ్ళు రెండు రోజులకు తీసుకునగా అది శనివారమునకు చెడిపోలేదు. మిగిలిన రోజులలో తీసుకొనగా కుళ్లిపోతుంది. శనివారము మాత్రము కుళ్ళిపోదు ఎందుకనగా ఆ రోజు వారు తీసుకొనకూడదు. చెడిపోని ఆశీర్వాదాలు మన సొంతం కావాలనగా అవి మనము దేవుని మాటకు చూపే విధేయత మీద ఆధారపడి ఉండును.

నిర్గమకాండము 16:7లో 'ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు'. ఇంత భయంకరమైన సమస్యలో మోషే ఎంత నమ్మకము దేవుని మీద కలిగి ఉన్నాడన్నది ఈ వాక్యములో అర్ధమగును. లక్షల మందికి ఆహారము లేదు. మేము చనిపోతాము మేము చనిపోయే దానికంటే మీరు చంపడము మేలు అన్నంత స్థాయికి వెళ్ళిన ఇశ్రాయేలీయులు వెళ్ళినారు. అయితే మోషే అంటున్నాడు ఉదయమున మీరు యెహోవా మహిమను చూస్తారు.

ఒక కుటుంబానికి అన్నము పెట్ట్టటము చాలా కష్టము. అయితే లక్షల మందితో మోషే పలికే మాట రేపు ఉదయమున మీరు యెహోవా మహిమను చూస్తారు. మోషేకున్న నమ్మకము ఏమిటి? ఆత్మచేత నింపబడిన జీవితాలలో జాతీయ సమస్య అయినా భయపడరు. ఎందుకనగా క్రైస్తవ జీవి
ఆకలి