వాక్యసందేశముPost Date:2014-09-26//No:74

ప్రభువు సౌందర్యం  పరమగీతము 5వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు

అతని శిరస్సు అపరంజివంటిది

అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణవర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.

అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.

అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగములు

  అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.

అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి

అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది.

అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి.

అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము.

అతని నోరు అతిమధురము. అతడు అతి కాంక్షణీయుడు

యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.

పైవచనాలలో ప్రభువైన యేసులో పది విధములైన సౌందర్యం కనిపిస్తుంది. ఇది సాటిలేని సౌందర్యం. శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రభువు సౌందర్యము మనం గమనిస్తాం. ఆ సౌందర్యాన్ని ఇపుడు మనం ధ్యానింపబోతున్నాం.

1. 5:11 ప్రభువు యొక్క శిరస్సు : ప్రభువు యొక్క శిరస్సు ఆయన శిరసత్వాన్ని సూచిస్తుంది. కొలస్సై 1:18 లో సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు అని చదువుతాం. ఎఫెసి 5:23 లో క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నాడని గమనిస్తాం. ఎఫెసి 2:20 లో క్రీస్తు ప్రభువే ముఖ్యమైనవాడు, శిరస్సు వంటి వాడని చదువుచున్నాం. ఎఫెసి 4:16లో ఆయన శిరస్సైయున్నాడని గ్రహిస్తాం. 1 కొరింథి 11:3లో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తని వ్రాయబడి వుంది. ప్రభువు శిరస్సై యున్నాడు.

ప్రభువు శిరసు బంగారము వంటిది. బంగారము జ్ఞానమునకు సాదృశ్యం. యోబు 28:12లో జ్ఞానమును గూర్చి ప్రశ్న వేశాడు. 16వ వచనంలో అది బంగారము కంటె శ్రేష్టమైంది అన్నాడు. మన శిరస్సైయున్న ప్రభువు శిరసులో బంగారము కంటె శ్రేష్టమైన జ్ఞానముంది. అలాంటి జ్ఞానము కల్గిన ప్రభువు మనలను నడిపించుటకు సమర్ధుడు.

2. అతని తలవెంట్రుకలు : ఇంతకు ముందు ఆయన తలపైన పరిశుద్ధాత్మ (మంచు) వున్నదని మనం నేర్చుకున్నాం. ప్రభువు తలవెంట్రుకలు, ఆయన సమర్పణకు, నజీరు జీవితమునకు సాదృశ్యంగా వున్నవి. నల్లని వెంట్రుకలు బలమునకు, సౌందర్యమునకు సాదృశ్యము. ఆయన బలవంతుడైన దేవుడు. బలహీనులమైన మనకు ఎల్లప్పుడు సహాయం చేయగలడు.

నల్లని వెంట్రుకలు మార్పులేని జీవితాన్ని సూచిస్తున్నాయి. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా వున్నాడు. మార్పులేని దేవుడు మనం అనేకసార్లు నీళ్ళవలె చంచలంగా వుంటాం.

3. 5:12 : ప్రభువు యొక్క నేత్రములు : ప్రభువు యొక్క నేత్రములు పాపమును చూడలేనంత పరిశుద్ధమైనవి. ఆయన పరిశుద్ధమైన నేత్రములు గలవాడు. ప్రభువు బిడ్డలమైన మన చూపులు అంత పరిశుద్ధంగా ఉండాలి. కీర్తన 33:13లో 'ఆయన దృష్టి నరులందరి మీద వుందని ఆయన అందరిని కనిపెట్టుచున్నాడని' మనం నేర్చుకుంటున్నాం. ఆయన కనుదృష్టి తన భక్తులపై వుందని నేర్చుకుంటున్నాం. తన భక్తులను ఆయన మరణం నుండి తప్పిస్తాడు. ఆయన భక్తులవైపు ఆయన చూస్తున్నాడు. (కీర్తన 34:15)

4. అతని చెక్కిళ్ళు : ప్రభువు చెక్కిళ్ళు ఎంతో శ్రేష్టమైనవి. మన పాపముల నిమిత్తం అవి కొట్టబడినవి. విలాప 3:30లో చెప్పబడినట్టు ప్రభువు తనను కొట్టువారి తట్టు తన చెంపను త్రిప్పాడు. మీకా 5:1 చెప్పబడినట్లు ఇశ్రాయేలీయుల అధిపతియైన ప్రభువును కర్రతో చెంపమీద కొట్టారు. మార్కు 14:65లో యోహాను 18:22లో కొట్టువారికి తన చెంపలను, పెరుకువారికి గడ్డములను అప్పగించాడు. ఇప్పుడైతే ఆనంద తైలముతో అభిషేకించబడిన చెంపలు గలవాడై సువాసనలు వెదజల్లుచూ అన్ని నామములకు పై నామముగా తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై యున్నాడు. ప్రతిష్ఠిత తైలము సుగంధ వృక్షముల నుండి తయారు చేయబడిన తైలము ఆయన తలమీద పోయబడగా అది ఆయన చెక్కిళ్ళపైనుండి పరిమళిస్తుంది.

5. 5:13 అతని పెదవులు : అతని పెదవులు - అనగా ప్రభువు పెదవులు పద్మముల వంటివి. పద్మములెంత సౌందర్యముగా వుంటాయో అంత సౌందర్యము గలవి. పద్మములు తెల్లగా నుండునట్లు ఆయన పెదవులు పరిశుద్ధమైనవి.

యెషయా 50:4 వచనంలో ప్రభువు పెదవులను గమనిస్తున్నాం. అలసిన వానిని మాటలుచేత ఊరడించే పెదవులు ప్రభువు కల్గి వున్నాడు. ఆయన మాటలు శ్రేష్టమైనవి. నెమ్మదిని కల్గించేవి. కీర్తన 45:2లో ఆయన పెదవుల మీద దయారసము పోయబడియున్నదని మనం నేర్చుకుంటున్నాం. లూకా 4:22లో ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. 2కొరింధి 12:9లో ఆయన పెదవులనుండి కృప మనకు కలుగుతుంది.

6. 5:14 ఆయన కరములు : ప్రభువు చేతులు మన పాపముల నిమిత్తం పొడవబడినవి. ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన చేతులలో మేకులు గురుతులు, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు గురుతులు (యోహాను 20:25) వున్నవి. అయితే యిప్పుడు ప్రభువు చేతులు మహిమలో వున్నాయి. తర్షీషులో దొరికే రత్నముల చేత అలంకరింప బడినట్లున్నాయి. అవి గోళపు ఆకారములో వుండి పాపులను ఆయన బిడ్డలను కౌగలించుకొనుటకు సిద్ధంగా వున్నాయి. ఆయన తన ప్రజలకు నిత్యజీవాన్ని దయచేశాడు. స్వర్ణగోళముల వలెనున్న ఆయన చేతులలో నుండి ఆయన గొర్రెలను ఎవడును అపహరించలేడు. ఆది 49:24లో చెప్పబడినట్లు దేవుని పరాక్రమ హస్తములు ఆయన ప్రజలను కాపాడుతూ వుంటాయి.

7. అతని కాయము - శరీరము : 'శరీరము' అనే మాట ఆయన 'ఉదరము' (పొట్ట) అని అర్ధమిస్తుంది. మూలభాషలో అంతరింద్రియమునకు ఇది సాదృశ్యము. ఈ అంతరింద్రియములో ప్రేమ, దయ, కృప, నిలిచి వుంటాయి. యిర్మియా 31:20లో దేవుని కరుణను మనం గమనిస్తున్నాం. అందువల్ల దేవుడు కరుణ గలవాడని ప్రేమగలవాడని, మన కర్ధమగుచున్నది. మత్తయి 9:36లో ప్రభువు ప్రజలవైపు చూచి వారు కాపరి లేని గొర్రెల వలె వున్నందున వారిమీద కనికరపడ్
ప్రభువు