వాక్యసందేశముPost Date:2014-09-05//No:71

దైవ భయముదేవుని విషయమై యదార్ధమైన భయము, యదార్ధము కాని భయము అని రెండు రకాలు ఉంటాయి. బైబిల్‌ గ్రంధము మనకిచ్చు ఒక అతి శ్రేష్టమైన వార్తయేమనగా 'భయపడకుము'. ఇది దాదాపు ఏబది పర్యాయములు వ్రాయబడి యున్నది. కొద్ది మార్పులతో యేసుప్రభువు చెప్పిన మాటలు గలవు. 'నేనే భయపడకుడి' యోహాను 6:20 అయితే యీ పాఠము మరొక భయమును గూర్చినదై యున్నది. ఇది దేవుని యెడల మనకుండవలసిన భయమును గూర్చినదై యున్నది. యోబు 28:28, మరియు యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడచుటయే వివేకమనియు, ఆయన నరులకు సెలవిచ్చెను. కీర్తనలు 19:9, 'యెహోవాయందైన భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును'. 2సమూ 23:3. మనుష్యులను ఏలువాడు. ఒకడు పుట్టును. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు గలిగి యేలును.' ఈ భయమే లేని యెడల పాపము, అవిశ్వాసము, అంతమున దుఃఖము కలుగును.

ఆది 20:11 అబ్రహాము పాపము చేయుటకు కారణమేమనగా 'ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు.' ఆ స్థలమందు దేవుని భయము బొత్తిగా లేదు గనుక తాను స్వతంత్రుడనని అతడు పొరపాటుగా తలంచినాడు.

రోమా 3:18 'వారి కన్నుల యెదుట దేవుని భయము బొత్తిగా లేదు'. ఒక దిగజారిపోయిన వ్యక్తియొక్క జీవితమును యిచ్చట చూడగలము.

1. దైవభయములేక దేవుని యందలి భయము అను మాటకు అర్ధము

సామె 14:26,27. దేవుని సన్నిధిలో నిలచి గడగడ వణకుటయని దీని యర్ధమా? డా||సి.ఐ.స్కోఫీల్డు దీని అర్ధమును యిలా వివరించుచున్నాడు. 'పాపమును అసహ్యించుకొనుచు దేవునిని గౌరవించుట' అనుచున్నాడు. దైవ భయము అనగా భక్తి అది దేవుని విషయములో మనకుండవలసిన మత బాధ్యతను చూపించును.

ద్వితీ 4:10 'నా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశము మీద బ్రతకు దినములన్నియు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము.' ఇది మనము నేర్చుకొని మన పిల్లలకు నేర్పవలసినదియు వంశపారంపర్యముగా వచ్చునది కాదనియు గ్రహించగలము.

ఆ విధముగా ఒక తరము తరువాత మరొక తరము దేవునికి భయపడుట నేర్చుకొనవలెనని దేవుని ఉద్దేశము ద్వితీ 6:13. నీదేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించవలెను. ప్రసంగి 12:13. 'ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్ధమిదే. దేవుని యందు భయభక్తులు కలిగి యుండి ఆయన కట్టడలననుసరించి నడచుకొనవలెను.

2. మనము భయపడనవసరము లేని విషయములు

అన్యదేవతల విషయము గాని విగ్రహముల విషయముగాని భయపడనక్కరలేదు. 2రాజులు 17:38. 'నేను నీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. మనము మానవులకు భయపడనక్కరలేదు. 1సమూ 15:24లో సౌలు మానవులకు భయపడి దేవునికి విరోధముగా పాపము జేసెను. సామెతలు 29:25. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును.' మనము దేవునికే భయపడవలెను.

మనము భూసంబంధమైన ఉపద్రవములకు భయపడనవసరము లేదు. ఎందుకనగా అవి మన ప్రభువు రాకడను సూచించును. లూకా 21:25-28. 'లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మీ తలలెత్తుకొనుడి. మీ విడుదల సమీపించుచున్నదనెను.' నిజమైన విశ్వాసి రాబోవుచున్న శిక్షల విషయమై భయపడడు. హెబ్రీ 10:27. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.' శ్రమకును, నేరమునకును మనము భయపడనవసరం లేదు. యోబు 15:24. శ్రమయు, వేదనయు అవిశ్వాసిని బెదరించును గాని విశ్వాసి తన సమస్యలన్నిటిని దేవునికి అప్పగించును. 1పేతురు 5:7 'ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఇక ఒకే భయము మిగిలియుండును. అది దైవ భయము, పరిశుద్దుడైన దేవుని విషయమైన భయము.

3. దైవభయము దేవుని ఆజ్ఞానుసారమై యున్నది.

ద్వితీ 13:4. 'మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలననుసరించి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను'.

1పేతురు 2:17. 'అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.'

కీర్తనలు 22:23 'యెహోవాయందు భయభక్తులు గల వారలారా ఆయనను స్తుతించుడి.... ఆయనను ఘనపరచుడి.' ఇహలోకములో శిష్యులు ఒక మంచి మాదిరి ఉంచి వెళ్ళిరి. అ||కార్య||9:31. 'మరియు ప్రభువు నందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడచుకొనుచు విస్తరించుచుండిరి.'

కొర్నేలి దేవుని యందు భయభక్తులు గలవాడు. అ||కా|| 10:2 'కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో నుండెను. అతడు తన ఇంటి వారందరిలో కూడ దేవుని యందు భయభక్తులు గలవాడై యుండి' అతనికి దేవుడు తన సువార్తను అందించుటలో విశేషమేమైన ఉన్నదా?

2కొరింథీ 7:1 ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు శరీరమునకును, ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసి కొందము' దైవ భయము మనము జాగ్రత్త కలిగి జీవించునట్లు చేయును. ఈ దైవ భయము మనలను మన జీవితములో సక్రమముగా నడిపించునట్టి శక్తియగును.

4. దైవ భయము అనుదాని యొక్క వివరణ

ఎ. చెడుగును అసహ్యించుకొనుట సామె 8:13, 'యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే.

బి. జ్ఞానమునకు మూలము కీర్తనలు 111:10, 'యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము.'

సి. అది ఐశ్వర్యము సామె 15:16. నెమ్మది లేకుండ విస్తారమైన ధనముండుట కంటే యెహోవాయందలి భయభక్తులతో కూడిన కొంచెమే కలిగి యుండుట మేలు. యెషయా 33:6. 'యెహోవా భయము వారికి ఐశ్వర్యము.'

డి. యెహోవా యందలి భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట సామె 12:27.

ఇ. పవిత్రమైనది, కీర్తన 19:9 'యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది శుద్ధిచేయునది.'

ఎఫ్‌. అది నిత్యము నిలుచును. కీర్త 19:9 'యెహోవాయందలి భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును.'

జి. అది దైవ సంబంధమైనది. హెబ్రీ 12:28. మనము దైవ కృప కలిగి యుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుని ప్రీతికరమైన సేవ చేయుదము. భక్తికిని, భయమునకును వ్యత్యాసమున్నది.

5. మనకు దేవుని యెడల భయము పుట్టించునవి ఏవి?

ఎ. దేవున
దైవ