వాక్యసందేశముPost Date:2014-08-30//No:70

గురువైన యేసు విద్యయేసు కపెర్నహోము పట్టణమునకు వచ్చి, విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై యుండెను. వారు ఆశ్చర్యపడిరి (లూకా 4:31-32).

యేసు గురువు - యేసు బోధ సంఘపు బోధ పరిచర్య. బోధ సమాజమును, కుటుంబమును ఒక్కొక్కరిని ఆకర్షించును. అనేక మందిని ఆకర్షించును. ఉప్పు, వెలుగు మొదలగు సామాన్య విషయములతో యేసు బోధించగా ఆశ్చర్యపడిరి. 'రబ్బూని' అని సంభోదించిరి. అది యూదుల చరిత్రలో బిరుదు. అది పండితులకు, ధర్మశాస్త్ర సంబంధిత బోధకులకు ఆశ్చర్యం కలిగించెను. కనుక రబ్బూని అనగా హిబ్రూలో గొప్పవాడని అర్ధం.

ఐదుగురు ఉత్తమ పండితులను గురించి నేర్చుకుందాము.

1. మోషే (అ.కా.7:22) మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును, కార్యములయందును ప్రవీణుడై యుండెను. మాటలయందు సకల విద్యలయందును ప్రవీణుడు, దేవుని దగ్గరకు వచ్చాక సాత్వికుడయ్యాడు. గొప్ప నాయకుడు ఆరున్నర లక్షల మంది ఇశ్రాయేలీయులను నడిపించాడు.

2. ఎజ్రా : (7:6,10) యెహోవా మోషే ద్వారా అనుగ్రహించిన ధర్మశాస్త్రము నందు ఎజ్రా ప్రవీణత గల శాస్త్రి ధర్మశాస్త్రమును పరిశోధించెను. కట్టడములను, విధులను నేర్పుటకు దృఢనిశ్చయము చేసికొనెను. శాస్త్రి అనేది యోగ్యతా పత్రం. యెహోవా హస్తము అతనికి తోడుగా నున్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను.

3. అపొల్లో : (అ.కా.18:24-28) విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు. ఉపదేశము పొంది, ఆత్మయందు తీవ్రత కలిగి, యేసును గురించిన సంగతులను వివరముగా గట్టిగా ఖండించుచూ వచ్చెను.

4. గమలీయేలు : (అ.కా.5:33-34-39) సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడు. ధర్మశాస్త్రోపదేశకుడు. పరిసయ్యుడు. శిష్యుల పరిచర్య దేవుని వలన కలిగిందేమో గమనించండని హెచ్చరించెను. యోగ్యత పత్రం గలవాడు.

5. పౌలు : (అ.కా.22:3) తార్సులో పుట్టిన యూదుడు. గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షితుడు. దేవుని గురించిన ఆసక్తి గలవాడు.

గమలీయేలు పాఠశాలలో యితర దేశముల నుండి శిష్యులు వచ్చేవారు. నేర్పిన గురువును మించిన శిష్యుడు పౌలు. కారణం పరిశుద్ధాత్మతో నింపబడెను. సిరియావాడు దేశ, విదేశాలలో బోధించు సామర్ధ్యం గలవాడు. ఎవరైన నీకింత జ్ఞానం ఎట్లా వచ్చిందనిన, తల్లిదండ్రులు నేర్పిరందురు. ఉన్నతమైన జ్ఞానం ఎట్లు అని అడిగిన, తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పాలి. తల్లిదండ్రుల యెడల కృతజ్ఞత కలిగి యుండాలి. గురువైన గమలీయేలు పాదాల దగ్గర నేర్చానంటున్నాడు పౌలు. క్రమం ఆచరించి ఈ ఐదుగురు జ్ఞానం పొందిరి.

ఆలోచన విత్తండి, ఒక పని కోయాలి. కార్యం విత్తండి. ఒక అలవాటు కోయండి. ఒక అలవాటు విత్తండి. ఒక గమ్యం సాధిస్తావు. ఒక డాక్టరు, ఒక ఇంజనీరు కావాలనిన కృషి కావాలి. వాడుక చొప్పున ప్రతి దినం వాక్యం పఠించి, నేర్పించాలి. అది ఆత్మీయతలో నడిపించుటే.

తల్లిదండ్రులు : పిల్లలకు విద్య ఎట్లా వస్తుంది. (ద్వితీ 6:6) కుమారులకు విద్య నభ్యసింపచేయాలి. నేర్పాలి. దేవుని విషయాలు బీజం వేయాలి. రాజైన లెమూయేలు తల్లి అతనికి ఉపదేశించింది. (సామె 31:1) అట్లు వాక్యంలో, ప్రార్ధనతో పిల్లలను నడిపించాలి. ఆదివారం బడి అదనపు చదువే. ఇంటి దగ్గర ప్రారంభమవ్వాలి నేర్పడం.

పదునెనిమిదవ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవమొచ్చింది. అందరు పరిశ్రమలలో ఉండగా, గుడులు ఒట్టి పోయాయి. అట్టి సమయంలో సూసన్న తన 19 మంది కుమారులకై రోజు ఒక గంట ఒక్కొక్కరి దగ్గర వాక్యం చెప్పి ప్రార్ధించింది. కుమారులు వాక్యం బోధించిరి. ఇంగ్లాండు మారింది. వారి వలన సువార్త ఉద్యమం వచ్చింది. ఇంగ్లాండులో బిడ్డల యెడల తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువే.

వెదురు (బొంగు) విత్తనం వేసిన 5 సం|| వరకు ఏమి మొక్క కనబడదు. 5 సం|| తరువాత మొక్క కనబడి, పెరిగి, 3 నెలలకే పెద్ద చెట్టయి 90, 60 అడుగులు నేలసారాన్ని బట్టి సం||కి 3 పంటలు వస్తాయి. అనగా సంవత్సరానికి 3సార్లు పంట కోయవచ్చును. ఇక పంట ఆగదు. అటులనే చిన్నతనంలోనే వాక్య విత్తనం పిల్లల్లో చల్లండి. వారికి నేర్పండి. (హోషేయా 4:8) నా ప్రజలకు జ్ఞానం నేర్పండి. నశించకుందురు (6:3). జ్ఞానం సంపాదించాలి. (ఫిలి 3:8) క్రీస్తుని గురించినదే అతి శ్రేష్టమైన జ్ఞానము. అందువలన సమస్తం నష్టంగా ఎంచుచున్నా నంటున్నాడు పౌలు (ఫిలి 3:10). - గేరా జీవరత్నం
గురువైన