వాక్యసందేశముPost Date:2014-08-15//No:69

లేఖనముల ఆధారంగా రాకడ లెక్కలు  క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు ఆరోహణమైన దగ్గరనుండి నేటి వరకు శతాబ్దాలుగా సంఘాన్ని కలవరపెడుతున్న ప్రశ్న ఇది. 'అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచూ ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను; పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున యున్నట్లే నిలిచియున్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెనని' పేతురు సందేశమిస్తున్నాడు 2 పేతురు 3:3-4.

ఈ లేఖనమును గమనించినచో ఇందులో రాకడను గూర్చిన వాగ్దానము అనే మాట పేతురు ప్రత్యేకముగా చెప్పడాన్ని గమనించగలము, అంటే రెండవసారి వస్తానని యేసు ప్రమాణ పూర్వకంగా మాట ఇచ్చాడని అర్ధం 'వాగ్దానము చేసినవాడు అబద్దమాడజాలనివాడు' తీతు 1:4. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై యున్నవని వ్రాయబడినది 1 కొరి 1:20 అందుకే ఎందరు ఎన్ని విధాలుగా అపహసించినా ఆయన రాక ఏమాయెనని ప్రశ్నించినా సంఘము అవిశ్వాసమునకు గురి కాకూడదు. ఎందుకంటే కొందరు ఆలస్యమని ఎంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును లేక తన రెండవ రాకడను గూర్చి ఆలస్యము చేయువాడుకాడు అంటుంది దైవ లేఖనం 2పేతు 3:9. అయితే ఇంతవరకు ఎందుకు రాలేదు ఎప్పుడు వస్తాడు అనే సందేహము తప్పక వస్తుంది ఇటువంటి సందేహాలకు లేఖనము ఇచ్చే సమాధానం లేఖనముల నుండి తెలుసుకుందాం.

'ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినమువలెను వున్నవి' అన్నాడు అపోస్తలుడైన పేతురు - 2 పేతురు 3:8. ప్రభువు తప్పకవస్తాడు అని చెబుతూ ఆలస్యం ఉండదని చెబుతూ ఒక సంగతి అంటాడు లేక రాకడకు ఒక లెక్క ఉన్నది అంటాడు అదే రాకడ లెక్క! ఒక్క దినము వెయ్యి సంవత్సరములు అనేది రాకడ లెక్క అంటాడు పేతురు. ఈ సందర్భంలో బైబిలులో బయలు పర్చబడిన రాకడ లెక్కలను గమనిద్దాం ఆ లెక్కలు వస్తే జవాబు దొరుకుతుంది.

1. ఒక దినము వెయ్యి సంవత్సరములు : దేవుడు ఆరు దినాలలో సృష్టిని చేసి ఏడవ దినమున విశ్రమించాడు. ఏడు అనునది సంపూర్ణతకు చిహ్నముగా ఉన్నది. సిలువలో ప్రభువు ఏడు మాటలను పలికాడు, ఏడవదిగా సమాప్తమైనది అని పలికాడు.

ఏడు అనునది సంపూర్ణతకు గురుతని అర్ధము. క్రీస్తు రెండవ రాకడతో సమస్త ప్రవచనములు సంపూర్ణంగా నెరవేర్చబడును గనుక ఈ ఏడవ దినము అనునది రెండవరాకడ దినమునకు కూడా గురుతైయున్నది. ఏడవ దినము రాకడ దినమునకు గురుతని హెబ్రీ 4వ అధ్యాయము ద్వారా తెలియుచున్నది. ఆరు దినములు గడిచాక ఏడవ దినము వస్తుంది. రాకడ లెక్కలలో ఒక దినము వెయ్యి సంవత్సరములు గనుక ఆరు దినములు అంటే ఆరువేల సంవత్సరములు గడిచాక ఏడవ దినమున అంటే ఏడవ వెయ్యి  వచ్చినప్పుడు రెండవరాకడ వస్తుంది. ఒక విధంగా ఆరువేల సంవత్సరాలు గడిచాక రెండవరాకడ వస్తుందని అర్ధము. ఈ లెక్క ఎప్పటినుండి ప్రారంభించాలి? మన సృష్టి ఆరంభమునుండి ఆ లెక్క ఒక్కసారి చూద్దాం.

ఆదాము దగ్గరనుండి నోవహు కాలంలో జలప్రళయం వరకు సుమారుగా రెండువేల సంవత్సరాలు. జలప్రళయం నుండి క్రీస్తు పుట్టుక వరకు రెండు వేల సంవత్సరాలు గడచిందని, క్రీస్తు పుట్టుక నుండి ఇప్పటికి రెండువేల సంవత్సరములు గతించినట్లు బైబిలు వలన చరిత్ర వలన తెలియుచున్నది. విజ్ఞాన శాస్త్రము కూడా దీనిని ధృవీకరించుచున్నది. ఎట్లనగా 'దినాలెడ్జిబ్యాంక్‌' అనే గ్రంధంలో ప్రపంచంలోని మేధావులందరు కలసి కంప్యూటరైజ్డ్‌ విధానంలో రేడియో యాక్టివిటీ పరిశోధనలో మానవుని ఆస్థికలపై పరిశోధనలు జరుపగా ఆరువేల సంవత్సరాలనుండి (వ్యవసాయమునెరిగిన) మానవ జాతి భూమిపై ఉన్నట్టు తేలినది. అంతకుముందు సృష్టి సమస్త జంతుజాలాలు ఉన్నట్లు మానవుని చరిత్రమాత్రం ఆరువేల సంవత్సరాలనుండి ఉన్నట్లు ఆధారాలు లభ్యమౌతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. మానవుని చరిత్ర ఆరంభమై ఆరువేల సంవత్సరాలైనట్లు బైబిలు ద్వారా తెలిస్తే అదే నిజమని చరిత్ర పరిశోధనలో వెల్లడియైనది.

ఇంతకూ నేను చెప్పదలచిన విషయమేమంటే ఆరువేల సంవత్సరాలు గడిచాక రాకడ వస్తుందని ! మరి ఇప్పుడు ఆరువేల సంవత్సరాలు గడిచినట్లు తెలుస్తోంది గదా, రాకడ వచ్చేస్తుందంటారా? అంటారా కాదు తప్పకుండా వచ్చేస్తుంది. అనుమానంలేదు లెక్క కరెక్టుగా చేస్తే ఆన్సర్‌ వచ్చినట్లే ! ఆరువేల లెక్క పూర్తయింది గనుక రాకడ వస్తుంది, ఇక ఆలస్యం లేదు రాకడ వచ్చేస్తోంది అనడానికి కారణం వుంది. ఆదామునుండి రెండు వేల సంవత్సరాలు గడువగానే జలప్రళయం వచ్చింది. దేవుని నమ్మి ఓడలో చేరినవాడు రక్షింపబడ్డారు. నమ్మక ఓడలో చేరక బయట ఉన్న అప్పటిలోకం నీటివరదలో మునిగి నశించింది 2 పేతు 3:6. ఆ తరువాత మరి రెండువేల సంవత్సరాలు గడువగానే ఆ దైవమే యేసుక్రీస్తుగా నశించు మానవులను రక్షించడానికి, రానున్న అగ్ని ప్రళయం నుండి కాపాడటానికి పరలోకం చేర్చడానికి నావగా క్రీస్తు అను పేర అవతరించాడు. త్వరగా క్రీస్తు నందున్నవారై రానున్న నాశనమునుండి తప్పించుకోండి రోమా 8:1.

ఇకపోతే క్రీస్తు దగ్గరనుండి ఇప్పటికి రెండువేల సంవత్సరాలు జరిగాయి. ప్రతీ రెండువేల సంవత్సరాలకు ఏదో ఒకటి జరుగుతున్నట్లు పైన చదివారు కదా! అలాగే క్రీస్తు వచ్చి రెండువేల సం||లు గతించిన ఈ దినాలలో తప్పక ఏదో జరుగబోతుంది. ఏమిటది జలప్రళయమా? కాదు అది గతించిపోయింది. దేవుడీ లోకంలో అవతరించడమా? అదేమీ కాదు మరేమిటి? ఏం జరగబోతుంది. అంటే అదే క్రీస్తు రెండవ రాకడ - దేవుని ఎరుగని వారికి సువార్తకు లోబడని వారికి తీర్పు తీర్చడానికి పరలోకము నుండి ప్రభువు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కాబోవుచున్నాడు 2 దెస్స 1:6. ఇకలోకం ఎంతోకాలం వుండదని పంచ భూతాలతో నిండిన ఈ భూమండలం భస్మీపటలం కావడం తధ్యమని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ గంట-ఆ నిమిషం - ఆ తేదీ - ఆ నెల చెప్పలేము గాన
లేఖనముల