వాక్యసందేశముPost Date:2014-08-01//No:67

ఉదయకాల ప్రార్థనా మహత్యంఉదయకాల ప్రార్థన ఎంతో ప్రశస్తమైనది. ఉదయకాల ప్రార్థనా మాధుర్యము అనుభవించిన వారికే అర్థమవుతుంది. ప్రశస్తమైన ఆ సమయములో లేచి దేవుని స్తుతించడము దేవుని స్వరము వినడము ఆయన సన్నిధి అనుభవించడము ఎంతో శక్తినిస్తుంది. ఉదయమే లేచేవారు జ్ఞానము, ఆరోగ్యము, సంపద పొందుతారు కనుక ప్రతి విశ్వాసి నిద్రమత్తు విడిచి వేకువనే లేచి ప్రార్థించాలి. ఉదయముననే ఆయన సన్నిధిని వెదకాలి. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్ధంతయు పరిశుద్ధమయిపోతుంది. ప్రార్థనలో నీ దినమును ప్రారంభిస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.

'ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే' -రోమా 11:16

ఉదయకాల ప్రార్థన నీలో ఉన్న మాలిన్యాన్ని తొలగిస్తుంది. దేవుని సన్నిధితో నింపబడతావు. దినము అంతా నెమ్మది, సుఖం, సంతోషము కలుగుతుంది. ఉదయమే ప్రకృతి, పకక్షులు దేవుని స్తుతిస్తాయి. దావీదు విజయానికి రహస్యం ఉదయమే దేవుని వెదకడం, స్తుతించడం, ప్రార్థించడం.

'సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును' -కీర్తన 55:17

'కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.' -మత్తయి 6:33

యేసుప్రభువు స్పష్టంగా పలికిన మాట ఇది. నీవు రేపటిని గూర్చి బాధపడవద్దు. దేవుని రాజ్యము భోజనము కాదు పానము కాదు కాని అది పరిశుద్ధాత్మయందలి ఆనందమైయున్నది. ఉదయమే లేచి దేవుని కీర్తిస్తూ, స్తుతిస్తూ నీ అవసరతలను తెలుపుకుంటున్నావు. కావున దినమంతా దేవుని కార్యాలను నీవు చూస్తావు. దినమంతా ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి దైవశక్తిని పొందుతావు. నిద్రవలన లేమి వచ్చును. నిద్రమత్తు చింపిరిగుడ్డలు ధరింపజేస్తుంది. నీకేమి కావాలో, నీ పిల్లలకు ఏమి కావాలో దేవునికి తెలుసు. ఉదయకాలం ఎన్నో పనులు చేస్తాము. నశించే శరీరం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాము కాని నశించని ఆత్మ కొరకు ఇంకా ఎంతో ప్రయత్నించాలి. భక్తులు, దేవుని బిడ్డలు ఉదయమే లేచి ప్రార్థించి దేవుని శక్తి పొంది సేవ చేస్తారు. కుటుంబముగా కలిసి ఉదయమే ప్రార్థిస్తే పిల్లలను దేవుడు దీవిస్తాడు. ప్రార్థన కొరకు యు.పి.ఎఫ్‌. ఆలయం ఖచ్చితంగా ఉదయం 4 గం||లకే తెరచి ఉంచబడుతుంది. దేవుడు అనేకులను ఆశీర్వదించుచున్నాడు.

'యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును' -కీర్తన 5:3

ఉదయం లేవగానే నీ స్వరం దేవునికి వినిపించు. ఉదయమే ఎవరితో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడు. దినమంతా దేవుడు నిన్ను దీవిస్తాడు.

  'దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను' -కీర్తన 63:1,2

దేవుని బలమును, ప్రభావమును చూడవలెనని భక్తుడెంతో ఆశిస్తున్నాడు. 'నీ యందు నేను నమ్మిక యుంచియున్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము' -కీర్తన 143:8

ఈ లోకవార్తలు వినకముందు దేవుని కృపావార్తను వినిపింపుమని ప్రార్థన చేయాలి. ఉదయమే పరిశుద్ధ గ్రంథం తెరిస్తే కృపావార్తను వింటావు. దినపత్రికలు చదివితే అన్నీ దుర్వార్తలే వింటావు. అందుకని మొట్టమొదట దేవుని శుభవార్తతో నీ హృదయం నింపుకోవాలి.

'నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును' - కీర్తన 63:3

'అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును' - కీర్తన 42:8

నా జీవితంలో సేవ నడిపించడానికి కేవలం ఉదయకాల ప్రార్థన ద్వారానే దేవుడు శక్తినిచ్చాడు. నేను నా మొదటి కుమార్తెను ఆకస్మికమైన మరణం ద్వారా పోగొట్టుకున్నాను. ఆ సమయంలో ఒక సహోదరి రెండు నెలలు వాక్యం చెప్పి నన్ను బలపరచినది. నేను 7 సంవత్సరములు ఉదయకాలమే లేచి దేవుని సన్నిధిలో ఏడ్చినాను. దేవుడు ఉదయకాలమే దర్శనము ఇచ్చి మాట్లాడినాడు. ఆ దర్శనమే యు.పి.ఎఫ్‌. పరిచర్య. నేనెంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటి బొట్టునకు విలువ ఉంది. నీ కంటి నుండి కారే ప్రతి చుక్క దేవుని బుడ్డిలో దాచి ఉంచబడియుండును.

'నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా' -కీర్తన 56:8

'ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.' -కీర్తన 6:6

ఈ లోకరీతిగా సినిమా టిక్కెట్టు కొరకు ఎంతో ప్రయాసపడతారు. దాని ఫలితం ఆయాసమే కాని లాభం లేదు. 3 గం||లు సంతోషము దొరుకుతుందని భ్రమ కాని మరలా మిగతా సమయమంతా బాధపడతారు. అదే నీవు 3గం||లు దేవుని సన్నిధిలో గడిపితే కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. సంఘమంతా ఉదయాన్నే ఆరాధించాలనే నా దర్శనం దేవుడు నెరవేర్చినాడు. 100 రోజుల ప్రార్థనలు ఉదయమే ఎంతో జయకరంగా దేవుడు నడిపించినాడు. ఎంతో మంది ఆలయానికి వచ్చి 100 రోజుల ప్రార్థనల ద్వారా దీవింపబడినారు. సమస్త మహిమ దేవునికి కలుగును గాక!

ఉదయకాల ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు:

'దేవునికి నీకు సన్నిహితమైన సంబంధమును, దేవుని ప్రేమను పొందుతావు'

ఉదయమే అనగా ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి యేసుని వెదకెను (యోహాను 20:1-4). దేవుడు ఈమెను ఎంతో గొప్పగా ఆశీర్వదించినాడు. ఈమె ప్రయత్నం విఫలం కాలేదు. అడిగిన దానికంటె అధికంగా పొందినది. సమాధిని చూడడానికి వచ్చింది కాని దేవుడు అమ్మా నీవెందుకు ఏడ్చుచున్నావని ఆదరణ మాటలను విన్నది. దేవుని స్వరం వినిపించుమని ప్రార్థన చేయాలి.

  'యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది' -కీర్తన 29:4

ఉదయమే దేవుని ఆశ్రయించాలి. దేవుడు నీకు ఆశ్రయమైతే నీ జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరింపబ
ఉదయకాల