వాక్యసందేశముPost Date:2014-07-25//No:66

''పడగొట్టడమా? నిలబెట్టడమా?''క్రైస్తవ లోకాన్ని అయోమయంలో పడవేస్తున్న సమస్య :

  కొద్ది కాలంగా క్రైస్తవ ప్రపంచాన్ని చీకటి కమ్ముకొని కలవర పరుస్తున్న పెద్ద సమస్య ఏంటంటే బోధకుడు ముట్టుకోగానే పడిపోవడం.

  ఒకడు చేతులుంచి పడేస్తుంటే, మరొకడు ఊది పారేస్తున్నాడు. ఇంకొకడు వీరిని మించి రెండడుగుల దూరంలో నిలిచి చూపుడు వేలుతో ఘాట్‌ చేయడం ఆవలి వ్యక్తి పడిపోవడం వింతగా మారింది. అది కాస్తా ముదిరి పాకానపడ్డది. వాక్యం సరిగా ఎరుగనివారు దేవుని శక్తి అని, పరిశుద్ధాత్మ ప్రభావమని భ్రమ పడుతున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి క్రైస్తవుడు ప్రతి సంఘం సీరియస్‌గా పరిశీలించాల్సిన అంశం. పరిశుద్ధ లేఖనాలు ఇలాంటి వారిని ఎంతవరకు సమర్ధిస్తాయి. అనేది అత్యంత కీలకమైన విషయం. వాస్తవానికి బైబిల్లో ఇటువంటి సంఘటనలు కన్పించవు. లేఖనాలను పక్కకుపెట్టి వారి వారి భాష్యాలను బల్లగుద్ది చెబుతూ ఇదే లేఖన సత్యం అని ప్రజల్ని అయోమయంలో పడేస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో ఉన్నంత గందరగోళం అస్పష్టత అంతకుముందెన్నడూ లేదు. క్రైస్తవ సంఘాల్ని సవాలు చేస్తున్న వాటిలో ఇది ప్రధానమైనది.

 1. ఈ పడగొట్టే విధానానికి ఆధ్యుడెవరు?

అంతర్జాతీయ బోధకుడైన బెన్‌హిన్‌ ఈ విధానానికి ప్రాచుర్యాన్ని తీసికొచ్చాడు. ఇది ఆయన సభల ట్రేడ్‌ మార్క్‌. కరిస్మాటిక్‌ సంఘాలు రెడీగా దీనిని అక్కున చేర్చుకున్నాయి. ఇది జుగుప్సాకరమైన విధానం. బెన్‌హిన్‌కి 'ఈ అభిషేకం' ఎక్కడనుండి వచ్చింది. తెలుసుకోవడం చాలా ఆసక్తి దాయకం అవసరం. 1991 ఏప్రిల్‌ 7న ఆయన చేసిన ప్రసంగంలో యిలా చెప్పాడు. తాను అప్పుడప్పుడు 'కుల్మన్‌'గారి సమాధిని దర్శిస్తూ ఉంటాడట. దాని తాళపు చెవిగల బహుకొద్ది మందిలో తానొకడనని బెన్‌హిన్‌ బయట పెట్టాడు. 'అయిమి'గారి సమాధిని కూడ తాను దర్శిస్తానని ఆయన చెప్పాడు. (అయిమి, మెల్‌ఫర్‌ సన్‌, ఫోర్‌స్కేర్‌ గాస్పెల్‌ చర్చి స్థాపకుడు) ఆ సందర్భాల్ని పురస్కరించుకొని ఆయన యిలా అన్నాడు. 'గొప్ప అభిషేకాన్ని నేను పొందాను.... ఒళ్ళంతా వణికి పోయింది.... దేవుని శక్తి కింద నేను గడగడలాడిపోయాను. ప్రియమైన దేవా.... నేను అభిషేకాన్ని అనుభవిస్తున్నాను అన్నాడు. అయిమిగారి దేహం పైన దైవాభిషేకం కదలుతుందని నేను విశ్వసిస్తున్నాను. బెన్‌హిన్‌ అద్భుతాల కూడికలలో అభిషేకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దానిని ఉపయోగించి 30 ఏళ్ళక్రితం 'కుల్మన్‌'గారు  చేసినట్లు ఆయన కూడా ఆత్మలో వధించడం (ఐఉజు|శ్రీ |శ్రీ ఊకజూ ఐఆ|ష్ట్ర|ఊ) చేస్తుంటాడు. అప్పటినుండి కొందరు సువార్తికులు స్వస్థపరచువారు ఆయన్ని అనుకరిస్తూ వచ్చారు. బెన్‌హిన్‌ది మాత్రం ఒక క్రొత్త విధానం కుల్మన్‌గారి లాగానే ఈయన కూడా నొసటగాని మెడమీదగాని ముట్టి ప్రజలు పడిపోయేలా చేస్తాడు. కొన్నిసార్లు దూరం నుండి 'ఊది' లేక 'అభిషేకాన్ని' విసిరికూడా ప్రజల్ని 'వధిస్తూ' ఉంటాడు. పడిపోయేవాడ్ని పట్టుకోడానికి మరొక వ్యక్తి వెళుతుంటే అతణ్ణి కూడా 'వధిస్తూ' ఉంటాడు. ఇంకో వ్యక్తి పడిపోతుంటే అతణ్ణి కూడా 'వధిస్తూ' ఉంటాడు. ఇంకో వ్యక్తి పడిపోతుంటే అతణ్ణి కూడా వధిస్తాడు. మైక్‌లో గట్టిగా ఊదుతాడు. వందల కొలది జనం నేలకు వెల్లకిల పడతారు. మధ్యలో ఒక స్త్రీ క్రిందపడి ఏదో ఉచ్చరిస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా బెన్‌హిన్‌ నిష్క్రమిస్తాడు. గదిలో నుండి శక్తిమాయమై పోతాది. ఆశ్చర్యపడిన ప్రజలు నిశబ్దంగా తేరి చూస్తుంటారు. (ఈజుఙజూ కఏశ్రీఊ '్పు|ఔ ఔఏఉఉజూఊ|శ్రీ' అజుశ్రీఏజుష్ట్రఖ 1992, ఙంఉ8. శ్రీళి 1) ఇలాంటి అద్భుతాలు చేసిన ఎక్కువ మంది అమితమైన అవినీతిలో పట్టుబడ్డారని చరిత్ర చెబుతుంది. ఎంత విచారం?

దీన్ని కాపీ కొట్టిన మన వాళ్ళు పడిపోయే వారిని లేపడానికి సంఘ సభ్యుల్లో లేక నియమించబడిన వాలంటీర్లో గోతికాడ నక్కల్లాగ కనిపెట్టుకొని ఉంటారు. పడిపోయిన ఆడవాళ్లను మగవాళ్ళు లేపుతారండి. మగవాళ్ళను ఆడవాళ్ళు లేపరనుకోండి ఆ సీను చాలా అసహ్యంగా ఉంటుంది. నాకు తెలియకడుగుతున్నాను పడేవాళ్ళను పట్టుకోవడం దేనికి? దెబ్బలు తగలకుండా ఉండడానికా? వాళ్ళు పడితే దెబ్బలు తగులుతాయని దేవునికి తెలీదా? యింకో ప్రశ్న వాలంటీర్లు ఎందుకు క్రిందపడరు? ఆ ఆత్మశక్తి వాళ్ళను తాకదా? ఒకవేళ నిజంగా పరిశుద్ధాత్ముడే వారిని సంధిస్తే వీళ్ళెవరు ఆపడానికి?

2, వీరిని వెంబడించేవారు ఎవరు?

మోసపోయిన ప్రజలు ఇలాంటి ఆకర్షణ సభలకు కుప్పతెప్పలుగా హాజరౌతున్నారు. టి.వి.లలో అయితే యిక చెప్పనవసరం లేదు. కొన్ని స్థలాలలో ఆఖరికి ఆదివారం కూడా ఇదొక ప్రత్యేక ఆకర్షణగా మారిపోయింది. మీరేమి అనుకోకపోతే ఇంకోమాట చెప్పనా? అసలు పడడం కోసమే కొందరు వేదిక ఎక్కుతుంటారు. గనుక సహజంగానే ఇష్టపూర్తిగా పడిపోతుంటారు. ఇటువంటి వారిని పడేయడం చాలా తేలిక. ముట్టుకోగానే పడటానికి రెడీగా ఉంటారు. కొంతమంది మీరు జాగ్రత్తగా గమనిస్తే వారిని యిట్టే పసిగట్టేయొచ్చు. అన్ని వందల మంది చూస్తుంటే పడకపోతే ఏం బావుంటుందని పడిపోయేవారున్నారు. పడకపోతే తమ సేవకుడు డిస్సప్పాయింట్‌ అవుతాడని పడుతున్నవారూ ఉన్నారు. ఇందులో కొంతమంది కిరాయికి (కూలికి) కూడ నిలబడతారని పరిశోధనలో తేలింది. మరో ప్రమాదం కూడా ఉందండోయ్‌. ఎంతనెట్టినా మీరు నిగ్రహించుకుని నిలబడ్డారనుకోండి.... అప్పుడు మీలో ఏదో పాపమో దురాత్మో ఉన్నట్టు లెక్క. మీరు అలాంటివారు కాదని నిరూపించుకోవడం కోసమైనా పడక తప్పదు. ఔరా! ఏమి ఈ విచిత్రం! మా చిన్నపుడు బజారులో మోళీ చేసేవాడు ఢమరుకం వాయిస్తూ, ఇంద్రజాలం మహేంద్రజాలం, టక్కు, టమారం గజకర్ణ, గోకర్ణ, వాయుస్థంభన జలస్థంభన, అగ్ని స్థంభన కనికట్టుకాదు నీ మీద ఒట్టు అనేవాడు. అలాగుంది ఎంత సిగ్గుచేటు? పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కడా, ఒక్క ప్రామాణిక ఆధారం కూడా లేని ఈ తంతుని దైవ సేవకులనబడిన వారు ఎలా అనుసరిస్తున్నారు. క్రైస్తవులు కౌంటర్‌ వేయకుండా, చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు. ఇది పరిశుద్ధా