వాక్యసందేశముPost Date:2014-07-18//No:65

మీకు తెలుసా ఈ క్రైస్తవులను గూర్చి..?1. 20% క్రైస్తవులు ప్రార్ధన చేయరట.

2. 25% క్రైస్తవులు బైబిలు ధ్యానించరట.

3. 30% క్రైస్తవులు చర్చికి వెళ్ళరట.

4. 40% క్రైస్తవులు కానుకలు, అర్పణలు ఇవ్వరట.

5. 50% క్రైస్తవుల పిల్లలు సండేస్కూల్‌కు వెళ్ళరట.

6. 60% క్రైస్తవులు సండే సాయంత్రం కూడికకు వెళ్ళరట.

7. 70% క్రైస్తవులు మిషనరీలను బలపరచరట.

8. 75% క్రైస్తవులు సంఘ పరిచర్యలో పాలుపంచుకోరట.

9. 80% క్రైస్తవులు వారం మధ్యలో జరిగే ప్రార్ధనలో పాల్గొనరట.

10. 90% క్రైస్తవుల ఇళ్ళల్లో కుటుంబ ప్రార్ధనలు జరుగవట.

11. 95% క్రైస్తవులు ఒక్క ఆత్మను కూడా రక్షణలోనికి నడిపించలేదట.

పైన చెప్పబడిన విషయాలలో మనల్ని మనం పరీక్షించుకుంటే ఎన్ని విషయాల్లో లేదా ఏ విషయములో మనం తప్పిపోయామో గ్రహించి, మనల్ని మనం సరిచేసుకొంటే అది మనకెంతో దీవెనకరంగా మారుతుంది. ప్రార్ధించకపోవడం, మందిరానికి వెళ్ళకపోవడం, కృతజ్ఞతార్పణలు ఇవ్వకపోవడం, కుటుంబ ప్రార్ధన కలిగి వుండకపోవడం, వాక్యాన్ని ధ్యానించకపోవడం ఇవన్నీ సహజంగా నామకార్ధ క్రైస్తవుల్లో కనిపించే లక్షణాలు. ఒకవేళ మీలోను ఆ లక్షణాలు వున్నట్లైతే మిమ్మును మీరు పరీక్షించుకొని మీ హృదయాన్ని సరిచేసుకొంటే మంచిది. పై చెప్పబడిన విషయాలు మన జీవితానికి ఎలా దీవెనకరంగా వుంటాయో తెలుసుకుందాం!

1. 20% క్రైస్తవులు ప్రార్ధన చేయరట : ఇది క్రైస్తవులుగా పిలువబడే అనేకమందిలో కనిపించే గొప్ప లోపం. సాధారణంగా ఒక క్రైస్తవుడు ప్రార్ధించకపోవడానికి కారణం తనలోవున్న పాపమే. పాపం చేసేవాడు ప్రార్ధించలేడు, ప్రార్ధించేవాడు పాపం చేయలేడు. బ్రతుకు బాగోకపోయినా మనుష్యులకు కనబడవలెనని పరిసయ్యులవలె దీర్ఘ ప్రార్ధనలు చేసే వేషధారులు వుంటారు (మత్తయి 6:5) అట్టివారు ఆత్మీయ ముసుగువేసుకొని ఇతరులను మోసం చేస్తూ తమ్మునుతాము మోసం చేసుకొంటారు. ఓ సామెత వుంది: 'ఎక్కువ సమయం నువ్వు ఎవరితో గడుపుతున్నావో చెప్పు, నీ బుద్ధి ఏమిటో చెబుతా' మనం పరిశుద్ధుడైన యేసయ్యతో ఎక్కువ సమయం గడిపితే మనం పరిశుద్ధంగా జీవిస్తాము. గనుక పరిశుద్ధ జీవితానికి ప్రార్ధనే సరైన మార్గం కాబట్టి నేటినుండైనా ఓ నిర్ధిష్టమైన సమయాన్ని ప్రార్ధన కొరకు కేటాయిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం!

2. 25% క్రైస్తవులు బైబిల్‌ ధ్యానించరట : ఎగిరే పక్షికి రెండు రెక్కలు ఎంత అవసరమో పరిశుద్ధంగా దినదినము దేవునికి దగ్గరగా చేరాలనుకొనే వారికి ప్రార్ధన, వాక్య ధ్యానము అంతే అవసరము. పక్షికి రెండు రెక్కలు సమానంగా ఎలా వుంటాయో... అలానే దేవుని మాటలు వినడం (ధ్యానించడం), దేవునితో మనం మాట్లాడడం (ప్రార్ధించడం) రెండూ సమపాళ్ళలో వుండాలి. కొంతమంది ఎప్పుడూ బైబిల్‌ చదువుతూ వుంటారు కానీ సరిగా ప్రార్ధించరు, మరికొందరు ఎప్పుడూ ప్రార్థిస్తూ వుంటారు కానీ బైబిల్‌ చదవరు, లేదా వాక్యాన్ని లక్ష్యపెట్టరు వినరు. ఈ విధానం ఆరోగ్యకరమైన ఆత్మీయతకు మంచిది కాదు. (చదువురాని వారు వాక్యాన్ని తమంతట తాము చదవలేకపోయినా... రేడియో వర్తమానాల ద్వారా, టి.వి.సందేశాల ద్వారా, సేవకులు, బోధకుల ద్వారా వాక్యాన్ని విని బలపడవచ్చు) ఆత్మీయంగా బలంగా స్థిరంగా ముందుకు సాగాలంటే తప్పక ప్రార్ధించడం, వాక్యాన్ని ధ్యానించడం సమపాళ్ళలో వుండాలి. కనీసం నేటినుండైనా ప్రార్ధించుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు తగు సమయాన్ని కేటాయిద్దాం! '...దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం' (కీర్తన 1:3) రాత్రింబవళ్ళు మొఱ్ఱపెట్టడం (కీర్తన 22:2) సమపాళ్ళలో వుండడం మంచిది.

3. 30% క్రైస్తవులు చర్చికి వెళ్ళరట : క్రమంగా ఉద్యోగానికి వెళ్ళని ఉద్యోగి ఎలా మంచి ఉద్యోగి కాడో, క్రమంగా స్కూలుకు వెళ్ళని విద్యార్ధి ఎలా మంచి విద్యార్ధి కాడో క్రమంగా మందిరానికి వెళ్ళని క్రైస్తవుడు కూడా మంచి క్రైస్తవుడు కాదు. దావీదు అన్నాడు: 'నేను ఒక్క వరము అడిగితిని నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను' (కీర్తన 27:4) దేవున్ని ప్రేమించే నిజమైన క్రైస్తవుడు దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు అని అనుటకు దావీదే మంచి ఉదాహరణ. దేవుడు కనికరించి వారానికి 168 గంటలు మనకు అనుగ్రహిస్తే కనీసం రెండు గంటలు లేదా మూడు గంటలు దేవున్ని ఆరాధించుటకు కేటాయించలేని క్రైస్తవులు క్రైస్తవులేనా? దేవున్ని, దేవుని సన్నిధిని రుచి చూచినవాడు దేవుని సన్నిధికి రాకుండా వుండలేడు గదా! మరి మీ సంగతేమిటి? ప్రతీవారం క్రమం తప్పకుండా మందిరమునకు వెళ్ళి దేవున్ని ఆరాధిస్తున్నారా? లేదా చిన్నచిన్న సాకులు చెప్పి ఆత్మీయతను సమాధి చేసుకొనుచున్నారా? 'కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక.. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుడి'. (హెబ్రీ 10:24)

4. 40% క్రైస్తవులు కానుకలు, అర్పణలు ఇవ్వరట : కృతజ్ఞతలేని క్రైస్తవునికన్నా గొప్ప దొంగ మరొకరు ఉండరేమో! అందుకే గదా థమ భాగము ఇవ్వని వారిని దేవుడు దొంగలతో పోల్చాడు. (మలాకీ 3:8) 'నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము' (కీర్తన 103:2) కృతజ్ఞత అర్పణ ఇవ్వనివాడు మేలును మరచువాడు. మరి మీ సంగతేమిటి?

5. 50% క్రైస్తవుల పిల్లలు సండేస్కూల్‌కు వెళ్ళరట : 'చిన్న పిల్లలను నాయొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు' (మార్కు 10:13) అని యేసయ్య బోధించాడు. కనుక నీ బిడ్డలను దేవుని సన్నిధికి తప్పక తీసుకొని వెళ్ళాలి. 'మొక్కై వంగనిది మ్రానై వంగునా' నీ బిడ్డలు చిన్న మొక్కలుగా వున్నప్పుడే వారిని దేవుని సన్నిధికి నడిపించడం అలవాటు చేస్తే వారు పెద్దవారైనప్పుడు దేవుని సన్నిధికి దూరం కారు. ఇలా చేయనివారు అనేకులు ఈరోజు ఏడుస్తున్నారు, ఏమని? అయ్యా! మా అబ్బాయి గురించి ప్రార్ధించండి వాడు అస్సలు మందిరమునకు రాడు, మమ్మును పట్టించుకోడు అని. 'బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. (సామె 22:6)

6. 60% క్
మీకు