వాక్యసందేశముPost Date:2014-07-04//No:64

ఉజ్జీవానికి అవరోధాలు  ఈ మధ్య కాపరుల సహవాసంలోను, సంఘాల్లోను ఎక్కువగా వినిపిస్తున్న మాట 'ఉజ్జీవం' ప్రభువా, ఉజ్జీవంతో మమ్ములను నింపు, రగిలించు అని కన్నీళ్ళతో ప్రార్ధన చేస్తున్నారు. ఉజ్జీవం కలిగితే బ్రతుకులో సంపూర్ణమైన మార్పు, ఆత్మల రక్షణార్ధమైన దర్శనం కలుగుతుంది. 'నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు' (ఎఫెసీ 5:14).

'నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులును మీ కమార్తెలును ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యౌవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును' (యోవేలు 2:28,29).

ఉజ్జీవం కొరకు పరితపిస్తు హృదయాలను కుమ్మరించి కన్నీళ్ళతో ప్రార్ధించే ప్రార్థనా పరులను ప్రభువు తిలకిస్తున్నాడు. ఉజ్జీవం కలిగితే మన దేశంలో కోట్లాది ప్రజలను ప్రభువు సన్నిధికి నడిపించే భాగ్యం మనకు కలుగుతుంది. సువార్త వ్యతిరేకత సమసిపోయి, ఇంకా ముమ్మరంగ దేశమంత ఆత్మలను సంపాదించే అనుకూలత కలుగుతుంది. వేల్సు నగరంలో కలిగిన ఉజ్జీవం, ఇంగ్లాండులో కలిగిన ఉజ్జీవాన్ని ఇంకా కొన్ని రెట్ల వంతులో కలిగించమని ప్రార్ధించుదాం.

ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ప్రభువు కొరకు అనేకులను సంపాదించాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకొరకు వారికి దర్శనం, ఆత్మల రక్షణార్ధమైన భారం కలిగి తీరాలి. అందుకోసం వారు ఎన్నో త్యాగాలు చేయవలసి ఉంటుంది. ధనం, సమయం, బలం ఆరోగ్యం అన్నిటిని ప్రభువు సేవకే ఖర్చు చేయాల్సి ఉన్నది.

ఇంత చేస్తున్నప్పటికిని ఇంకా తగినంత ఉజ్జీవంతో ఉరకలేయడం లేదు. ఎందువల్ల? ఉజ్జీవంతో నింపబడి లక్షలాది మందిని ప్రభువు కొరకు సంపాదించిన మహావ్యక్తి ఆస్వాల్డ్‌ జె.స్మిత్‌ సూచనలను మీ ముందుంచు చున్నాము. శ్రద్ధతో చదివి గ్రహించి సరిచేసుకొని ఉజ్జీవం కొరకు హృదయాన్ని కుమ్మరించి ప్రార్ధించాలని ఆశిస్తున్నాము. ఉజ్జీవం కలుగకుండ నిరోధించేది 'పాపం'. ప్రభువును విశ్వసించి రక్షింపబడిన విశ్వాసిలో 'పాపం' ఉంటుందా? పాపం నుండి విడుదల విమోచించబడిన వారినే గదా 'విశ్వాసులు' అని పిలిచేది. 'నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినక పోవును' (కీర్తన 66:18) 'దురభిమాన పాపములు, సులువుగా చిక్కుల బెట్టు పాపములు' అనేవి విశ్వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నవి. వ్యర్ధమైన వాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము. (కీర్తన 119:37) యెషయా ప్రవక్త మాటల్లో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. (యెషయా 59:2) ఉజ్జీవానికి ప్రధాన అవరోధం 'పాపం' కనుక సమస్త పాప పంకిలం నుండి సంపూర్ణంగ బయటకు రావాలి. అంతకు మించి వేరే గత్యంతరం లేదు. రాజీపడవలసిన దేమి లేదు. మనం పాపంతో కప్పబడినంత కాలం ప్రభువు ఏమి చేయడు, చేయలేడు, ఎందుకంటె ఆయన పాపాన్ని ద్వేషించేవాడు (పాపిని కాదు) పరిశుద్ధుడు కనుక.

ఏవిధంగా ఒప్పుకోవాలి : పాపాన్ని ఒప్పుకొననంత కాలం పరిశుద్ధాత్మ ఉజ్జీవాన్ని రగిలింప చేయడు. ప్రతి విషయంలో విశ్వాసి తన్నుతాను సరిచేసికొనబద్ధుడై యున్నాడు. 'ఎవడైనను - నేను దేవుని ప్రేమించు చున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు, తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొందియున్నాము. (1 యోహాను 4:20,21).

మూడు విధాలుగా పాపంను ఒప్పుకోవాలి

1) రహస్యమైనవి : దేవునికి వ్యతిరేకంగ చేసిన పాపాలను దేవుని యెదుట ఒప్పుకొని వాటి నుండి ప్రక్షాళన గావించబడాలి. 'మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. (1యోహాను 1:9) నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని (కీర్తన 32:5)

2) వ్యక్తిగతమైనవి : నీ పొరుగు వాడికి, సహోదరునికి నీవు హాని చేసియుంటే, ఆ విషయంలో అతనితోను, దేవునితోను నీవు ఒప్పుకొని క్షమించబడాలి. నీవు ఒప్పుకొననంత కాలం నీకు మనస్సులో నెమ్మదిలేక క్షమాపణ దొరకదు. ..... మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. (మత్తయి 5:23,24)

3) బహిరంగమైనవి : ఎక్కువ మందికి నీ వలన హాని జరిగితే బహిరంగముగానే వాటిని ఒప్పుకోవాలి. తప్పిదాలను ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. ఈ రీతిగా నీవు ఒప్పుకోవాలంటే నీలో అహంభావం అంతరించాలి. 'మీరు దేని గూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచ కుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించి యున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. (2 కొరింథి 2:10,11)

అనేకమంది రాత్రుల్లో కలుసుకొని ఎంతో హృదయ వేదనతో ప్రభువు సన్నిధిలో ప్రార్ధిస్తున్నారు. కాని వారి ప్రార్ధనలకు జవాబు రావడం లేదు. ఉజ్జీవింపబడడం లేదు. ఏమిటీ పరిస్థితి? కారణమేమై ఉంటుంది? మరొకసారి యెషయా 59:2 గమనిద్దాం.

మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను. (వేరు పరచెను).ఏమేమి ఒప్పుకోవాలి : దేవుని దీవెనల జడివానతో మనం తడిసి ముద్దయై తృప్తి పొందాలంటే ముందుగా మన దోషాలను ఒప్పుకోవాలి. ఈ క్రింది ప్రశ్నల ద్వారా దేవుడు నీతో మాట్లాడేందుకు ఒప్పుకో.

- నిన్ను హింసించి, తూలనాడి బాధించిన వారిని నీవు క్షమించావా? వారి యెడల నీ హృదయంలో అసూయ పేరుకొనిపోయిందా? ఇతరులతో విరోధం ఉన్నదా? సరిచేసుకోవడానికి విముఖుడవుగా నున్నవా?

- కోపంతో నున్నారా? ఇతరుల యెడల కోపాన్ని అసహనాన్ని కలిగియున్నావా? నీకు కష్టం కలిగించినవారు శిక్షించబడాలని కోరుకుంటున్నావా?

- నీ యెదుట ఇతరులను గౌరవించినపుడు నీవు అసూయ చెందుచ
ఉజ్జీవానికి