వాక్యసందేశముPost Date:2014-06-27//No:63

అంత్య కాలములో ఆకలి..... మనుష్యుడు తన స్నేహితులతో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను నిర్గమ 33:11

80 సం|| దాటిన వృద్ధుడైన మోషెతో స్నేహితుడు మాట్లాడినట్లుగా హృదయము విప్పి మాట్లాడిన సర్వశక్తి గల దేవుడు బాలుడైన సమూయేలును స్నేహితుడు పేరుపెట్టి పిలిచి మాట్లాడినట్లుగా తన చిత్తాన్ని రాబోయే కాలంలో జరుగబోయే సంగతులను స్పష్టంగా మాట్లాడాడు.

ప్రియులారా! బాలుడైన సమూయేలుతో 'ప్రభువు మాట్లాడాడు' అనే విషయం చాలా మంది క్రైస్తవులకు తెలుసు కాని 'ఏమి' మాట్లాడాడో చాలామందికి తెలియదు...... ఆ రాత్రి ప్రభువు సమూయేలుతో మాట్లాడిన మాటల ప్రారంభం 'వినువారి చెవులు గింగురు మనే' ఒక కార్యాన్ని నేను ఇశ్రాయేలీయులలో చేస్తాను 1 సమూ 3:11.

గింగురుమనే చెవులు : షొమ్రోను పట్టణంలో ఎలీషా ప్రవక్త కాలంలో చరిత్రలోనే అరుదైన ఒక ఘోరమైన కరువు సంభవించినట్లు 2 రాజు 6:24-33 వచనాలలో ప్రభువు వ్రాసి పెట్టాడు.

సిరియా సైన్యము షోమ్రోను పట్టణాన్ని అతి దారుణంగా ముట్టడి వేయటం వలన.... కలిగిన ఘోరమైన కరువుకు తట్టుకోలేక ప్రజలు ఆకలితో వేసే కేకలు ఆకాశానికి అంటుతూ..... ఆకలితో ప్రతిరోజు వందలమంది చచ్చిపోతున్న రోజులలో కోట ప్రాకారాలపై తిరుగుతున్న రాజు దగ్గరకు ఇద్దరు స్త్రీలు వచ్చి న్యాయం కోసం 'రాజువైన, నా ఏలినవాడా! సహాయము చేయమని' కేకలు వేశారు 2 రాజు 6:27.

'ఆహారమిచ్చి సహాయము చేయటానికి ఏమిలేదు' అని జవాబిచ్చిన రాజుతో ఒక స్త్రీ చెపుతున్న గుండెలు పగిలే మాటలు 'ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను తిని వేద్దామని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసికొని తిన్నాము, అయితే మరునాటి యందు నేను దాని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగాను కాని, అది తన బిడ్డను దాచిపెట్టింది అని చెప్పింది 2 రాజు 6:28-30.

కట్టుకధ కాదు :- కన్నతల్లి, తాను తొమ్మిది నెలలు పెంచి, ప్రసవ వేదనతో కనిన బిడ్డను..... అతి దారుణంగా చంపి ఆ మాంసం పీక్కుని తినటం...... కేవలం 'కట్టుకధ' అని భావించే వాళ్ళు చాలామంది ఉంటారు. కాని ప్రభువు 'మోషే ప్రవక్త' ద్వారా పలికించిన శక్తివంతం అయిన ధర్మశాస్త్రం గురించి క్రీస్తు ఒక్క ఆశ్చర్యకరమైన మాట చెప్పారు.

'ఆకాశమును, భూమియు గతించిపోతాయి గాని, ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దానినుండి యొక పొల్లయినను, ఒక సున్నమైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను' మత్తయి 5:17. ధర్మశాస్త్రాన్ని దేవుడు చెపుతుండగా వ్రాసిన మోషె ధర్మశాస్త్ర మంతటిలో అతికఠినమైన 'చెవులు గింగురుమనే' కీడు ఆయనను విసర్జించిన ఇశ్రాయేలీయులకు తప్పక జరిగి తీరుతుందని వ్రాశాడు.

నీ గ్రామములో నీ శత్రువులు నిన్ను ఇరుకు పరుచుట వలనను, ముట్టడి వేయుట వలనను ఏమి లేకపోవుట చేత, మీలో మృధుత్వమును అతి సుకుమారము గలిగి మృధుత్వము చేతను సుకుమారము చేతను నేల మీద అరికాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడబోవు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిట పెనిమిటి వలనైనను, తన కుమారుని యెడలనైనను, కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును' ద్వితీ : 28:57. అప్పుడు.... నీ గర్భఫలమును...... నీ కుమారుల యొక్కయు, నీ కుమార్తెల యొక్కయు మాంసము తిందువు. తండ్రి...... తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైనను ఎవనికి పెట్టడు. ద్వితి : 28:53-55.

ప్రియులారా! ప్రవక్తలలో మొదటి వాడిగా ఎంచబడుతున్న మోషే ప్రవక్త ద్వారా 'హోరేబు'లో ప్రభువు చెప్పిన ఈ ప్రవచనం...... ఎలీషా ప్రవక్త కాలంలో.... తరువాత యిర్మియా ప్రవక్త కాలంలో అక్షరాలా నెరవేరింది.

ఏడ్పుగ్రంధం : కరువు రాకముందు అతిప్రేమ వాత్సల్యము గలిగిన సుకుమార మృదువైన స్త్రీలు ఘోరమైన ఆకలి తట్టుకోలేక తాము కని, పాలిచ్చి, గోరు ముద్దలు తినిపించిన తమ పసి పిల్లలను దారుణంగా చంపితినటం.... తమ కన్న బిడ్డల మాంసం కొరకు తల్లిదండ్రులు...... ఘోరంగా కొట్టుకోవటం చూసిన ప్రవక్త అయిన యిర్మియా గుండెలు బాదుకుంటూ...... కన్నీరు ఏరులైపారేలా ఏడుస్తూ వ్రాసిన గ్రంధమే..... విలాప వాక్యాలు. ఈ గ్రంధానికి మరోపేరు ఏడ్పు గ్రంధము. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి విలాప 4:10. మీరు మీ కుమారుల మాంసమును, మీ కుమార్తెల మాంసమును తింటారు.' లేవి 26:29. ఈ మాటలు చదువుతున్న వారికి బహుఘోరమైన వేదనగా ఉన్నా..... ఇవి వినేవారి చెవులు గింగురుమంటున్నా ఆకలికి తట్టుకోలేక తల్లులే పిల్లల్ని పీక్కు తినడం యధార్ధంగా జరిగిన చారిత్రక సత్యము.

కరువు అంటే ఒకటి రెండు రోజులు భోజనం లేక పస్తు పండుకోవటం అని మాత్రమే చాలామందికి తెలుసు కాని కరువు 'రక్కసి యొక్క వికృత స్వరూపం' చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

ప్రియులారా! ప్రపంచ చరిత్రలో ఘోరమైన ఆకలికి తట్టుకోలేక పసి బిడ్డలను పీక్కుతిన్న భయంకరమైన ఎన్నో యదార్ధ సంఘటనలు గ్రంధస్థం చేయబడి ఉన్నాయి.... చరిత్ర గ్రంధాలకు ఎక్కని 'ఎన్నోవేల ఘోర సంఘటనలు' కాలగర్భంలో కలిసిపోయాయి.

ఆఫ్రికా ఖండంలో 'సోమాలియా' అనే ప్రాంతంలో అతిభయంకరమైన కరువు ఇంకా కొనసాగుతుంది. కొద్దిరోజుల క్రిందట కరువులేని ప్రాంతం నుండి ఒక ఆసామి ట్రైన్‌లో చాలా దూరం నుండి ప్రయాణం చేసి, అతి ఘోరమైన కరువు ఉన్నా 'సోమాలియా' ప్రాంతంలో ట్రైన్‌ దిగి రైల్వేస్టేషన్‌ బయటకు వచ్చి 'ఒక అరటి పండు' తొక్క పడేసి ఆ అరటికాయ తినే లోపు..... అతడు పడవేసిన 'అరటికాయ తొక్క కొరకు 10 మంది పిల్లలు విపరీతంగా కొట్టుకొంటూ' చేతికి వచ్చిన అరటికాయి తొక్క తుంపు నోట్లో వేసుకోవటం ఆశ్చర్యంతో చూశాడు. 'అరటికాయ తొక్క తిందాము' అని కనీసం సరదాకి కూడ అనిపించని మనకు అరటికాయ తొక్క కొరకు 10 మంది వ్యక్తులు కొట్టుకొనే.... ఘోర ఆకలి గురించి ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నాను.

రాబోయే కర
అంత్య